For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Shravan Month 2022: శ్రావణ సోమవారం వ్రతంలో ఈ తప్పులు పొరపాటును కూడా చేయకండి..! ఏం చేయకూడదు..?

శ్రావణ సోమవారం వ్రతంలో ఈ తప్పులు పొరపాటును కూడా చేయకండి..! ఏం చేయకూడదు..?

|

శ్రావణ సోమవారాన్ని తప్పించకుండా శివుడిని ఆరాధించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణంగా శివ భక్తులు ఈ మాసం కోసం వేచి ఉంటారు. శ్రావణ సోమవారం ఉపవాసం ఎలా చేయాలి..? శ్రావణ సోమవారం వ్రతం విశిష్టత ఏమిటి..? తెలుసుకుంటూ..ఈ సందర్భంలో, ఎలాంటి తప్పులు చేయకూడదో ఇక్కడ తెలుసుకుందాం.

Why You Should Never Do These Mistakes During Shravan Somvara Vratam in Telugu

శ్రావణం హిందూ క్యాలెండర్‌లో ఐదవ నెల. ఈ కాలంలో శివ భక్తులు ఉపవాసం ఉండి శివుడిని పూజిస్తారు. విశ్వాసాల ప్రకారం, శ్రావణ మాసం శివునికి అత్యంత ఇష్టమైన మాసంగా చెబుతారు. అలాగే శివపూజకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. శ్రావణ వ్రతం ఆచరించడంలో విశిష్టత ఏమిటి..? శ్రావణ సోమవారం ఉపవాసం చేసే విధానం ఇదిగో..

మొగిలి పువ్వును ఉపయోగించవద్దు

మొగిలి పువ్వును ఉపయోగించవద్దు

శివుడిని పూజించేటప్పుడు చాలా మంది మొగిలి పువ్వులను ఉపయోగిస్తారు. అయితే మొగిలి పూలు సమర్పించడం వల్ల శివునికి కోపం వస్తుందని మరియు అతనిని అసంతృప్తికి గురి చేస్తుందని మీరు గుర్తుంచుకోవాలి. కావున శివపూజలో మొగిలి పూల వాడకానికి దూరంగా ఉండాలి.

తులసిని నైవేద్యంగా పెట్టకండి

తులసిని నైవేద్యంగా పెట్టకండి

శ్రావణ సోమవారం రోజున శివుడిని పూజించేటప్పుడు ప్రజలు చేసే మరో తప్పు ఏమిటంటే, ఆయనకు తులసిని సమర్పించడం. తులసి ఆకులను శివునికి ఇవ్వకూడదు. ఇది శివుని కోపానికి దారి తీస్తుంది.

 కొబ్బరి నీళ్లను అందించవద్దు

కొబ్బరి నీళ్లను అందించవద్దు

శివుడికి కేడి పువ్వు మరియు తులసి నైవేద్యంతో పాటు కొబ్బరి నీళ్ళు సమర్పించడం నిషేధించబడింది. శివునికి కొబ్బరినీళ్లు నైవేద్యంగా పెట్టడం వల్ల శివుని ఎర్రని కన్ను కూడా మీపై పడేలా చేస్తుంది. కావున శివునికి కొబ్బరినీళ్లు నైవేద్యంగా పెట్టకుండా మంచినీళ్లు సమర్పించండి.

ఈ లోహ పాత్రలో జలాభిషేకం చేయండి

ఈ లోహ పాత్రలో జలాభిషేకం చేయండి

మీరు శివునికి నీటిని సమర్పించినప్పుడు లేదా జలాభిషేకం చేసినప్పుడు, ఎల్లప్పుడూ కంచు లేదా ఇత్తడి పాత్ర నుండి దానిని సమర్పించండి. శివునికి ఈ లోహపాత్ర తప్ప మరే ఇతర లోహపాత్రతో జలాభిషేకం చేయరాదు.

దీన్ని శివునికి నైవేద్యంగా పెట్టడం మర్చిపోవద్దు

దీన్ని శివునికి నైవేద్యంగా పెట్టడం మర్చిపోవద్దు

ముఖ్యంగా శ్రావణ మాసంలో శివుడిని పూజించేటప్పుడు పసుపు, కుంకుమ సమర్పించకూడదు. వీలైతే భస్మాన్ని శివునికి సమర్పించవచ్చు.

ఈ శివ మంత్రాన్ని జపించండి

ఈ శివ మంత్రాన్ని జపించండి

శ్రావణ సోమవారం నాడు పూజించేటప్పుడు శివుడిని మంత్రాలతో పూజించాలి. మంత్రాలతో శివపూజ చేయడం ద్వారా, శివుడు అతి త్వరలో మీ పూజలో చేరతాడు. సోమవారం శివపూజ చేసేటప్పుడు "ఓం నమః శివాయ" అనే మంత్రాన్ని పఠించాలి.

English summary

Why You Should Never Do These Mistakes During Shravan Somvar Vratam in Telugu

Why You Should Never Do These Mistakes During Shravan Somavara Vratam in Telugu
Desktop Bottom Promotion