Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
పెళ్లి కాలేదా? క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువే!
ఫ్యామిలీ పంక్షన్స్ లో లేదా కాలనీలో కనిపించినప్పుడల్లా ఇంకా సింగిల్ గానే ఉన్నావా? పెళ్లెప్పుడు చేసుకుంటావు? అని బంధువులు, ఇరుగుపొరుగు అడగడం సహజం. ఆ ప్రశ్న వినగానే మనకు ఎక్కడలేని చిరాకు వస్తుంది. వాళ్లిచ్చే ఉచిత సలహాలు, సంబంధాల గోల భరించలేక అక్కడినుంచి మెల్లగా జారుకుంటాం.

కానీ మీరు సింగిల్ గా ఉండాలన్న మీ నిర్ణయానికి, మీ ఆరోగ్యానికి.. అందులోనూ క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధికి ఓ సంబంధం ఉందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. పెళ్లి చేసుకోని వారిలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
అధ్యయనం ఏం చెబుతోంది?
అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ మియామీకి చెందిన సిల్వెస్టర్ కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ పరిశోధకులు ఒక ఆసక్తికరమైన విషయాన్ని కనుగొన్నారు. 2015 నుంచి 2022 వరకు ఏకంగా 40 లక్షల క్యాన్సర్ కేసులను పరిశీలించిన తర్వాత క్యాన్సర్ రీసెర్చ్ కమ్యూనికేషన్స్ జర్నల్ లో ఒక రిపోర్ట్ ని ప్రచురించారు. దీని ప్రకారం.. పెళ్లి చేసుకున్నవారితో పోలిస్తే, జీవితంలో అసలు పెళ్లే చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయిన వ్యక్తుల్లో క్యాన్సర్ బారిన పడే రిస్క్ చాలా ఎక్కువగా ఉందట. ముఖ్యంగా ధూమపానం, ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే క్యాన్సర్లు వీరిలో ఎక్కువగా కనిపిస్తున్నాయంట
స్త్రీ, పురుషుల్లో వేర్వేరుగా ముప్పు..
ఈ అధ్యయనంలో ఆశ్చర్యకరమైన లెక్కలు వెలుగుచూశాయి. పెళ్లయిన వారితో పోలిస్తే.. పెళ్లికాని పురుషుల్లో క్యాన్సర్ ముప్పు 70 శాతం ఎక్కువైతే, స్త్రీలలో ఇది ఏకంగా 85 శాతంగా ఉంది. పెళ్లికాని పురుషుల్లో యానల్ క్యాన్సర్ (మలద్వార క్యాన్సర్) ముప్పు ఐదు రెట్లు ఎక్కువగా ఉండగా, పెళ్లికాని మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ (గర్భాశయ ముఖద్వార క్యాన్సర్) ముప్పు మూడు రెట్లు ఎక్కువగా ఉంది. హెచ్‌పీవీ (HPV) ఇన్ఫెక్షన్ల పట్ల సరైన అవగాహన లేకపోవడమే దీనికి కారణం. ః
అలాగే మహిళల్లో పిల్లలు పుట్టడం వల్ల ఓవేరియన్ (అండాశయ) క్యాన్సర్ల ముప్పు తగ్గుతుందని, పెళ్లికాని వారిలో ఆ అవకాశం లేకపోవడం వల్లే రిస్క్ పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

వివాహ బంధంతో రక్షణ ఎలా?
ఇంతకీ పెళ్లికి, క్యాన్సర్ కు లింక్ ఏంటి? పెళ్లి చేసుకుంటే క్యాన్సర్ రాదా? అంటే కచ్చితంగా రాదని కాదు. వివాహ బంధంలో ఉన్నవారికి మంచి ఎమోషనల్ సపోర్ట్ ఉంటుంది. భాగస్వామి ఆరోగ్యంపై మరొకరు శ్రద్ధ తీసుకుంటారు. సమయానికి హెల్త్ చెకప్ లు చేయించుకోవడం, ఆర్థిక స్థిరత్వం ఉండటం వల్ల జబ్బును ప్రారంభ దశలోనే గుర్తించి బెటర్ ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది. అదే ఒంటరిగా ఉండేవారు తమ ఆరోగ్యాన్ని కొంత నిర్లక్ష్యం చేసే ప్రమాదం ఉంది. పైగా పెళ్లయిన వారు చెడు అలవాట్లకు దూరంగా, ఆరోగ్యకరమైన జీవనశైలిని గడుపుతారని పరిశోధకులు చెబుతున్నారు.
సింగిల్స్ భయపడొద్దు.. అప్రమత్తంగా ఉండండి
ఈ అధ్యయనం చదివి క్యాన్సర్ రాకూడదని వెంటనే పెళ్లిపీటలు ఎక్కాల్సిన అవసరం లేదు. ఇది బంధువులు చేసిన హెచ్చరిక కాదు, శాస్త్రవేత్తలు చేసిన సూచన మాత్రమే. మీరు సింగిల్ గా ఉంటున్నట్లయితే, మీ ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని దీని అర్థం.
ముఖ్యంగా 50 ఏళ్లు పైబడిన వారు వయసుతో పాటు వచ్చే క్యాన్సర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. క్రమం తప్పకుండా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవడం, హెచ్ పీవీ వ్యాక్సిన్లు వేయించుకోవడం, ధూమపానం లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండటం ఎంతో అవసరం. వివాహం అనేది క్యాన్సర్ ను నిరోధించే మ్యాజిక్ పిల్ కాకపోయినా అదొక రక్షణ కవచంలా పనిచేస్తుందని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది.



Click it and Unblock the Notifications
