Latest Updates
-
వర్షాకాలంలోనూ ఉక్కపోత.. శరీరంలో వేడిని నిమిషాల్లో తగ్గించే సూపర్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ఇదే.! -
రాహు నక్షత్రంలోకి శుక్రుడు: భాగస్వామితో గొడవలు.. అక్టోబర్ 24 వరకు వెంటాడనున్న దురదృష్టం -
అమెరికాలో చీప్,భారత్ లో కాస్ట్లీ : ఇండియాలోనే తయారవుతున్నా..ఐఫోన్ల ధరలు ఎందుకు మండిపోతున్నాయి? -
ఉద్యోగులకు అలర్ట్..మీ గుండెను దెబ్బతీస్తున్న 4 ప్రధాన కారణాలివే! -
స్వీట్ షాప్ స్టైల్ మలై బర్ఫీ..ఈ సింపుల్ రెసిపీ తెలిస్తే ఇకపై బయట కొనరు! -
అంగారకుడి నీచ సంచారం.. ఈ 4 రాశుల వారు కళ్లు తెరిచి ఉండకపోతే పక్కాగా నష్టపోతారు! -
పెళ్లిళ్లలో ఇది లేకుండా భోజనం పూర్తి కాదు.. నోరూరించే ఆంధ్రా స్టైల్ గోంగూర శనగపప్పు పులుసు.! -
షాపులో దొరికే కల్తీ బెల్లం వద్దు.. ఇంట్లోనే స్వచ్ఛమైన బెల్లం చేసుకోండిలా! -
దానిమ్మ గింజలు ఏ రంగులో ఉంటే ఎక్కువ పోషకాలు లభిస్తాయో తెలుసా.. USDA డేటా ఇదే.! -
చిట్టి గణేశుడిని ఇంట్లోకి తెస్తున్నారా.. సంప్రదాయం ప్రకారం ఎన్ని రోజులు పూజించాలో తెలుసా.?
వర్షాకాలంలో డెంగ్యూ అలర్ట్.. ప్లేట్‌లెట్ తగ్గాయని తెలిపే హెచ్చరిక సంకేతాలు ఇవే.!
వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ కేసులు పెరిగే ప్రమాదం ఉంది. ముఖ్యంగా డెంగ్యూ కారణంగా ప్లేట్‌లెట్స్ కౌంట్ తగ్గిపోతాయి. అయితే ఈ లక్షణాలను ముందుగానే గుర్తించడం ద్వారా సరైన సమయంలో చికిత్స తీసుకుని డెంగ్యూ బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

వర్షాకాలంలో నీటి నిల్వ, ఫలితంగా దోమల వ్యాప్తి కారణంగా డెంగ్యూ ఫీవర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఏడిస్ దోమ కాటు కారణంగా వచ్చే ఈ వైరల్ ఫీవర్ లక్షణాలు తీవ్రంగా ఉంటాయి. అధిక జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు, నీరసం వంటి వాటితో బాధపడుతుంటారు. ఫలితంగా ప్లేట్‌లెట్స్ కౌంట్ పడిపోతుంది. అందుకే డెంగ్యూ వ్యాధికి సకాలంలో ట్రీట్‌మెంట్ తప్పనిసరి.
కాగా, డెంగ్యూ ఫీవర్ మిమ్మల్ని అటాక్ చేయకుముందే ఆ లక్షణాలను గుర్తించవచ్చని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ప్లేట్‌లెట్స్ సంఖ్య విపరీతంగా పడిపోతుంది. అయితే ఈ ఫీవర్‌లో ప్లేట్‌లెట్స్ ఎప్పుడు తగ్గిపోతాయి, ఆ సంకేతాలను ఎలా గుర్తించాలి, నివారణ చర్యలు ఏంటి.. వైద్య నిపుణుల సలహాలు చూద్దాం..
డెంగ్యూ ఫీవర్ మొదలైనప్పుడు మూడ నుంచి ఏడు రోజుల మధ్య ప్లేట్‌లెట్ కౌంట్స్ తగ్గిపోవడం ప్రారంభిస్తుందని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ఇది క్లిష్టమైన దశ కాగా.. ఇలాంటి పరిస్థితుల్లో రోగి పరిస్థితిని పర్యవేక్షించడం చాలా ముఖ్యం. కొంతమందిలో ప్లేట్‌లెట్స్ క్రమంగా తగ్గిపోతాయి. మరికొంతమందిలో ఈ సంఖ్య వేగంగా పడిపోయే ప్రమాదం ఉంది. అయితే ప్రతి రోగిలోనూ ఇలాంటి మార్పులే కనిపిస్తాయని చెప్పలేమని నిపుణులు అంటున్నారు.

సాధారణ ప్లేట్‌లెట్స్ సంఖ్య..
సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిలో ప్రతి మైక్రోలీటర్ రక్తానికి 1,50,000 నుంచి 4,50,000 వరకు ప్లేట్‌లెట్స్ ఉంటాయి. డెంగ్యూ ఫీవర్ మొదలైనప్పుడు ఈ సంఖ్య క్రమంగా తగ్గుతుంది. అయితే ప్లేట్‌లెట్స్ పడిపోవడమే డెంగ్యూ పరిస్థితిని సూచించదు.. కేవలం వీటి ద్వారానే కాకుండా రోగి పరిస్థితిని, ఇతర లక్షణాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
ఈ లక్షణాల పట్ల నిర్లక్ష్యం వద్దు
ముక్కు, చిగుళ్ల నుంచి రక్తస్రావం, మూత్రంలో, మలంలో రక్తం కనబడటం, చర్మంపై ఎర్రగా, నీలం రంగులో మచ్చలు ఏర్పడటం, కడుపు నొప్పి తీవ్రంగా కావడం, నిరంతరం వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. రోగిలో చేతులు, కాళ్లు చల్లబడినా, తల తిరిగినట్లు అనిపించినా నిర్లక్ష్యం చేయకూడదు.
అయితే కొన్నిసార్లు ప్లేట్‌లెట్స్ కౌంట్ తక్కువగా ఉన్నంత మాత్రాన డెంగ్యూ అని భావించలేరు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆరోగ్యకరంగా ఉండొచ్చు. రక్తపోటు, డీహైడ్రేషన్, రక్తస్రావం, ఇతర పరీక్షల ఆధారంగా డెంగ్యూను నిర్ధారిస్తారు. అందుకు అనుగుణంగా చికిత్స అందిస్తారు. వైద్యుల సలహా మేరకు డీహైడ్రేషన్‌కి గురికాకుండా చూసుకోవాలి. ఓఆర్‌ఎస్, కొబ్బరి నీళ్లు, సూప్ లాంటి ద్రవ పదార్థాలు తీసుకుంటూ హైడ్రేడెట్‌గా ఉండాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
