Latest Updates
-
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు! -
మిగిలిపోయిన ఇడ్లీతో పది నిమిషాల్లో స్పైసీ ఇడ్లీ ఫ్రై.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! -
టెన్షన్స్ తో బీపీ పెరుగుతోందా? అయితే బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఉన్నట్లే!..బయటపడే బ్రహ్మాస్త్రం ఇదే!
ఏప్రిల్ 30న అక్షయ తృతీయ..మీ రాశి ప్రకారం ఏది కొంటే అదృష్టమో తెలుసా?
హిందువులు జరుపుకునే పండుగల్లో అక్షయ తృతీయ అత్యంత ముఖ్యమైనది. ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున లక్ష్మీదేవిని,విష్ణువుని పూజించడం వల్ల సిరిసంపదలు,అదృష్టం లభిస్తాయని విశ్వసిస్తారు. అక్షయ తృతీయ రోజునే త్రేతాయుగం ప్రారంభమైందని నమ్ముతారు. పవిత్ర గంగానది స్వర్గం నుంచి భూమ్మీదకు వచ్చిన రోజు కూడా ఇదేనని, పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు వారికి ఆహార కొరత లేకుండా ఉండేందుకు శ్రీకృష్ణుడు ద్రౌపదికి అక్షయ పాత్రను ప్రసాదించిన రోజు కూడా ఇదేనని చెబుతున్నారు. కుబేరుడు కూడా ఈ రోజే శివుడు, బ్రహ్మ దీవెనలు పొంది స్వర్గపు సంపదకు అదిపతి అయినట్లు నమ్ముతారు.
అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేయడం, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం లేదా ఏదైనా ముఖ్యమైన పని మొదలుపెట్టడం, దాన ధర్మాలు చేయడం మంచిదని..దీనివల్ల లక్ష్మీదేవితో పాటు కుబేరుడి ఆశిస్సులు కూడా లభిస్తాయని నమ్ముతారు. అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం అక్షయ తృతీయ రోజున ఏ రాశి వ్యక్తులు ఏ వస్తువులు కొనడం శుభప్రదమో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి
అక్షయ తృతీయ రోజున కుజుడు అధిపతిగా ఉండే మేషరాశిలో జన్మించిన వ్యక్తులు ఎరుపు రంగు వస్తువులు కొనడం మంచిందని.. ఎట్టిపరిస్థితుల్లో కూడా నలుపు, గోధుమ రంగు వస్తువులను ఈ రోజున కొనుగోలు చేయడకూడని జ్యోతిష్య పండితులు తెలిపారు. ఈ పవిత్రమైన రోజున రాగి పాత్రల కొనడం, పూజ సమయంలో వాటిని ఉపయోగిస్తే అంతా శుభం జరుగుతుందని తెలిపారు. గులాబీ రంగు, పసుపు రంగులకు మాత్రం దూరంగా ఉండాలని తెలిపారు. గోదానం చేయడం ద్వారా మీ జీవితంలో పేరుకుపోయిన కష్టాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
వృషభ రాశి
వృషభ రాశికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. ఈ అక్షయ తృతీయ రోజున ఈ రాశి వాళ్లు నీలం,క్రీమ్, తెలుపు రంగుల బట్టలు ధరించడం లేదా వస్తువులు కొనుగోలు చేయడం మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. బియ్యం, మినుములు, ఆవును కొనుగోలు చేయడం శుభాన్ని కలిగిస్తుందని అదేవిధంగా గోవును దానం చేయడం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. అన్నదానం కూడా మంచిదని చెబుతున్నారు.
