Latest Updates
-
వినాయక చవితి స్పెషల్: గణనాథుడికి కారం ఉండ్రాళ్లు.. త్వరగా, పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా చేయండి.! -
గణేశుడి విగ్రహం వెనుక వైపు చూడవచ్చా, తొండం ఏ వైపు ఉండాలి.. శాస్త్రం చెబుతోంది ఇదే.! -
ఒక్కసారి చేస్తే 4 నెలల పాటు నిల్వ ఉండేలా సాంబార్, రసం పొడులు.. హోటల్ స్టైల్ రుచితో ఇంట్లోనే.! -
ఒకే ఒక్క స్పూన్ నూనెతో హై ప్రొటీన్ బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్..ఈజీగా చేసుకోండిలా.. -
నెయ్యి ఉపవాసంతో అద్భుతాలు!..ఇంటర్నెట్ ను ఊపేస్తున్న కొత్త ఫిట్ నెస్ ట్రెండ్! -
ఎప్పుడైనా లాహోరీ పన్నీర్ కుర్మా టేస్ట్ చేశారా? నోట్లో పెట్టుకుంటే స్వర్గమే! -
పవర్ ఆఫ్ హనుమాన్: ఆంజనేయస్వామి ఆలయం తొలగించబోయిన అధికారులు..4 రోజులైనా ఇంచు కూడా కదలట్లేదు! -
సంతానలేమితో ఆస్పత్రికి వెళ్లిన యువకుడిలో గర్భాశయం.. ఈ విచిత్ర సంఘటనకి కారణాలేంటి.? -
వర్షాకాలంలోనూ ఉక్కపోత.. శరీరంలో వేడిని నిమిషాల్లో తగ్గించే సూపర్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇదే.! -
రాహు నక్షత్రంలోకి శుక్రుడు: భాగస్వామితో గొడవలు.. అక్టోబర్ 24 వరకు వెంటాడనున్న దురదృష్టం
పదే పదే వాష్ రూమ్ కి పరిగెడుతున్నారా? కారణాలు ఇవే కావచ్చు!
పగలు, రాత్రి అనే తేడా లేకుండా పదే పదే మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తోందా? మీ ఆఫీసులోనో, ఇంట్లోనో గంటకోసారి వాష్ రూమ్ వైపు పరుగులు తీస్తున్నారా? అయితే ఇది మీరు తేలికగా తీసుకోవాల్సిన విషయం కాదు. చాలామంది నేను ఈరోజు ఎక్కువ నీళ్లు తాగాను, అందుకే ఇలా జరుగుతోందిలే అని సరిపెట్టుకుంటారు.

కానీ వైద్య నిపుణుల ప్రకారం..ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు సగటున 6 నుంచి 8 సార్లు మూత్రవిసర్జన చేయడం సర్వసాధారణం. ఈ సంఖ్య పరిమితి దాటి హఠాత్తుగా పెరిగితే మాత్రం, మీ శరీరం లోపల ఏదో తీవ్రమైన ఆరోగ్య సమస్య పొంచి ఉందని అర్థం చేసుకోండి. అసలు పదే పదే మూత్రం ఎందుకు వస్తుంది? దీని వెనుక ఉన్న ప్రధాన కారణాలు ఏవో ఇక్కడ చూడండి.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్
తరచుగా మూత్రం రావడానికి అత్యంత సాధారణమైన కారణం మూత్రనాళ ఇన్ఫెక్షన్. హానికరమైన బ్యాక్టీరియా మూత్రాశయంలోకి చేరినప్పుడు ఇన్ఫెక్షన్ ఏర్పడి, పదే పదే వాష్ రూమ్ కు వెళ్లాలనే తీవ్రమైన కోరిక కలుగుతుంది.
డయాబెటిస్ ముప్పు
తరచుగా మూత్రం రావడం అనేది టైప్ 1, టైప్ 2 మధుమేహానికి ఒక ప్రధాన సంకేతం. శరీరంలో, రక్తంలో పేరుకుపోయిన అదనపు చక్కెరను బయటకు పంపడానికి కిడ్నీలు ఎక్కువ మూత్రాన్ని ఉత్పత్తి చేస్తాయి.
ఓవరాక్టివ్ బ్లాడర్ (OAB)సిండ్రోమ్
నిపుణుల ప్రకారం.. ఈ సిండ్రోమ్ ఉన్నవారిలో మూత్రాశయం పూర్తిగా నిండకపోయినా, దాని కండరాలు అసంకల్పితంగా సంకోచిస్తాయి. దీనివల్ల ఆపుకోలేనంతగా, హఠాత్తుగా మూత్రవిసర్జన చేయాలనే భావన కలుగుతుంది.
ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు
వయసు పైబడిన పురుషులలో ప్రోస్టేట్ గ్రంథి పరిమాణం పెరగడం వల్ల మూత్రనాళంపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ఇది పదే పదే మూత్రవిసర్జనకు దారితీస్తుంది. అంతేకాకుండా రాత్రిపూట నిద్రలేచి మరీ పదే పదే వాష్ రూమ్ కు వెళ్లడాన్ని నాక్టూరియా అంటారు. ఇది మీ ప్రశాంతమైన నిద్రను తీవ్రంగా దెబ్బతీస్తుంది.
జీవనశైలి కూడా కారణమేనా?
మోతాదుకు మించి కాఫీలు, టీలు (కెఫిన్) తాగడం లేదా ఆల్కహాల్ ఎక్కువగా సేవించడం వల్ల మూత్రాశయం చికాకుకు గురవుతుంది. మీ సమస్య కేవలం జీవనశైలికి సంబంధించినది అయితే, ఈ అలవాట్లను మార్చుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.
డాక్టర్ ని ఎప్పుడు కలవాలి?
కేవలం పదే పదే మూత్రం రావడమే కాకుండా.. మూత్రవిసర్జన సమయంలో మంట లేదా నొప్పి, జ్వరం, మూత్రంలో రక్తం పడటం లేదా పొత్తికడుపులో భారం లాంటి లక్షణాలు ఉంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. వెంటనే నిపుణులైన యూరాలజిస్ట్ ను సంప్రదించండి. సరైన సమయంలో వ్యాధిని గుర్తించి ట్రీట్మెంట్ తీసుకుంటే ఎలాంటి సమస్యనైనా సులభంగా అధిగమించవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
