Latest Updates
-
పచ్చి కొబ్బరి మసాలాతో అదిరిపోయే కర్ణాటక స్పెషల్ చిత్రాన్నం.. ఒక్కసారైనా రుచి చూడాల్సిందే.! -
గురు గ్రహం నక్షత్ర మార్పు: ఈ నాలుగు రాశుల వారికి చదువు, ఉద్యోగాల్లో మహర్దశ ప్రారంభం.! -
ఇంట్లోకి గబ్బిలం వస్తే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
చికెన్ కర్రీలోకి అదిరిపోయే కాంబినేషన్.. కేరళ మలబార్ పరోటా ఇలా చేస్తే పొరలు పొరలుగా వస్తుంది! -
అల్లం, పచ్చిమిర్చి ఘాటుతో కరకరలాడే పంచ్ మెల్ దాల్ పకోడా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి? గుండె జబ్బులకు ఇది ముందస్తు సంకేతమా! -
ఆకు కూరల కంటే ఎక్కువ బలం: మోకాళ్లలో గుజ్జు రప్పించి, ఎముకల్ని గట్టిగా చేసే నల్లేరు రోటి పచ్చడి -
Fridge Vastu: మీ ఇంట్లో ఫ్రిజ్ పైన ఈ 3 వస్తువులు పెడితే పట్టిందల్లా బంగారమే! -
చపాతీ, దోశల్లోకి అదిరిపోయే మలేషియన్ ఎగ్ మసాలా..4 గుడ్లు ఉంటే ఈజీగా ఇలా చేసేయండి -
ఫైబర్, పోషకాలు నిండిన పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్..సొరకాయ మునగాకు ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే..
మీ పిల్లలు ఫోన్ ఇస్తేనే అన్నం తింటున్నారా? ఈ ట్రిక్ తెలిస్తే అసలు ఫోన్ జోలికే వెళ్లరు!
ఈ రోజుల్లో చాలా మంది తల్లులు, తండ్రులు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య.. పిల్లలకు అన్నం తినిపించడం. ముఖ్యంగా చేతిలో ఫోన్ పెట్టనిదే పిల్లలు కనీసం నోరు కూడా తెరవని పరిస్థితి. మీ ఇంట్లో కూడా ఇదే జరుగుతోందా? ప్రతి పూట అన్నం తినిపించడం ఒక పెద్ద టాస్క్ లా మారిపోయిందా?

దాదాపు ప్రతి ఇంట్లోనూ నేటితరం తల్లిదండ్రులు ఈ సమస్యతో పోరాడుతున్నారు. కానీ ఇక్కడ చాలామంది గ్రహించని, ఎవరూ పెద్దగా పట్టించుకోని ఒక చేదు నిజం ఉంది. ఇది ఆహారానికి సంబంధించిన సమస్య కాదు, మెదడుకు సంబంధించిన సమస్య అని సైకాలజిస్ట్ దివ్య తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో చెప్పారు. పిల్లలు ఫోన్ లో కార్టూన్ వీడియోలు చూస్తున్నప్పుడు లేదా గేమ్స్ ఆడుతున్నప్పుడు వారి మెదడులో డోపమైన్ అనే రసాయనం విడుదలవుతుంది. ఇది వారికి తక్షణ ఆనందాన్ని, కిక్ ను ఇస్తుంది.
ఆ స్క్రీన్ ఇచ్చే మత్తు ముందు..నిదానంగా, ప్రశాంతంగా కూర్చుని చేతితో కలుపుకుని తినే భోజనం వారికి చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. అంతకంటే ప్రమాదకరమైన విషయం ఏమిటంటే, పిల్లల దృష్టి మొత్తం ఫోన్ స్క్రీన్ పైనే ఉండటం వల్ల వారి కడుపు నిండిందా లేదా అనేది వాళ్లకు అసలు తెలియదు. కడుపు నిండిందనే సిగ్నల్ మెదడుకు అందదు. దీనివల్ల జీర్ణ సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. మెల్లమెల్లగా వారి దృష్టిలో భోజనం చేయడం అనేది ఒక శిక్షలా, ఫోన్ చూడటం అనేది ఒక గిఫ్ట్ లా మారిపోతుంది.
ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి?
చాలా మంది తల్లిదండ్రులు చేసే అతి పెద్ద తప్పు.. ఒక్కసారిగా పిల్లల చేతిలోంచి ఫోన్ లాగేసుకోవడం. ఇలా చేస్తే భోజన సమయం ఒక యుద్ధ వాతావరణంలా మారుతుంది. దానికి బదులుగా ఈ కింది పద్ధతులను పాటించి చూడండి.
మార్పు నెమ్మదిగా జరగాలి
రాత్రికి రాత్రే అద్భుతాలు జరగవు. ఫోన్ లాగేసుకుని బలవంతం చేయకండి. ఈ రోజు ఫోన్ లేకుండా మొదటి రెండు ముద్దలు తినిపించండి. ఆ తర్వాత కొన్ని రోజులకు ఐదు ముద్దలు, ఆ తర్వాత సగం భోజనం... ఇలా క్రమక్రమంగా స్క్రీన్ సమయాన్ని తగ్గించండి. దీనివల్ల పిల్లలకు ఏడుపు రాదు.
రోజులో ఒకసారి స్క్రీన్ ఫ్రీ భోజనం
కుటుంబం మొత్తం ఒకే దగ్గర కూర్చుని తినడం అలవాటు చేసుకోండి. ఆ సమయంలో టీవీ, ఫోన్ లాంటివి ఏవీ ఉండకూడదు. పిల్లలు ఎప్పుడూ పెద్దలు ఏం చేస్తున్నారో అదే చూసి నేర్చుకుంటారు. మీరు ఫోన్ పక్కనపెట్టి ఆస్వాదిస్తూ తింటే, వాళ్లు కూడా కచ్చితంగా మిమ్మల్నే అనుకరిస్తారు.
ఆహారాన్ని ఆకర్షణీయంగా మార్చండి
పల్లలకు రంగులంటే, బొమ్మలంటే ఇష్టం. ఇడ్లీలను స్మైలీ ఫేస్ లా మార్చడం, కూరగాయలను రకరకాల ఆకృతులలో కట్ చేయడం, ప్లేట్ నిండా రంగురంగుల పదార్థాలు (క్యారెట్, బీట్ రూట్ వంటివి) ఉండేలా చూసుకోవడం చేయండి. ఇది వాళ్లకు ఆహారం మీద ఆసక్తిని పెంచుతుంది.
భోజన సమయంలో ముచ్చట్లు
పిల్లలతో మాట్లాడుతూ తినిపించండి. చూడు ఈ క్యారెట్ ఎంత క్రంచీగా ఉందో, సౌండ్ వస్తోంది కదూ? ఒకసారి టేస్ట్ చూస్తావా?, ఈ కూర రంగు భలే ఉంది కదూ అంటూ ఆహారం గురించి వారితో సరదాగా మాట్లాడండి. అమ్మమ్మల కాలం నాటి చందమామ కథలు చెప్పడం ద్వారా వారి దృష్టిని ఆహారంపైకి మళ్లించవచ్చు.
ఓపిక చాలా అవసరం
ఈ ప్రయాణంలో మొదటి కొన్ని రోజులు పిల్లలు ఏడవవచ్చు, అన్నం తిననని మారాం చేయవచ్చు, ప్లేట్ విసిరేయవచ్చు. ఇదంతా చాలా సాధారణం. కానీ మీ నిర్ణయానికి కట్టుబడి ఉండండి. వారి ఏడుపు చూసి జాలిపడి మళ్లీ ఫోన్ ఇస్తే మొదటికే మోసం వస్తుంది.
గుర్తుంచుకోండి..
ఇదొక నెమ్మదైన ప్రక్రియ. రెండు మూడు రోజుల్లోనే మీ పిల్లల్లో మార్పు రావాలని ఆశించకండి. కానీ మీ ప్రయత్నంలో నిలకడ ఉంటే చాలు, కచ్చితంగా మీ పిల్లలు ఫోన్ లేకుండానే సంతోషంగా, ఆరోగ్యంగా భోజనం చేయడం ప్రారంభిస్తారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
