Latest Updates
-
ప్రధానినైనా అరెస్ట్ చేయొచ్చు..కానీ మనదేశంలో ఈ ఇద్దరినీ ఎవ్వరూ టచ్ చేయలేరు! -
ఒంట్లో వేడిని తగ్గించే, ఇమ్యూనిటీ పెంచే సూపర్ టేస్టీ చిన్న ఉల్లిపాయల సాంబార్.. -
ప్రెగ్నెన్సీ ప్రయత్నాల్లో ఉన్నారా.. పీరియడ్స్‌లో ఈ మార్పులను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
Viral Video: సాఫ్ట్ వేర్ జాబ్ దండగ..ఈ ఐడియా సూపర్!..పెట్టుబడి లేకుండా 3 గంటల పనితో నెలకు రూ. 70 వేల ఆదాయం -
పూజలో ఉపయోగించే ఐదు దీపాల అర్థం ఏమిటి? -
నెలకు రూ.2.8 లక్షల జీతం..పని ఏంటంటే ఇతరుల తరపున 'బ్రేకప్' చెప్పడమే! -
ప్రొటీన్ పవర్.. అదిరిపోయే ఫ్లేవర్..అఫ్ఘానీ సోయా కర్రీ తయారీ విధానం ఇదే.. -
ఏం తిన్నా పొట్ట ఉబ్బరంగా అనిపిస్తోందా? అసలు కారణం ఫుడ్ కాదు.. -
చేపల కూర అంటే ఇలా ఉండాలి భయ్యా.. ఘుమఘుమలాడే బిహారీ స్టైల్ ఫిష్ కర్రీ! -
సాధారణ నొప్పులే కదా అని లైట్ తీసుకుంటున్నారా? క్యాన్సర్ ముప్పు కావచ్చు!
ఆషాఢంలో స్త్రీలు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు.. ప్రత్యేకత ఏమిటి?
గోరింటాకును ఇష్టపడని మహిళలంటూ ఉండరు. పండుగైనా, ఫంక్షనైనా గోరింటాకు పెట్టాల్సిందే. అలాంటి గోరింటాకును ముఖ్యంగా ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారంటే..? ఆషాడంలో ఆడవారి అరచేతుల్లో గోరింటాకు మెరిసిపోవాల్సిందే. ..
పెళ్లికాని అమ్మాయిల ఊహలకు గోరింటాకు అందాలు అద్దడానికే ఆషాడం వచ్చినట్లు ఉంటుంది. ఎందుకంటే ఎర్రగా పండిన అతివ అరచేతులను కళ్లింతలు చేసుకుని చూడటానికి ఆషాడం పుట్టి ఉంటుంది. చినుకు తడిచి చిద్విలాసంగా తట్టుకునేలా తరుణులకు అండగా ఉండటానికే ఆషాఢం సిద్ధపడి ఉంటుంది.
READ MORE: హెన్నా(గోరింటాకు)తో అద్భుతమైన హెయిర్ బెనిఫిట్స్
ఆషాఢమాసాన అరచేతుల్లో అందంగా మెరిసిపోయే గోరింట ఆధునిక జీవనంలో ఎన్ని పుంతలు తొక్కిందో తెలుసుకుందాం...కోమలమైన చేతుల కోసం ఎర్రని గోరింట మోసుకువచ్చే ఊసులేమిటో కనుక్కొందాము...
READ MORE: దుస్తుల మీద గోరింటాకు మరకలు తొలగించే చిట్కాలు
గోరింటాకు చెట్టు వర్షాకాలంలో కొత్త చిగుళ్లు తొడుక్కుంటుంది. ఈ చెట్టు లేత ఆకులను ముద్దగా నూరి, చేతులకు పెట్టి, రెండు నుంచి 6గంటల సేపు ఉంచితే చాలు ఎరుపు రంగులో మారుతుంది. ఔషధ గుణాలు మెండుగా ఉండే గోరింటాకును చేతులు, పాదాలకు అలంకరించుకోవడం వల్ల వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలు దరిచేరవని చెబుతుంటారు పెద్దలు.

ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడానికి గల ప్రత్యేకత ఏమిటి.?
ప్రాచీన కాలం నుండి సౌందర్య సాధానాలలో గోరింటాకు ప్రధాన పాత్రపోషిస్తూ వస్తోంది. చర్మ సంరక్షణలో మరొకటి సాటిలేదనిపించే ఈ ఆకు నుంచి అందమైన డిజైన్లెన్నో సృష్టించారు సృజనకారులు.....

ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడానికి గల ప్రత్యేకత ఏమిటి.?
ఆషాడంలో గ్రీష్మ రుతువు పూర్తి కావడంతో పాటు వర్ష రుతువు ప్రారంభం అవుతుంది. గ్రీష్మంలో మన శరీరం వేడితో కూడుకుని వుంటుంది. ఆషాడంలో బయటి వాతావరణం చల్లబడిపోతుంది.

ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడానికి గల ప్రత్యేకత ఏమిటి.?
అలాంటి సమయంలో మన శరీరంలోని వేడి.. బయట చల్లబడిన వాతావరణానికి విరుద్ధంగా తయారవుతుది. కాబట్టి అనారోగ్యాలు తప్పవు. అందుకే గోరింటాకు పెట్టుకుంటారు. గోరింటాకుకు శరీరంలో ఉండే వేడిని తగ్గించే శక్తి ఉంది. అంతేకాకుండా గోరింటాకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడానికి గల ప్రత్యేకత ఏమిటి.?
అందుకే ఆషాడంలో గోరింటాకు తప్పకుండా పెట్టుకోవాలని పెద్దలు చెప్పడమే కాకుండా.. డాక్టర్లు కూడా చెప్తున్నారు. ఆధ్యాత్మిక పరంగా గోరింటాకు సౌభాగ్యానికి ప్రతీక అని.. ఆషాడంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ద్వారా సౌభాగ్యాన్ని పొందిన వారవుతారని జ్యోతిష్యులు అంటున్నారు.

ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడానికి గల ప్రత్యేకత ఏమిటి.?
వేదాలలో: గోరింటాకు పూయించి ఎరుపు రంగు సూర్యునికి పత్రీకగా చెప్పారు. అందుకే అరచేతుల్లో సూర్యుని ఆకారాన్ని పోలి ఉండే గుండ్రటి డిజైన్ వేసేవారు. జ్ఝాన కాంతిని గోరింట ద్వారా మేలుకొలపడంగా భావించేవారు.

ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడానికి గల ప్రత్యేకత ఏమిటి.?
అరబిక్ భాషలో: ‘హెన్నా' అనే పదం నుంచి ‘హెన్నా' వచ్చింది. గోరింటాకు పొడిని హెన్నాగా పేర్కొంటుంటారు. సంసృతంలో గోరింట చెట్టును ‘మేంధికా' అంటారు. ఆ పదం నుంచి మెహిందీ వచ్చింది.

ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడానికి గల ప్రత్యేకత ఏమిటి.?
ఐదువేల ఏళ్ల వయస్సు: అదృష్టానికి, ఆరోగ్యానికి గోరింటాకును ప్రతీకగా అరబ్ దేశాలలో ఐదువేల ఏళ్ల క్రితమే వాడినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. గోరింట చెట్లు ఇంట్లో ఉంటే ఆత్మలు దరిచేరవని, మంచి భావాలను కలిగిస్తుందిని నమ్మేవారు. కొన్ని తరాల తర్వాత గోరింట ఆకులను ఎండబెట్టి, పొడి చేసి చేతులు, పాదాలపై రేఖాగణిత నమూనాలలో డిజైన్లు వేసుకొనేవారు. వీటి వల్ల సంతానోత్పత్తి పెరుగుతుందని, అండాశయాల పనితీరు సక్రమంగా ఉంటుందని భావించేవారు.

ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడానికి గల ప్రత్యేకత ఏమిటి.?
ఈజిఫ్ట్ నుంచి: ఈజిఫ్ట్ ‘మమ్మీల' జుట్టు, గోళ్లు ముదురు గోధుమ రంగులోకి రావడానికి గోరింటాకు వాడేవారని వార్త ఉంది. క్రీ. పూ 700 కాలంలో గోరింట మొక్క ఈజిఫ్ట్ నుంచి భారతదేశంలో అడుగుపెట్టిందని వృక్షశాస్త్రజ్ఝలు చెబుతున్నారు.

ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడానికి గల ప్రత్యేకత ఏమిటి.?
మతాలకు అతీతం: క్రిస్టియన్, హిందూ, ముస్లిమ్..ఇలా ఏ మతం వారికైనా మెహెందీ విషయంలో భేద భావం లేదు. మనసుకు నచ్చిన డిజైన్ అయితే చాలు. క్రిస్టియన్ పెళ్లివేడుకలలో వెలిగిపోతుంది. తెలుగింటి పల్లెపడచు చేతుల్లో ఒదిగిపోతుంది. ముస్లిమ్ మగువన ముంజేతులను చక్కగా అలంకరిస్తుంది...



Click it and Unblock the Notifications