మీ బాడీలో షుగర్‌ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్‌ పరికరాలు ఇవే.!

వైద్య రంగంలో సాంకేతికత పెరుగుతున్న కొద్దీ దీర్ఘకాలిక రోగాల నియంత్రణ సులభతరమవుతోంది. అందులో డయాబెటిస్‌ ఒకటి. ఎక్కువ శాతం మంది ప్రజలను పట్టిపీడిస్తున్న మధుమేహాన్ని నియంత్రించుకునేందుకు ఆరోగ్యకరమైన ఆహారం, రెగ్యులర్‌గా వ్యాయామం, మందులతో షుగర్‌ లెవెల్స్‌ కంట్రోల్‌ అవుతున్నాయి. వీటితో పాటు స్మార్ట్‌ గ్యాడ్జెట్స్‌ మీ వద్ద ఉంటే షుగర్‌ లెవెల్స్‌ను పర్యవేక్షించవచ్చు. భారత్‌లో దాదాపు 10.1 కోట్ల మందికి పైగా డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఈ వ్యాధి నిర్వహణను మెరుగుపరిచేందుకు టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది.

Best Diabetes Gadgets of 2026 Smart Devices Every Patient Should Know About

మేకింగ్ ఇండియా విన్ ఓవర్ డయాబెటిస్ అనేది సన్ ఫార్మా సంస్థ.. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ సహకారంతో చేపట్టిన ఒక అవగాహన కార్యక్రమం. వైద్య నిపుణుల సలహాలు, సూచనలతో కూడిన సరైన సమాచారాన్ని అందిస్తూ... భారతీయులు డయాబెటిస్ గురించి స్పష్టంగా అర్థం చేసుకోవడానికి, దాన్ని రాకుండా నివారించడానికి, ఒకవేళ వచ్చినా దానిని ఎలా అదుపులో ఉంచుకోవాలో తెలియజేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.

2026లో డయాబెటిస్‌ నియంత్రణకు దోహదపడుతున్న స్మార్ట్‌ గ్యాడ్జెట్స్‌ ఇవే..

1. నిరంతర గ్లూకోజ్ మానిటర్లు (CGMలు)

చర్మం కింద ఒక చిన్న సెన్సార్ ద్వారా గ్లూకోజ్ స్థాయిలను నిరంతరం పర్యవేక్షించవచ్చు. CGMలు డయాబెటిస్ సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి. సాధారణ డయాబెటిస్‌ పరీక్ష మాదిరిగా కాకుండా ఈ గ్లూకోజ్‌ మానిటర్స్‌.. రియల్‌ టైంలో గ్లూకోజ్‌ పనితీరు, షుగర్‌ లెవెల్‌ హెచ్చుతగ్గులు, ఆహారం, వ్యాయామం, నిద్ర మొదలైనవి గ్లూకోజ్‌ లెవెల్స్‌ను ఎలా ప్రభావితం చేస్తాయనే దానిపై విలువైన సమాచారాన్ని అందిస్తుంది. ఇన్సులిన్‌ తీసుకునేవారికి, రక్తంలో షుగర్‌ లెవెల్స్‌ హెచ్చుతగ్గుల సమస్యలు ఉన్నవారికి ఈ సీజీఎంలు ఉపయోగకరంగా ఉంటాయి.

2. స్మార్ట్ గ్లూకోమీటర్లు

ఆధునిక బ్లూటూత్-ఎనేబుల్డ్ గ్లూకోమీటర్లను స్మార్ట్‌ఫోన్ యాప్‌ల ద్వారా అనుసంధానం చేసుకోవచ్చు. రీడింగ్‌ను ఆటోమేటిక్‌గా తెలుసుకోవచ్చు. ఈ నివేదికలు వైద్యులను కలిసినప్పుడు ఉపయోగపడతాయి. దీంతో షుగర్‌ లెవెల్స్‌ను మానిటర్‌ చేసుకోవడం సులభతరం అవుతుంది.

3. స్మార్ట్ ఇన్సులిన్ పెన్స్‌

డయాబెటిస్‌ నియంత్రణలో భాగంగా ఇన్సులిన్‌ తీసుకుంటున్న వారికి స్మార్ట్ ఇన్సులిన్ పెన్స్‌ దోహదపడతాయి. ఇవి మీ శరీరంలో ఇన్సులిన్ మోతాదులను రికార్డ్ చేస్తాయి. మీరు ఇంజెక్షన్‌ మిస్‌ అయితే గుర్తు చేస్తాయి. వైద్యులు సూచించిన సరైన మోతాదులను లెక్కిస్తాయి. మొబైల్‌ యాప్‌లతో సింక్‌ చేసుకోవడం, సీజీఎం డేటాతో ఇంటిగ్రేడ్‌ చేసుకోవడం ద్వారా చికిత్స మెరుగుపడుతుంది. సరైన మోతాదులో ఇన్సులిన్‌ను తీసుకునేందుకు సహాయపడుతుంది.

4. డయాబెటిస్‌ మేనేజ్‌మెంట్‌ యాప్స్‌

మొబైల్ యాప్‌లు రక్తంలో చక్కెర స్థాయిలను నమోదు చేయడంతో పాటు చాలా రకాలుగా ఉపయోగపడతాయి. సరైన ఆహారం, శారీరక శ్రమ, మందులు, బరువు, గ్లూకోజ్ రీడింగ్‌లను ఒకే చోట నమోదు చేసుకోవచ్చు. మరికొన్ని ప్లాట్‌ఫారమ్‌లు ఆహార నియమాలు, టెలికన్సల్టేషన్, వ్యక్తిగత శిక్షణను కూడా అందించడంతో ఇంటి నుంచే మీరు మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చు.

