Latest Updates
-
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.?
Lucky Zodiac Signs: గ్రహాల కటాక్షం..ఈ 5 రాశుల వారికి అక్షయమైన అదృష్టం
దేశవ్యాప్తంగా ఇవాళ(ఏప్రిల్ 30)అక్షయ తృతీయ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే ఈ పవిత్రమైన రోజున గ్రహాలు, నక్షత్రాల ప్రత్యేక స్థానాల వల్ల 5 రాశుల వారి జీవితాల్లో పెద్ద మార్పులు రాబోతున్నాయని జ్యోతిష్య పండితులు తెలిపారు. కెరీర్ పరంగా ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని, ఆర్థికంగా బలపడతారని,పట్టిందల్లా బంగారం అన్నట్లుగా మారుతుందని, ఇన్నాళ్లుగా ఆగిపోయిన పనులన్నీ ఒక్కసారిగా ఊపందుకుంటాయని, కొత్త నిర్ణయాలు,ప్రారంభాలకు ఇది అత్యంత అనుకూల సమయం అని తెలిపారు. గ్రహాలు, నక్షత్రాల ప్రత్యేక కూటమి కారణంగా ఏ 5 రాశుల వారి జీవితాలు సరికొత్త మలుపులు తిరుగుతాయో ఇక్కడ చూడండి.
ధనస్సు రాశి
ధనస్సు రాశి వ్యక్తులకు ఏప్రిల్ 30 నుంచి జీవితంలో కొత్త మార్పులు ఉంటాయి. చాలా కాలంగా మిమ్మల్ని కలవరపెడుతున్న సమస్యలన్నింటికీ ఒక పరిష్కారం లభిస్తుంది. మీ మనస్సులో మెదులుతున్న కొత్త ప్రణాళికలను కార్యరూపం దాల్చడానికి ఇది సరైన సమయం. మీరు చేపట్టే ప్రతి పనిలో విజయం మీ వెంటే ఉంటుంది. మీ ఇంటిలో ఆనందం వెల్లివిరుస్తుంది, శాంతి నెలకొంటుంది. కొత్త ప్రదేశాలు చూడాలనే మీ కోరిక నెరవేరుతుంది. ఆసక్తికరమైన ప్రయాణాలు మీ జీవితంలోకి కొత్త అనుభవాలను తీసుకురానున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ సమయం మీ మానసిక ప్రశాంతతకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఒక రకమైన ప్రశాంతమైన అనుభూతి మిమ్మల్ని ఆవహిస్తుంది.

మకరం
మకర రాశి వ్యక్తులకు ఎంతో కాలంగా పడిన శ్రమకు తగిన ఫలితం ఇప్పుడు అందుతుంది. ఆఫీసులో లేదా కార్యాలయంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఉన్నతాధికారులు,సీనియర్లు మిమ్మల్ని ప్రశంసిస్తారు. మీకు ప్రమోషన్, మరింత మంచి ఉద్యోగంలో చేరే అవకాశాలు కూడా ఉన్నాయి. పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక కల ఇప్పుడు నిజమయ్యే అవకాశం ఉంది. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యులందరూ మీకు అండగా నిలుస్తారు.
మేష రాశి
మేష రాశి వారికి ఏప్రిల్ 30 నుండి జీవితంలో ఒక కొత్త శకం ప్రారంభం కానుంది. ఎన్నాళ్లుగానో ఆగిపోయిన మీ పనులన్నీ ఒక్కసారిగా వేగం పుంజుకుంటాయి. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు, సొంత వ్యాపారం నడుపుతున్న వ్యక్తులకు ఆనందకరమైన వార్తలు అందే సూచనలు ఉన్నాయి . ఒకవేళ మీరు ఉద్యోగం మారాలని చూస్తున్నట్లయితే,ఊహించని కొత్త ప్రదేశాల నుండి ఆకర్షణీయమైన ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా మీ కుటుంబంలో, బంధువులతో సంతోషకరమైన క్షణాలు గడుపుతారు. మీ మనసులోని ఆందోళనలన్నీ మటుమాయమవుతాయని జ్యతిష్య పండితులు చెబుతున్నారు.
మిథున రాశి
మిథునరాశి వారికి ఏప్రిల్ 30 నుంచి అదృష్టకాలం మొదలైందని పండితులు చెబుతున్నారు. విద్యార్థులైనా, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారైనా లేదా వ్యాపారంలో ఉన్నవారైనా మీ విజయానికి ఆకాశమే హద్దుగా మారనుంది. మీరు రాసిన పరీక్షలు, హాజరైన ఇంటర్వ్యూలు లేదా చేపట్టిన ప్రాజెక్టులు అన్నీ ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రేమలో ఉన్నవారి బంధం మరింత బలపడుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది లేదా ఒక మంచి ప్రయాణం చేసే అవకాశం కూడా రావచ్చు. మీ మనస్సు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది, మీలో శక్తి నిండుగా ఉంటుంది.
వృషభం
వృషభ రాశి వ్యక్తుల ఆర్థిక జీవితంలో ఇకపై తిరుగుండదు. గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు ఊహించని లాభాలను తెచ్చిపెడతాయి. ఎప్పుడో ఇచ్చిన అప్పులు సైతం తిరిగి వచ్చి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. కొత్త ప్రయత్నాలు చేయడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. మీ వ్యాపార ఆలోచనలకు రెక్కలు వస్తాయి, నూతన పెట్టుబడులు లాభాల పంట పండిస్తాయి. ఉద్యోగస్తులకు అయితే ఇది నిజంగా పండుగ సమయం. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. జీతం పెరుగుదల రూపంలోనో లేదా ఉన్నత పదవి రూపంలోనో మీ కృషిని గుర్తిస్తారు. ఆరోగ్యం విషయంలోనూ శుభవార్తలే వినిపిస్తాయి. మీరు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. మీలో ఒక నూతన శక్తి, ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుందని జ్యోతిష్య పండితులు తెలిపారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications