Akshaya Tritiya 2025: 100 ఏళ్ల తర్వాత అద్భుతం..ఒకేరోజు 6 రాజయోగాలు..కుబేరుడికే అప్పు ఇచ్చే స్థాయికి ఆ రాశులు..

ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. జ్యోతిష్యశాస్త్రం పరంగా చూస్తే ఈ ఏడాది అక్షయ తృతీయ చాలా చాలా ప్రత్యేకం కానుంది. ఎందుకంటే 100 ఏళ్ల తర్వాత ఈ ఏడాది అక్షయ తృతీయ రోజున ఆకాశంలో అద్భుతం జరగనుంది. ఒకే రోజున 6 రాజయోగాలు కలవనున్నాయి. జ్యోతిషశాస్త్రంలో రాజయోగాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఒక శుభ ముహూర్తాన అనేక గ్రహాలు అనుకూల స్థానాల్లో ఉండటం వల్ల ఈ అద్భుతమైన యోగాలు ఏర్పడతాయి.

2025 అక్షయ తృతీయ నాడు ఏకంగా ఆరు రాజయోగాలు.. గజకేసరి, మాళవ్య, రవి, చతుర్గ్రాహ, సర్వార్థ సిద్ధి, లక్ష్మీ నారాయణ రాజయోగాలు కలవడం ఒక అద్భుతం. ఆ 6 రాజయోగాలు ఏంటీ, వాటి కలయికతో ఏ రాశుల వారికి శుభం కలుగుతుందో ఇక్కడ చూడండి.

Akshaya Tritiya 2025 6 raja yogas align promotions in job and profits in business for these zodiac Signs

2025 అక్షయ తృతీయ నాడు ఏర్పడే ఆరు రాజయోగాలు

లక్ష్మీ నారాయణ రాజయోగం
బుధుడు, శుక్రుడు కలిసి ఉండటం వల్ల ఈ యోగం ఏర్పడుతుంది. ఇది సంపద, వ్యాపారం, తెలివితేటలకు సంబంధించినది.
మాళవ్య రాజయోగం
శుక్రుడు తన సొంత రాశి వృషభం లేదా తులారాశిలో లేదా ఉచ్ఛ రాశి అయిన మీనంలో కేంద్ర స్థానంలో ఉండటం వల్ల ఈ యోగం ఏర్పడుతుంది. ఇది భౌతిక సుఖాలు, ఆనందం, శ్రేయస్సును సూచిస్తుంది.

గజకేసరి రాజయోగం
గురుడు, చంద్రుడు ఒకే రాశిలో లేదా కేంద్ర స్థానాలలో ఉండటం వల్ల ఈ యోగం ఏర్పడుతుంది. ఇది జ్ఞానం,సంపద, కీర్తిని సూచిస్తుంది.

చతుర్గ్రాహ యోగం
ఒకే రాశిలో నాలుగు గ్రహాలు కలవడం వల్ల ఈ యోగం ఏర్పడుతుంది. ఇది చాలా శక్తివంతమైన యోగం, అనేక రకాల శుభ ఫలితాలను ఇస్తుంది.

సర్వార్థ సిద్ధి యోగం
ఇది కూడా ఒక శుభ యోగం. కొన్ని నిర్దిష్ట నక్షత్రాలు,వారాల కలయిక వల్ల ఏర్పడుతుంది. ఈ యోగం అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేయడానికి సహాయపడుతుంది.

ఈ ఆరు రాజయోగాలు ఒకే రోజున కలవడం చాలా అరుదైన సంఘటన, దీని ప్రభావం చాలా శక్తివంతంగా ఉంటుందని నమ్ముతారు. అందుకే 2025 అక్షయ తృతీయను అంత ప్రత్యేకమైనదిగా భావిస్తున్నారు. ఈ మహా యోగాల ప్రభావం మేషం నుండి మీనం వరకు ఉన్న ప్రతి రాశిపై ఉంటుంది. అయితే కొన్ని రాశుల వారికి మాత్రం ఇది నిజంగా అదృష్టాన్ని తెచ్చిపెట్టనుంది. ఊహించని ఆర్థిక లాభాలు, వ్యాపారంలో అభివృద్ధి వారి సొంతం కానున్నాయి. మరి 2025 అక్షయ తృతీయ నాడు ఏ రాశుల వారి జీవితాలు వెలిగిపోతాయో,ఇందులో మీ రాశి కూడా ఉందో లేదో ఇక్కడ చూడండి.

సింహ రాశి
2025 అక్షయ తృతీయ సింహరాశి వ్యక్తుల ఒక ప్రత్యేకమైన రోజు కానుంది. జీవితంలో ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. మీ కలలు నిజమవుతాయి. మీ కెరీర్ ఉన్నత శిఖరాలను చేరుకుంటుంది. మీ ఆదాయం భారీగా పెరగుతుంది. వ్యాపారంలో ఉన్నవారు అయితే ఈ రోజున మీరు ఊహించని లాభాలను అందుకోవడానికి సిద్ధంగా ఉండండి. ప్రభుత్వ రంగంలో పనిచేసేవాళ్లకి ప్రమోషన్ రూపంలో మీ కష్టం ఫలిస్తుంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు మరింతగా పెరుగుతాయి. మీరు చేసిన పెట్టుబడులు ఇప్పుడు బంగారు పంటను పండిస్తాయి. మీరు మనసు పెట్టి చేసే ప్రతి పనిలో విజయం మీ సొంతం అవుతుంది. అంతే కాదు, మీ తెలివితేటలతో మీరు బాగా డబ్బు ఆదా చేయగలుగుతారు. ఈ శుభ సమయంలో లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.

మకర రాశి
2025 అక్షయ తృతీయ మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పును తీసుకురానుంది. ఆరు రాజయోగాల శక్తి మీ వెన్నంటి ఉండి మీరు చేపట్టిన ప్రతి కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేయడంలో మీకు సహాయపడుతుంది. మీరు ఉద్యోగస్తులైతే మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. పదోన్నతులు మీ తలుపు తట్టే అవకాశం ఉంది. మీ జీవితం మరింత సౌకర్యవంతంగా, సంతోషంగా మారుతుంది. సమాజంలో మీ గౌరవం, మర్యాద పెరుగుతాయి. కొత్త బాధ్యతలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి..వాటిని మీరు ధైర్యంగా స్వీకరించి, మీ సత్తా చాటుతారు. విదేశాలకు వెళ్లే అవకాశం కూడా లభిస్తుంది. ఆర్థికంగా మీరు బలపడతారు, మీ స్థానం మరింత మెరుగుపడుతుంది. ఈ అక్షయ తృతీయ మీకు నిజంగా ఒక గొప్ప మలుపు తిరగనుంది.

తుల రాశి
2025 అక్షయ తృతీయ మీ జీవితంలో ఒక సంపద వసంతాన్ని తీసుకురాబోతోంది. ఆరు రాజయోగాల అద్భుతమైన కలయికతో ఎన్నో ఏళ్లుగా మీరు ఎదురుచూస్తున్న కోరికలు ఈ అక్షయ తృతీయతో నెరవేరుతాయి. ఊహించని ధన లాభాలు కలుగుతాయి. మీ ఆర్థిక పరిస్థితి అనూహ్యంగా మెరుగుపడుతుంది. మీకు అనేక మార్గాల నుండి ధనం వస్తుంది. సొంతింటి కల లేదా కోరుకున్న వాహనం కొనుగోలు చేసే సువర్ణావకాశం మీకు లభిస్తుంది. మీ జీవనశైలిలో ఒక ఆహ్లాదకరమైన మార్పు చోటుచేసుకుంటుంది. మీ ప్రేమ జీవితం మరింత ఆహ్లాదకరంగా మారుతుంది, బంధాలు బలపడతాయి. వ్యాపారం చేసేవాళ్లు లాభదాయకమైన కొత్త ఒప్పందాలు వస్తాయి. కళాకారులకు కీర్తి కిరీటం దక్కుతుంది, సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే మీ కోసం ఒక మంచి అవకాశం తలుపు తట్టడానికి సిద్ధంగా ఉంది. తులా రాశి వారికి 2025 అక్షయ తృతీయ నిజంగా ఒక అదృష్టాల గనిలాంటిది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Desktop Bottom Promotion