Latest Updates
-
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే!
తిరుమల ఆలయ తాళం తెరుచుకోకపోవడానికి పూజారుల పొరపాటే కారణమా ?
సంప్రదాయాలు, పూజలు, నిబంధనలకు పెట్టింది పేరు తిరుమల ఏడుకొండల స్వామి ఆలయం. ఉదయం సుప్రబాత సేవ నుంచి రాత్రి పవళింపు సేవ వరకు అన్నీ.. నియమ నిబంధనల ప్రకారం జరగాల్సింది. ఒక్క నిమిషం కూడా అటు ఇటు కాకుండా.. ఆలయ అధికారులు ఈ నియమాన్ని పాటిస్తున్నారు. ఏ గడియలో జరగాల్సిన పూజా కార్యక్రమం ఆ గడియలో నిర్వహించాల్సిందే. అదే తిరుమల ఆలయం ప్రత్యేకత.
తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి తొలిదర్శనం ఎవరికీ...? వారికే ఎందుకంత ప్రాధాన్యత..?
ఇండియాలో అత్యంత సంపన్న, ఎక్కువమంది భక్తులు సందర్శించే ఆలయాల్లో తిరుమల దేవాలయం ఒకటి. ఈ ఆలయంలో భక్తుల వస్త్రధారణకు కూడా చాలా ప్రాధాన్యత ఇస్తారు. సంప్రదాయ దుస్తుల్లో వస్తేనే ఆ ఏడుకొండలవాడి దర్శనం లభిస్తుంది. అలాంటి ఆలయ నియమాలు అతిక్రమిస్తే.. ? ఇంకేమైనా ఉంటుందా ?
తిరుమల శ్రీవారి గురించి 10 నిజాలు: చిక్కు పడని వెంకన్న కురులు.. వీపు వెనుక తడి.. సముద్రపు ఘోష..!
తిరుమల ఆలయం తాళం ఒకరోజు తెరుచుకోలేదు అనేది పెద్ద మిస్టరీగా మిగిలింది. తిరుమల ఆలయంలో బంగారు వాకిలి తాళం ఎందుకు తెరుచుకోలేదు ? ఎప్పుడు తెరుచుకోలేదు ? తిరుమల ఆలయంలో.. ఆ దేవదేవుడి సన్నిధిలో ఆలయ పూజారులు నిబంధనలు ఉల్లంఘించారా ? అందుకే ఆలయం తలుపులు తెరుచుకోలేదా ? ఆలయం తాళం తెరుచుకోకపోవడం వెనక దేవుడి ఆగ్రహం ఉందా ? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే.. ఈ కింది స్లైడ్స్ క్లిక్ చేయాల్సిందే..

అతిపెద్ద పొరపాటు
తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయంలోని గర్భగుడి అయిన బంగారు వాకిలి తాళం తెరుచుకోకపోవడంతో.. ఆలయ పురోహితులు, అధికారులకు అతిపెద్ద ఇబ్బందిగా మారింది. అయితే ఇదంతా.. శ్రీలంక ప్రెసిడెంట్ మైత్రిపాల సిరీసేనా, అతని భార్య ఆలయ దర్శనానికి వచ్చినప్పుడు జరిగింది.

తాళం పగలగొట్టారు
ఎలాగైతేనేం.. వీవీఐపీ దర్శనం సందర్భంగా.. తాళం తెరుచుకోకపోవడంతో.. దాన్ని పగులగొట్టి.. శ్రీలంక ప్రెసిడెంట్ కి ఆ దేవుడి దర్శనం కల్పించారు. అలాగే ఆ రోజంతా మామూలుగానే భక్తులందరికీ.. ఆలయ దర్శనం సజావుగా సాగింది.

అసలేం జరిగింది ?
ఈ తాళం తెరుచుకోకపోవడం వెనక చాలా విషయం ఉంది. ఈ డ్రామా అంతా ఉదయం 2 గంటలా 15 నిమిషాలకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆవరణ, బంగారు వాకిలి (గర్భగుడి) దగ్గర జరిగింది. స్వామివారికి చేసే మొదటిసేవ సుప్రబాత సేవ చేయడానికి వచ్చిన ఆలయ పూజాలకు ఈ సంఘటన ఎదురైంది.

అసలేం జరిగింది ?
సాధారణంగా స్వామివారిని నిద్రలేపే సుప్రబాత సేవ ఉదయం 3 గంటలకు నిర్వహిస్తారు. దీనికోసం ఆలయ పూజారులు 45 నిమిషాలు ముందుగా వచ్చి.. ఆలయాన్ని శుభ్రం చేసి, ఏర్పాట్లు చేస్తారు. బంగారు వాకిలి తెరవడానికి మూడు కీలతో తాళం ప్రత్యేకంగా తయారు చేశారు. ఈ మూడు కీలను ఒకేసారి ఉపయోగించి తాళం తీయాలి. అయితే మొదటి కీ పెట్టగానే.. అది తాళంలో ఇరుక్కుని.. ఇరిగిపోయింది.

