Latest Updates
-
మెతుకు మిగల్చకుండా తినే రుచి..తమిళనాడు స్పెషల్ దిండిగల్ తలపకట్టి చికెన్ బిర్యానీ ఇంట్లోనే చేసుకోండిలా.. -
క్రంచీ, టేస్టీ జీడిపప్పు పకోడి..మస్త్ కిక్కిచ్చే స్నాక్ ఈజీగా చేసుకోండిలా.. -
కరివేపాకు మరమరాలు..మూవీ, వెబ్ సిరీస్ చూస్తూ తినడానికి బెస్ట్ టేస్టీ,హెల్తీ స్నాక్ ! -
డీప్ ఫ్రై లేని హెల్తీ స్నాక్..సూపర్ టేస్టీ సగ్గుబియ్యం పొంగనాలు ఈజీగా ఇంట్లో చేసుకోండిలా.. -
ఈ చిన్న సీక్రెట్ తెలిస్తే..ఇంట్లోనే క్షణాల్లో రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ,సాఫ్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ -
వంకాయ దోసకాయ పచ్చడి..ఏంట టేస్ట్ రా బాబు మైండ్ నుంచి పోవట్లేదు అనాల్సిందే! -
తల్లిదండ్రులూ బీ అలర్ట్..పిల్లలకు సిరప్ వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి -
భూటాన్ స్పెషల్ ఎగ్ ఏమా దత్షీ..స్వర్గానికి బెత్తెడే దూరం! -
పండుగ రోజే దారుణం..భర్త డోర్ ఓపెన్ చేయగానే ప్రియుడితో సరసాలాడుతూ భార్య..రెండ్ హ్యాండెడ్ గా దొరకడంతో.. -
జలుబు, దగ్గును మాయం చేసే చెట్టినాడ్ ఉల్లిపాయ రసం.. ఈ మసాలాతో చేస్తే టేస్ట్ అదుర్స్!
హారతి సమయంలో గంట ఎందుకు కొడతారు ?
పుణ్యక్షేత్రాల్లోకి, గుళ్లలోకి, దేవాలయాలకు వెళ్లినప్పుడు దేవుడికి ఎదురుగా కనిపించేది గంట. చిన్న గుడిలో అయినా.. గంట ఖచ్చితంగా ఉంటుంది. దేవుణ్ని స్మరించుకుంటూ.. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి... గంట కొట్టడం భక్తులకు అలవాటు
. గుడికి వెళ్లిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గంట కొడతారు. అలాగే గుళ్లో దేవుడికి హారతి ఇచ్చినప్పుడు కూడా గంట కొడతారు. అసలు గంట ఎందుకు కొడతారు ? అనే సందేహం చాలా మందికే ఉంటుంది..
కొబ్బరికాయ కొట్టే సంప్రదాయం ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది ?
ఆలయ గంటలో అనేక అర్థాలు, పరమార్థాలున్నాయి. దుష్టశక్తులను దూరం చేసే శక్తి గంటలలో ఉంది. అలాగే దేవాలయంలో గంట మోగిస్తే.. సకల శుభాలకు సంకేతంగా భావిస్తారు. ప్రత్యేక పూజల సమయంలో గంట కొడితే.. మనసుకి ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది.

గంటలో ప్రతి భాగానికి చాలా ప్రత్యేకత ఇమిడి ఉంది. గంట నాలుకలో సరస్వతీదేవి కొలువై ఉంటుందని, గంట ముఖభాగంలో బ్రహ్మదేవుడు, కడుపు భాగంలో రుద్రుడు, కొనభాగంలో వాసుకి, పిడి భాగంలో ప్రాణశక్తి ఉంటుందని.. అందుకే గంటను దైవస్వరూపంగా భావిస్తారు. అలాగే పిడిభాగం గరుడ, చక్ర, హనుమ, నంది మూర్తులతో దర్శనమిస్తుంది.
కర్మ సిద్ధాంతం గురించి ఆసక్తికర అంశాలు ?
కంచుతో తయారు చేసిన గంటను కొట్టినప్పుడు ఓం అనే స్వరం వినిపిస్తుంది. ఈ నాదం మనలోని చింతలు, సమస్యలను తొలగించి, మనసుని దేవుడిపై ఆధ్యాత్మిక భావన కలిగేలా చేస్తుంది. అలాగే గంట కొట్టడం వల్ల నలుదిక్కులా ఆ శబ్ధం వ్యాపించి దుష్టశక్తులను దూరంగా తరిమే శక్తి ఉంటుంది.

కొన్ని ఆలయాల్లో గుత్తులు, గుత్తులుగా ఒకేతాడుకి కొన్ని గంటలను తగిలించి ఉంటుంది. అయితే ఈ గంటలు అలంకారప్రాయమే కానీ.. ఎలాంటి ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉండదు. అలాగే హారతి సమయంలో గంట ఎందుకు కొడతారు అన్న సందేహం చాలా మందికి రావచ్చు. దేవతలందరినీ ఆహ్వానిస్తున్నామని చెప్పడానికి హారతి సమయంలో గంట కొడతారు. అంటే.. ఆలయంలో దేవుడి విగ్రహంలోకి సకలదేవతలను ఆహ్వానించడం. అందుకే.. హారతి సమయంలో.. ఆ వెలుగులో స్వామిని చూపిస్తారు. కాబట్టి హారతి ఇచ్చే సమయంలో కళ్లు మూసుకోకుండా.. దేవుడిని ప్రత్యక్ష దైవాంశ రూపంగా దర్శించాలి.



Click it and Unblock the Notifications
