Latest Updates
-
వినాయక చవితి స్పెషల్: గణనాథుడికి కారం ఉండ్రాళ్లు.. త్వరగా, పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా చేయండి.! -
గణేశుడి విగ్రహం వెనుక వైపు చూడవచ్చా, తొండం ఏ వైపు ఉండాలి.. శాస్త్రం చెబుతోంది ఇదే.! -
ఒక్కసారి చేస్తే 4 నెలల పాటు నిల్వ ఉండేలా సాంబార్, రసం పొడులు.. హోటల్ స్టైల్ రుచితో ఇంట్లోనే.! -
ఒకే ఒక్క స్పూన్ నూనెతో హై ప్రొటీన్ బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్..ఈజీగా చేసుకోండిలా.. -
నెయ్యి ఉపవాసంతో అద్భుతాలు!..ఇంటర్నెట్ ను ఊపేస్తున్న కొత్త ఫిట్ నెస్ ట్రెండ్! -
ఎప్పుడైనా లాహోరీ పన్నీర్ కుర్మా టేస్ట్ చేశారా? నోట్లో పెట్టుకుంటే స్వర్గమే! -
పవర్ ఆఫ్ హనుమాన్: ఆంజనేయస్వామి ఆలయం తొలగించబోయిన అధికారులు..4 రోజులైనా ఇంచు కూడా కదలట్లేదు! -
సంతానలేమితో ఆస్పత్రికి వెళ్లిన యువకుడిలో గర్భాశయం.. ఈ విచిత్ర సంఘటనకి కారణాలేంటి.? -
వర్షాకాలంలోనూ ఉక్కపోత.. శరీరంలో వేడిని నిమిషాల్లో తగ్గించే సూపర్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇదే.! -
రాహు నక్షత్రంలోకి శుక్రుడు: భాగస్వామితో గొడవలు.. అక్టోబర్ 24 వరకు వెంటాడనున్న దురదృష్టం
పైన టమాటో.. లోపల మసాలా ఆలు.. ఈ బోండా రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
వర్షాకాలం వచ్చినా, చలికాలం సాయంత్రాలైనా వేడి వేడిగా ఏదైనా తినాలనిపించడం సహజం. అలాంటి సమయంలో మనకు ముందుగా గుర్తొచ్చేది ఆలూ బోండా లేదా బ్రెడ్ బజ్జీ. మీరు ఎన్నోసార్లు ఆలూ బోండా, బ్రెడ్ బోండా తిని ఉంటారు. సాధారణంగా వీటిని బంగాళదుంపలు, శనగపిండితో తయారు చేస్తారు. కానీ, ఎప్పుడూ ఒకే రకమైన రుచి బోర్ కొట్టిందా? అయితే ఈసారి కాస్త కొత్తగా, ఎంతో రుచికరంగా ఉండే టమాటో బోండాను ప్రయత్నించి చూడండి. ఇది అస్సలు నూనెను పీల్చుకోదు. డీప్ ఫ్రై చేసినా కూడా మీ చేతులకు జిడ్డు అంటదు.

టమాటో బోండా తయారీ విధానం
-ముందుగా బోండా లోపల పెట్టే స్టఫింగ్ సిద్ధం చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి, కొద్దిగా నూనె వేడి చేయండి. నూనె కాగాక అందులో కొద్దిగా సోంపు గింజలు, ధనియాలు, జీలకర్ర వేసి వేయించండి. ఆ తర్వాత పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి తక్కువ మంట మీద దోరగా వేయించాలి.
-ఇప్పుడు అందులో కొద్దిగా మిరియాల పొడి, చిటికెడు ఇంగువ, రెండు టీస్పూన్ల శనగపిండి వేసి పచ్చివాసన పోయేలా బాగా కలుపుతూ వేయించండి. ఆ తర్వాత కొద్దిగా పసుపు, కారం, ధనియాల పొడి కలపాలి. ఇప్పుడు కొద్దిగా కసూరి మేతి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించండి. ఇవన్నీ కాస్త వేగిన తర్వాత, ముందుగానే ఉడికించి మెత్తగా చేసుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలపాలి. చివరగా బ్లాక్ సాల్ట్, కొద్దిగా ఆమ్ చూర్ పొడి, కొత్తిమీర చల్లి బాగా కలిపి స్టవ్ ఆపేయండి. స్టఫింగ్ రెడీ.
-టమాటోలను శుభ్రంగా కడిగి పైభాగంలో (కాడ ఉండే చోట) గుండ్రంగా కట్ చేసి చిన్న రంధ్రం చేయండి. ఇప్పుడు లోపల ఉన్న గింజలు, గుజ్జు మొత్తాన్ని నెమ్మదిగా బయటకు తీసేయండి. ఇలా లోపల ఖాళీగా, గిన్నెలా మారిన టొమాటోలలో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బంగాళదుంప మసాలాను గట్టిగా కూరాలి.
-ఒక వెడల్పాటి గిన్నెలో సరిపడా శనగపిండి తీసుకోండి. అందులో కొద్దిగా ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసుకుంటూ బజ్జీల పిండిలా కాస్త చిక్కగా కలుపుకోండి. పిండిని ఉండలు లేకుండా, కాస్త ప్లఫ్ఫీగా (ఉబ్బేలా) గిలకొట్టడం చాలా ముఖ్యం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయండి.
-నూనె బాగా వేడెక్కిన తర్వాత, మసాలా నింపి పెట్టుకున్న టమాటోలను శనగపిండి మిశ్రమంలో వేసి, టమాటోకి పిండి బాగా పట్టేలా కోట్ చేయాలి. ఆ తర్వాత జాగ్రత్తగా నూనెలో వదలండి. బోండాలు బంగారు గోధుమ రంగు (గోల్డెన్ బ్రౌన్) వచ్చేవరకు బాగా డీప్ ఫ్రై చేయండి.
-అంతే టొమాటో బోండాలు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