"డయాబెటిస్‌ బాధితులకు షుగర్‌ లెవెల్స్‌ను కంట్రోల్‌ చేసుకునేందుకు టెక్నాలజీ దోహదపడుతుంది. గ్లూకోజ్ మానిటర్లు, స్మార్ట్ ఇన్సులిన్ పెన్నుల వంటి పరికరాలు రియల్‌ టైం సమాచారాన్ని అందిస్తున్నాయి. అయితే, ఈ పరికరాలు సాధారణ వైద్య సంప్రదింపులు, సూచించిన మందులు, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లతో అనుసంధానంగా ఉండాలి కానీ వాటి స్థానాన్ని భర్తీ చేయకూడదు. బాధితులు ఎల్లప్పుడూ వైద్యపరంగా ధృవీకరించబడిన పరికరాలను మాత్రమే ఎంచుకోవాలి. వాటిని తమ ఆరోగ్య సంరక్షణ నిపుణుల మార్గదర్శకత్వంలో ఉపయోగించాలి."

Dr. C Abhinandana, Consultant diabetologist, Hyderabad

Best Diabetes Gadgets of 2026 Smart Devices Every Patient Should Know About

5. స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్ ట్రాకర్‌లు

స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్ ట్రాకర్‌లు రక్తంలోని గ్లూకోజ్‌ను స్వయంగా, కచ్చితంగా కొలవలేవు. అయినప్పటికీ, అవి నడక(స్టెప్స్‌), శారీరక శ్రమ, హార్ట్‌ బీట్‌ రేటు, నిద్ర, ఇతర ఆరోగ్య కొలమానాలను ట్రాక్ చేయడం ద్వారా మధుమేహం ఉన్నవారికి దోహదపడతాయి.

ప్రతిరోజూ శారీరక శ్రమ అంటే ఇంట్లో పనులు, వ్యాయామం వంటి వాటిని చేయడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అదే సమయంలో మెటబాలిజం మెరుగుపడేందుకు సరైన సమయంలో తగినంత నిద్ర పోవడం కూడా చాలా ముఖ్యం. ఈ క్రమంలో కొన్ని స్మార్ట్‌వాచ్‌లు ధ్రువీకరించబడిన నిరంతర గ్లూకోజ్ పర్యవేక్షణ (CGM) సిస్టమ్‌లతో కూడా అనుసంధానం అవుతాయి. వీటితో స్వయంగా గ్లూకోజ్‌ను కొలవకుండానే డయాబెటిస్‌ బాధితులు తమ వేరబుల్‌లో గ్లూకోజ్ డేటాను పర్యవేక్షించవచ్చు.

6. ట్రావెలింగ్‌ గాడ్జెట్‌లు

తరచుగా ప్రయాణాలు చేసేవారు ఇన్సులిన్ కూలింగ్ కేసులు, పోర్టబుల్ మెడిసిన్ ఆర్గనైజర్‌లు, కాంపాక్ట్ ట్రావెల్ పౌచ్‌లు ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్, టెస్టింగ్ సామాగ్రిని సురక్షితంగా ఉంచుతాయి. వేసవి కాలంలో ఇవి మరింత ఉపయోగకరంగా ఉంటాయి.

డయాబెటిస్‌కి సంబంధించి స్మార్ట్‌ పరికరాలను కొనుగోలు చేసేముందు మీ ఆరోగ్య పరిస్థితి, చికిత్స ప్రణాళిక, బడ్జెట్‌ విషయాలను మీ వైద్యుడితో సంప్రదించాలి. నేటి ఆధునిక కాలంలో టెక్నాలజీ ఒక శక్తివంతమైన సాధనం కానీ ఆరోగ్యకరమైన ఆహారం, క్రమమైన వ్యాయామం, సరైన వైద్య సంరక్షణతోనే ఈ స్మార్ట్‌ పరికకాలు ఉత్తమంగా పనిచేస్తాయి. SPI-IN-CVD-ZT---08-20260337

Disclaimer: ఈ సమాచారం కేవలం రోగుల అవగాహన కోసం మాత్రమే ఉద్దేశించబడింది. ఇది ఏ రకంగానూ డాక్టర్ లేదా ఇతర ఆరోగ్య నిపుణుల సలహాకు ప్రత్యామ్నాయం కాదు. మీ డాక్టర్‌ను సంప్రదించండి: మీరు మీ ఆరోగ్యం విషయంలో ఎల్లప్పుడూ మీ సొంత డాక్టర్ సలహాలను మాత్రమే తీసుకోవాలి, వాటిపైనే ఆధారపడాలి. 'సన్ ఫార్మాస్యూటికల్స్ లాబొరేటరీస్ లిమిటెడ్' (SPLL) ఈ సమాచారాన్ని ఖచ్చితంగా, సరైన సమయానికి అందించడానికి ప్రయత్నిస్తుంది, కానీ దీనికి ఎలాంటి హామీ ఇవ్వదు. సన్ ఫార్మాస్యూటికల్స్ లాబొరేటరీస్ లిమిటెడ్ (SPLL) ముందస్తు అనుమతి లేకుండా ఈ సమాచారంలోని ఏ భాగాన్ని కూడా ప్రింట్ రూపంలో కానీ, డిజిటల్ రూపంలో (మెకానికల్ లేదా ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో) కానీ కాపీ చేయడం, ఇతరులకు పంపడం లేదా భద్రపరచడం చేయకూడదు.

Story first published: Wednesday, September 23, 2026, 10:06 [IST]
Desktop Bottom Promotion