మిథున రాశి
మిథున రాశి వారికి తెలివైన బుధుడు అధిపతి. ఈ ఏడాది అక్షయ తృతీయ నాడు కొత్త గ్యాడ్జెట్లు కొంటే అద్భుతమైన ఫలితాలు పొందుతారని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. మీ తెలివితేటలకు మరింత పదను పెట్టే ఎలక్ట్రానిక్ వస్తువులు ఈ రోజున కొనడం విశేషంగా కలిసి వస్తుంది. ప్రకృతిని తలపించే ఆకుపచ్చ రంగులు దుస్తులు ధరించడం లేదా కొనడం మీకు మరింత సానుకూల శక్తినిస్తుందని తెలిపారు.
కర్కాటక రాశి
చల్లదనాన్ని ఇచ్చే చంద్రుడు కర్కాటక రాశికి అధిపతి. అక్షయ తృతీయ పండుగ రోజున కర్కాటక రాశి వ్యక్తులు వెండా వస్తువులు కొనడం ఉత్తమం అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. వెండి చల్లదనానికి, స్వచ్ఛతకు చిహ్నం. వెన్న లాంటి క్రీమ్ రంగు, సూర్యుడిలా వెలిగే పసుపు రంగు వస్తువులు ఈ రోజున ఉపయోగించడం కలిసొస్తుందని తెలిపారు.
సింహరాశి
సింహరాశికి తేజోవంతుడు అయిన సూర్యభగవానుడు అధిపతి. సూర్యుడికి ప్రీతికరమైన లొహంవ రాగి. కాబట్టి అక్షయ తృతీయ రోజున రాగి వస్తువులు కొనుగోలు చేయడం మంచిదని జ్యోతిష్య పండితులు తెలిపారు. రాగిలోని శక్తి మీ తేజస్సుని మరింతగా పెంచుతుందని,శుభ ఫలితాలను కలిగిస్తుందని తెలిపారు. బూడిద రంగు వస్తువులను ఈ పవిత్రమైన రోజున కొంటే మంచి ఫలితాలు వస్తాయని, బూడిద రంగు స్థిరత్వానికి, బలానికి చిహ్నంగా పరిగణించబడుతుందని తెలిపారు.
కన్య రాశి
కన్య రావికి అధిపతి బుధుడు కాబట్టి అక్షయ తృతీయ రోజున ఇంటి పెరట్లో లేదా బాలన్నీలో ఒక తులసిమొక్కను నాటండి. తులసి మొక్క సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానం. ఈ పవిత్రమైన రోజున తెలుపు,గోధుమ, లేత ఆకుపచ్చ,నీలం రంగులు మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. మీరు వేసుకునే బట్టలు లేదా కొనుగోలు చేసే వస్తువుల్లలో ఈ రంగులకు ప్రాధాన్యత ఇవ్వాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. అయితే పొరపాటున కూడా ఎరుపు రంగు వస్తువులు కొనకూడదని లేదా వాడటం మంచిది కాదని తెలిపారు.
తుల రాశి
తుల రాశికి శుక్రుడు అధిపతి. శుక్రుడు సౌందర్యానికి,సంపదకు కారకుడు. అక్షయ తృతీయ రోజున తుల రాశి వాళ్లు కొత్త మొబైల్ ఫోన్ లేదా ల్యాప్ టాప్ లేదా మీకు ఉపయోగపడే ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు కొంటే మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. క్రీమ్ రంగు, నీలం,తెలుపు రంగుల్లో ఉండే వస్తువులను కొనడమే శుభప్రదమని తెలిపారు. అదేవిధంగా గోవుకు ఈ రోజున తోటకూరను పెట్టడం వల్ల మీ ఇంట్లో ధనలక్ష్మీ స్థిరంగా ఉంటుందని తెలిపారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశికి కుజుడు అధిపతిగా ఉంటాడు. అక్షయ తృతీయ రోజున ఈ రాశి వాళ్లు బార్లీ గింజలను కొనడం శుభప్రదమైనదని పండితులు సూచిస్తున్నారు. ఈ పవిత్రమైన రోజున వేసుకునే బట్టలు,ఇతర వస్తువుల్లోనూ ఎరుపు, తెలుపు రంగులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ఈ రంగులు మీకు మరింత శక్తిని, విజయాన్ని చేకూరుస్తాయని చెప్పారు. ఈ రోజున వెంకటేశ్వర స్వామి గుడిలో అర్చన జరిపించడం చాలా మందచిదని తెలిపారు.