అసలేం జరిగింది ?
శ్రీలంక ప్రెసిడెంట్, భార్య సుప్రబాత సేవ కోసం అప్పటికే ఎదురుచూస్తున్నారు. మహాద్వారం దగ్గర ఆ వీఐపీ జంట ఉన్నారు. బంగారు వాకిలి దగ్గరకు చేరుకోవడానికి కేవలం వెండి వాకిలి, ధ్వజస్థంభం మాత్రమే.. మధ్యలో ఉన్నాయి. 500 అడుగుల దూరంలో ఉన్నారు.

తాళం ఇరగొట్టారు
చివరికి తాళం విరగొట్టి.. ఎలాగూ.. సుప్రబాత సేవను సాధారణ సమయం అంటే 3 గంటలకు నిర్వహించారు.

తప్పేంటి
ముందు రోజు రాత్రి ఏకాంత సేవ తర్వాత బంగారు వాకిలి తలుపు మూసేటప్పుడు తాళం సరిగ్గానే పనిచేసిందని.. ఆలయ పూజారులు, అధికారులు వివరించారు.

ప్రత్యేకంగా తయారు చేశారు
ఆలయం కోసం ఈ తాళం ప్రత్యేకంగా చేయించామని.. ఇలాంటి సమస్య గతంలో ఎప్పుడూ ఎదురవలేదని.. ఫ్యూచర్ లో మళ్లీ ఇలాంటి సమస్య ఎదురవకుండా జాగ్రత్త పడతామని.. టీటీడీ అధికారులు చెప్పారు. దీని కోసం ప్రత్యేక పూజలు అవసరం లేదని వివరించారు.

వివరణ
అయితే ఈ తాళం చాలా పాతది కావడం వల్ల.. కీ ఇరుక్కుపోయిందని వివరించారు.

వాస్తవానికి ఏం జరిగింది ?
రాత్రి బాగా పనిచేసిన తాళం ఉదయానికి ఏమయిందనేది అందరినీ వేధిస్తున్న ప్రశ్న..

ఏదో రహస్యం ఉంది ?
తాళంలోపల కీ ఇరుక్కుపోయిందనేది అవాస్తవం అని చాలా మంది భావిస్తున్నారు. దాని వెనక ఆధ్యాత్మిక తప్పిదం ఏదో ఉందని.. ఆ రోజు ఆలయ అధికారులు, పూజారులు ఏదో తప్పు చేశారని చాలా మంది భావిస్తున్నారు.

దేవుడి శిక్ష ?
ఆలయ అధికారులు, పూజారులు చేసిన పొరపాటు వల్ల దేవుడే వాళ్ల శిక్ష విధించాడని.. పలువురు అభిప్రాయపడుతున్నారు. దేవుడు తాళం తెరుచుకోకుండా.. వాళ్లని ఇరుకున పెట్టి శిక్షించాడని చెబుతున్నారు.

అసలు కారణం
గౌరవనీయులైన శ్రీలంక ప్రెసిడెంట్ ని ఆహ్వానించడానికి చాలా ఆత్రుతగా, ఆర్భాటం చేశారు. దీంతో.. అతను దేవుడి దర్శనం కోసం ఎదురు చూడటం బాగోదని భావించిన ఆలయ అధికారులు, పూజారులు శ్రీవెంకటేశ్వర స్వామినే కొన్ని నిమిషాల ముందు నిద్రలేపాలని భావించారు.

ముందుగా తాళం తీసే ప్రయత్నం
నిత్యం ఉదయం 2 గంటలా 20 నిమిషాలకు ఆలయ తలుపులు తీస్తారు. కానీ.. ఆ రోజు అంటే శ్రీలంక ప్రెసిడెంట్ దర్శనానికి వచ్చిన రోజు ఆలయం తలుపులు.. ఉదయం 2 గంటలా 15 నిమిషాలకు తెరిచే ప్రయత్నం చేశారు. అలా ఆలయ నిబంధనను ఉల్లంఘించారు.

సమయం చాలా ముఖ్యం
వెంకటేశ్వర స్వామికి చేసే ప్రతి సేవకు టైం చాలా ముఖ్యమైనది. టైమింగ్స్, నియమాలు, నిబంధనలు.. ఎలా ఉంటే అలా పాటించడం ఆలయ సంప్రదాయం.

వాళ్లు ఎందుకు అలా చేశారు ?
ఈ నిబంధనలు, ఆలయ కట్టుబాట్లు తెలిసిన ఆలయ అధికారులు, పూజారులు ఎందుకు ఇలా చేశారు ? ఆలయం తలుపులు ఎందుకు ముందుగానే తీయాలని భావించారు ?

మనుషుల తప్పు
ఎలాగైతేనేం.. ఇదంతా.. మనుషులు చేసిన పొరపాటు అని దీని గురించి ఎక్కువగా ఒత్తిడికి లోనవ్వాల్సిన అవసరం లేదని ఆలయ అధికారులు చెప్పుకొచ్చారు.

మిస్టరీ
ఆలయం తలుపు తాళం ఇరుక్కుపోవడం అనేది.. మనుషుల తప్పా , దేవుడి శిక్షా అనేది మిస్టరీగా మారింది. అయితే.. ఇదంతా దేవుడి విధించిన శిక్ష అని.. వీఐపీల కోసం.. దేవుడినే ముందుగా నిద్రలేపాలనుకోవడం ఆలయ అధికారులు, పూజారుల తప్పు. అందుకే మునుపెన్నడూ లేనిది ఇప్పుడు అలా జరిగిందని.. ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications











