ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు వెనక నుంచి పిలిస్తే అపశకునమా?

సాధారంగా మనం ఇంట్లో నుంచి బయటకు ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు, గడప దాటే టైంలో వెనుక నుంచి ఎవరైనా కుటుంబ సభ్యులు లేదా ఇతరులు పిలవడం చాలా సందర్భాల్లో మనకు ఎదురయ్యే అనుభవమే. అయితే ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్లు ఉంటే ఇంటి నుంచి వెళ్లేటప్పుడు అలా వెనక నుంచి పిలవకూడదు, అది అపశకునం అని మందలిస్తుంటారు.

అయితే ఇప్పుడున్న జెన్ జీ యువత మాత్రం దీనిని కేవలం ఒక పాతకాలపు మూఢనమ్మకంగానో లేదా చాదస్తంగానో కొట్టిపారేస్తుంటారు. కానీ మన ప్రాచీన సంప్రదాయాలు, జ్యోతిష్య శాస్త్రం, అలాగే మానసిక శాస్త్రం కూడా దీని వెనుక ఉన్న కొన్ని బలమైన కారణాలను వివరిస్తున్నాయి. అవేంటో ఇక్కడ చూడండి.

Astrology Alert Does Calling from Behind Invite Rahu s Negative Energy

లక్ష్యంపై ఏకాగ్రత చెదిరిపోవడం

ఏదైనా ఒక ముఖ్యమైన పని కోసం ఇంటి నుంచి స్టార్ట్ అయ్యినప్పుడు మన మైండ్ అంతా ఆ పని మీదే లగ్నమై ఉంటుంది. సరిగ్గా ఆ సమయంలో ఎవరైనా వెనుక నుంచి ఆకస్మికంగా పిలిస్తే, ఆ ఆలోచనా ప్రవాహానికి ఒక్కసారిగా బ్రేక్ పడుతుంది. ఈ అవాంతరంతో మన ఏకాగ్రత దెబ్బతిని, మనసు గందరగోళానికి గురవుతుంది. దీనివల్ల చేయబోయే పనికి ఆటంకం కలిగి ఆ పనిలో వైఫల్యం ఎదురవుతుందనేది దీని వెనుక ఉన్న ప్రధాన కారణం.

వస్తువులు మర్చిపోతామనే భయం

దీని వెనుక ఉన్న మరో ఆచరణాత్మకమైన, లాజికల్ కారణం మతిమరుపు. మనం బయటకు వెళ్లాలనే హడావిడిలో అడుగుపెట్టగానే వెనుక నుంచి వినిపించే ఆకస్మిక స్వరం మనల్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేస్తుంది. ఆ శబ్దానికి మనం ఆలోచనల నుంచి బయటకు వచ్చి వెనక్కి తిరిగినప్పుడు, మన మైండ్ లో అప్పటిదాకా ఉన్న ప్లానింగ్ మొత్తం చెదిరిపోతుంది.

ఆ తొందరలో ఏకాగ్రత కోల్పోయి, మనకు అత్యంత అవసరమైన పర్సు, బండి తాళాలు, ఏటీఎం కార్డులు లేదా ముఖ్యమైన డాక్యుమెంట్లు ఇంట్లోనే మర్చిపోయే ప్రమాదం చాలా ఎక్కువ.

రేవతీ నక్షత్రంలోకి శని సంచారం..ఈ 5 రాశులకు మహర్దశ.. మీ రాశి ఫలం ఇప్పుడే చెక్ చేసుకోండి..</a><a class=" title="రేవతీ నక్షత్రంలోకి శని సంచారం..ఈ 5 రాశులకు మహర్దశ.. మీ రాశి ఫలం ఇప్పుడే చెక్ చేసుకోండి.." />రేవతీ నక్షత్రంలోకి శని సంచారం..ఈ 5 రాశులకు మహర్దశ.. మీ రాశి ఫలం ఇప్పుడే చెక్ చేసుకోండి..

జ్యోతిష్య శాస్త్రంలో రాహువు ప్రభావం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు వెనుక నుంచి వినిపించే పిలుపును రాహు గ్రహ ప్రభావంతో ముడిపెట్టి చూస్తారు. జ్యోతిష్యంలో రాహువు అనగానే ఆకస్మిక గందరగోళం, అనవసరమైన ఇబ్బందులు, ఆటంకాలు, ప్రతికూల ఆలోచనలను తెచ్చిపెట్టే గ్రహంగా చెబుతారు. అందువల్ల నడుస్తున్నప్పుడు వెనుక నుంచి ఎవరైనా అకస్మాత్తుగా అడ్డుపడితే మానసికంగా ఒక రకమైన అసౌకర్యం, అశాంతి కలుగుతాయని వివరిస్తారు. ఇది అంతిమంగా ఆ వ్యక్తిలోని ఆత్మవిశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తుందని పండితులు చెబుతుంటారు.

లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుందా?

సనాతన ధర్మ సంప్రదాయాల ప్రకారం గడప దాటుతున్నప్పుడు ఎవరినైనా వెనక్కి పిలవడాన్ని లేదా అడ్డు తగలడాన్ని అత్యంత అశుభంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల ఐశ్వర్యానికి ప్రతీక అయిన లక్ష్మీదేవికి కోపం వస్తుందని ఒక బలమైన మత విశ్వాసం ప్రజల్లో నాటుకుపోయింది. ఇది నేరుగా ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితిపై, వ్యాపారంలో లాభనష్టాలపై, అలాగే కుటుంబం మొత్తానికీ సంబంధించిన శ్రేయస్సుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నమ్ముతారు.

ఎవరైనా పిలిస్తే ఏం చేయాలి?

ఒకవేళ మీరు బయలుదేరుతున్నప్పుడు ఎవరైనా తెలియక వెనక నుంచి పిలిస్తే లేదా అడ్డుపడితే, కంగారు పడిపోయి ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదు. దాని గురించి నెగిటివ్ గా ఆలోచించకండి. ఇలాంటి పరిస్థితుల్లో మీ ప్రయాణాన్ని కాస్త ఆపి, తిరిగి ఇంట్లోకి వెళ్లి ఒక నిమిషం పాటు ప్రశాంతంగా కూర్చోండి. ఆ తర్వాత రెండు గుక్కల మంచినీళ్లు తాగి, ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి. మీ ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుని, సానుకూల దృక్పథంతో మళ్లీ మీ పనికి బయలుదేరండి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Story first published: Saturday, August 22, 2026, 12:24 [IST]
q
Desktop Bottom Promotion