ధనస్సు
ధనస్సు రాశికి గురుడు అధిపతిగా ఉంటాడు. అక్షయ తృతీయ రోజున మీ ఇంటికి కొత్త ఇత్తడి పాత్రలను తెచ్చుకొవడం మంచిదని జ్యోతిష్య పండితులు తెలిపారు. ఇత్తడి చాలా శుభప్రదమైన లోహంగా పరిగణిస్తారు. అంతేకాకుండా మీరు వేసుకునే బట్టలు, ఇతర వస్తువుల్లోనూ ఆరెంజ్, సిల్వర్,కుంకుమ రంగులకు ప్రాధాన్యత ఇవ్వాలని,ఈ రంగులు మీకు అదృష్టాన్ని,సంతోషాన్ని కలిగిస్తాయని తెలిపారు. మరీ ముఖ్యంగా ఈ రోజున శక్తి స్వరూపిణి అయిన దుర్గా మాతను భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి మీ జీవితంలో ధన ప్రవాహం పెరుగుతుందని చెబుతున్నారు.
మకర రాశి
మకర రాశికి శని దేవుడు అధిపతి. అక్షయ తృతీయ రోజున ఈ రాశి వ్యక్తులు తప్పకుండా వెండితో చేసిన చిన్నపాటి వస్తువులు కొనుగోలు చేయాలని జ్యోతిష్య పండితులు తెలిపారు. అలాగే నల్ల నువ్వులు దానం చేయడం లేదా శని విగ్రహం దగ్గర సమర్పించడం వల్ల శనిదేవుడి అనుగ్రహం కలుగుతుందని తెలిపారు. నలుపు, నీలం,బూడిద,తెలుపు రంగులకు ఈ పవిత్రమైన రోజున మీరు ప్రాధాన్యతల ఇవ్వాలిని మీరు వేసుకునే బట్టలు, కొనుగోలు చేసే వస్తువులు ఈ రంగుల్లో ఉంటే మంచి జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా ఈ రోజున దగ్గర్లోని శివాలయంలో శివుడికి అభిషేకం చేయించడం ఎంతో పుణ్యప్రదం అని తెలిపారు
కుంభ రాశి
కుంభ రాశికి కూడా అధిపతి శని దేవుడే. ఈ అక్షయ తృతీయ నాడు మీరు కొత్త బట్టలు కొనుగోలు చేయడం చాలా మంచిది. బూడిద, ముదురు నీలం, గోధుమ, సిల్వర్ రంగుల్లో ఉండే వస్తువులను ఎక్కవగా ఉపయోగించడానికి ప్రయత్నించండి. ఈ రోజున ఆంజనేయ స్వామని పూజించడం వల్ల హనుమంతుడి కృపతో మీ జీవితం ప్రశాంతంగా, విజయవంతగా ముందుకు సాగుతుందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
మీన రాశి
మీన రాశికి అధిపతిగా గురుడు ఉంటాడు. ఈ అక్షయ తృతీయ రోజున మీన రాశి వాళ్లు తప్పకుండా బార్లీ,పసుపు కొనుగోలు చేయాలి. ఈ రెండు చాలా శుభప్రదమైనవిగా భావిస్తారు. మీ దుస్తుల్లోనూ పసుపు, తెలుపు, కుంకుమ,బంగారం రంగులకు ప్రాధాన్యత ఇవ్వాలని పండితులు సూచిస్తున్నారు. ఈ రంగులు సాక్షాత్తు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవని..వీటిని ఉపయోగించడం వల్ల మీ ఇంట్లో సరిసంపదలు నిండుగా ఉంటాయని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications











