మీ ఇంట్లో రోజూ చేసే ఈ 5 పొరపాట్లే షుగర్ వ్యాధికి అసలు కారణం!

షుగర్ వ్యాధి (డయాబెటిస్) అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది అది కేవలం వంశపారంపర్యంగా వస్తుందని, లేదా తీపి పదార్థాలు ఎక్కువగా తినడం వల్లే వస్తుందని. ఇది చాలా మంది నమ్మే పెద్ద అపోహ.ఆధునిక జీవనశైలిలో, బిజీ షెడ్యూల్స్ మధ్య మన ఇళ్లలో రోజూ మనం ఎంతో సాధారణంగా చేసే కొన్ని చిన్న చిన్న అలవాట్లు సైతం డయాబెటిస్ ముప్పును సైలెంట్‌ గా, ప్రమాదకర స్థాయిలో పెంచుతున్నాయి.

These 5 mistakes you make at home every day are the root cause of diabetes

మేకింగ్ ఇండియా విన్ ఓవర్ డయాబెటిస్ అనేది సన్ ఫార్మా సంస్థ.. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ సహకారంతో చేపట్టిన ఒక అవగాహన కార్యక్రమం. వైద్య నిపుణుల సలహాలు, సూచనలతో కూడిన సరైన సమాచారాన్ని అందిస్తూ... భారతీయులు డయాబెటిస్ గురించి స్పష్టంగా అర్థం చేసుకోవడానికి, దాన్ని రాకుండా నివారించడానికి, ఒకవేళ వచ్చినా దానిని ఎలా అదుపులో ఉంచుకోవాలో తెలియజేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.

ఒకప్పుడు కేవలం అరవై ఏళ్లు పైబడిన వృద్ధులకు మాత్రమే వచ్చే ఈ షుగర్ వ్యాధి, ఇప్పుడు ముప్పై ఏళ్ల యువతకు, చివరకు స్కూల్ కు వెళ్ళే చిన్న పిల్లలకు కూడా ఎందుకు వస్తుందో ఎప్పుడైనా గమనించారా? దానికి ప్రధాన కారణం మన ఇంట్లో రోజువారీగా పాటించే, మనకే తెలియని అనారోగ్యకరమైన కుటుంబ అలవాట్లే. మనం అస్సలు ఊహించని, కానీ మన ఆరోగ్యాన్ని లోపల నుండి నెమ్మదిగా దెబ్బతీస్తున్న ఆ ప్రమాదకరమైన అలవాట్లు ఏమిటో ఇక్కడ చూడండి.

టైప్ 2 డయాబెటిస్ అనేది అరుదుగా ఏదైనా ఒకే ఒక్క అలవాటు వల్ల వస్తుంది. ఇది సాధారణంగా జన్యుపరమైన, జీవనశైలి కారణాల కలయిక వల్ల వస్తుంది. చక్కెరతో కూడిన డ్రింక్స్, ఎక్కువగా ప్రాసెస్ చేసిన స్నాక్స్‌ ను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవడం, మోతాదుకు మించి ఆహారాన్ని వడ్డించడం, ఎక్కువ గంటలు కూర్చునే గడపడం, క్రమరహితమైన నిద్ర వేళలను పాటించడం, స్మోకింగ్ ను ఒక సాధారణ విషయంగా పరిగణించడం వంటి ఇంటి అలవాట్లు.. క్రమంగా మెటబాలిక్ (జీవక్రియ) ప్రమాదాన్ని పెంచుతాయి. కుటుంబాలు తాత్కాలికంగా కఠినమైన ఆహార నియమాలు పాటించడం కంటే స్థిరమైన మార్పులపై దృష్టి పెట్టాలి..అంటే ఇంట్లో వండిన సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా శారీరక కదలికలు (వ్యాయామం), తగినంత నిద్ర, సకాలంలో బ్లడ్ షుగర్ పరీక్షలు చేయించుకోవడం వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి.

These 5 mistakes you make at home every day are the root cause of diabetes

ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ లో షుగర్ ట్రాప్

చాలా ఇళ్లలో ఉదయం నిద్ర లేవగానే బెడ్ కాఫీ లేదా చాయ్‌ తో పాటు బిస్కెట్లు, రస్కులు తింటారు. ఆ తర్వాత ఉప్మా, ఇడ్లీ, దోశ లేదా పూరీ వంటివి తీసుకుంటారు. పలు రిపోర్ట్ ల ప్రకారం, వీటిలో ఉండే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెంచుతాయి. మన సంప్రదాయ బ్రేక్‌ఫాస్ట్‌లు రుచిగా ఉన్నప్పటికీ వాటిలో ప్రోటీన్ తక్కువ, పిండి పదార్థాలు ఎక్కువ. వీటికి బదులు గుడ్లు, మొలకలు, లేదా పప్పులతో కూడిన ప్రోటీన్ బ్రేక్‌ ఫాస్ట్ తీసుకోవడం చాలా అవసరం.

రాత్రి పూట ఆలస్యంగా డిన్నర్ చేయడం

భారతీయ కుటుంబాల్లో రాత్రి భోజనం 9 లేదా 10 గంటలకు చేయడం అనేది చాలా సాధారణం అయిపోయింది. రాత్రి పూట మన శరీర జీవక్రియ చాలా నెమ్మదిస్తుంది. ఆ సమయంలో భారీగా అన్నం భోజనం చేసి వెంటనే నిద్రపోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపు తప్పుతాయి. రాత్రి 7 నుండి 8 గంటల లోపు తేలికపాటి భోజనం ముగించడం షుగర్ రాకుండా అడ్డుకునే అత్యుత్తమ మార్గాలలో ఒకటి.

నిద్రలేమి, కుటుంబ ఒత్తిళ్లు

రాత్రిళ్లు మొబైల్ ఫోన్లు చూస్తూ నిద్రను నిర్లక్ష్యం చేయడం, ఆఫీసు లేదా కుటుంబ వ్యవహారాల వల్ల ఒత్తిడికి గురికావడం వల్ల శరీరంలో కార్టిసోల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది నేరుగా బ్లడ్ షుగర్‌ను పెంచుతుంది. తగినంత నిద్ర లేకపోవడం డయాబెటిస్ ముప్పును రెట్టింపు చేస్తుందని వైద్య పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.

నిరంతరంగా టీ, కాఫీలు, స్వీట్ డ్రింక్స్ తాగడం

కుటుంబ సభ్యులతో కూర్చుని మాట్లాడుతూ రోజుకు మూడు నాలుగు సార్లు టీ లేదా కాఫీలు తాగే అలవాటు చాలా ఇళ్లలో ఉంటుంది. ప్రతి కప్పులో వేసే రెండు చెంచాల చక్కెర, రోజంతా మీ శరీరంలో ఎంత షుగర్ లోడ్ అవుతుందో ఊహించండి. అంతేకాకుండా పిల్లల కోసం కొని తెచ్చే ప్యాకెట్ ఫ్రూట్ జ్యూస్‌ లు, టొమాటో కెచప్స్ వంటివి ఆరోగ్యకరం అని భ్రమపడి ఇస్తుంటారు. కానీ వాటిలో దాగి ఉన్న చక్కెర టైప్ 2 డయాబెటిస్ ముప్పును విపరీతంగా పెంచుతుందని డాక్టర్లు చెబుతున్నారు.

టీవీ చూస్తూ స్నాక్స్ తినడం - శారీరక శ్రమ లేకపోవడం

సాయంత్రం కాగానే ఫ్యామిలీ అంతా కలిసి టీవీ లేదా స్మార్ట్‌ఫోన్ల ముందు కూర్చుని బిస్కెట్లు, మిక్స్చర్, బేకింగ్ ఫుడ్స్ తినడం ఒక ఆధునిక ట్రెండ్ అయిపోయింది. శారీరక శ్రమ లేకుండా గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. మనం తీసుకునే క్యాలరీలు కరగనప్పుడు, అది కొవ్వుగా మారి డయాబెటిస్‌కు దారి తీస్తుంది.

కుటుంబం మొత్తం కలిసి చేయాల్సిన మార్పులు

ఇంట్లో వైట్ రైస్ వాడకాన్ని తగ్గించి, మిల్లెట్స్ (చిరుధాన్యాలు), బ్రౌన్ రైస్ వాడటం ప్రారంభించండి.వీకెండ్స్‌లో పిల్లలతో కలిసి బయట జంక్ ఫుడ్ తినడానికి బదులుగా, ఇంట్లోనే ఆరోగ్యకరమైన వంటకాలు ప్రయత్నించండి. రోజూ ఉదయం లేదా సాయంత్రం కనీసం 30 నిమిషాల పాటు కుటుంబంతో కలిసి వాకింగ్ లేదా యోగా చేయడం దినచర్యలో భాగం చేసుకోండి.

Disclaimer: ఈ సమాచారం కేవలం రోగుల అవగాహన కోసం మాత్రమే ఉద్దేశించబడింది. ఇది ఏ రకంగానూ డాక్టర్ లేదా ఇతర ఆరోగ్య నిపుణుల సలహాకు ప్రత్యామ్నాయం కాదు. మీ డాక్టర్‌ను సంప్రదించండి: మీరు మీ ఆరోగ్యం విషయంలో ఎల్లప్పుడూ మీ సొంత డాక్టర్ సలహాలను మాత్రమే తీసుకోవాలి, వాటిపైనే ఆధారపడాలి. 'సన్ ఫార్మాస్యూటికల్స్ లాబొరేటరీస్ లిమిటెడ్' (SPLL) ఈ సమాచారాన్ని ఖచ్చితంగా, సరైన సమయానికి అందించడానికి ప్రయత్నిస్తుంది, కానీ దీనికి ఎలాంటి హామీ ఇవ్వదు. సన్ ఫార్మాస్యూటికల్స్ లాబొరేటరీస్ లిమిటెడ్ (SPLL) ముందస్తు అనుమతి లేకుండా ఈ సమాచారంలోని ఏ భాగాన్ని కూడా ప్రింట్ రూపంలో కానీ, డిజిటల్ రూపంలో (మెకానికల్ లేదా ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో) కానీ కాపీ చేయడం, ఇతరులకు పంపడం లేదా భద్రపరచడం చేయకూడదు. SPI-IN-CVD-ZT---07-20260104

Desktop Bottom Promotion