Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
మీ బాత్‌రూమ్‌లో ఈ ఒక్క వస్తువు ఉంచితే చాలు.. డబ్బు కష్టాలు తొలగినట్లే.!
ఇల్లు కట్టేటప్పుడు తప్పనిసరిగా వాస్తు సలహాలు పాటిస్తాం. గుమ్మాలు ఎటువైపు ఉండాలి, పడకగది, వంట గది, బాత్ రూమ్ ఇలా ప్రతి గదినీ వాస్తు ప్రకారం నిర్మించుకుంటాం. అయినంత మాత్రాన సరిపోతుందా అంటే కొన్ని సందర్భాల్లో ఇంట్లో ప్రతికూల వాతావరణం కారణంగా ఆర్థిక బాధలు, కష్టాలు వస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీ ఇంటి బాత్‌రూమ్‌లో ఈ ఒక్క వస్తువు ఉంచారంటే డబ్బు కష్టాలు తొలగి సంపాదన మెరుగుపడుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.. అవేంటో చూద్దాం..

ఇంటికి సంబంధించి చాలా మంది బాత్‌రూమ్ వాస్తును అంతగా పట్టించుకోరు. దీని ప్రభావం వల్ల ఆర్థిక, ఆరోగ్య సంబంధిత సమస్యలు వస్తాయని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇందుకు పరిష్కారంగా ఎక్కువ ఖర్చు లేకుండా ప్రభావవంతమైన పరిష్కారాన్ని వాస్తు శాస్త్రం సూచిస్తోంది. బాత్‌రూమ్‌లో ఉప్పు ఉంచడం ద్వారా ప్రతికూల శక్తి తొలగి.. ఇంట్లో సానుకూల వాతావరణం పెంచుతుందని పండితులు అంటున్నారు. ఆర్థిక కష్టాలు తొలగడంతో పాటు సంపాదన, పొదుపు పెరుగుతుందని చెబుతున్నారు. సముద్రపు ఉప్పును ఒక గాజు గిన్నెలో వేసి బాత్‌రూమ్‌లో ఉంచాలని సూచిస్తున్నారు.
సాధారణంగా ఇంట్లో పడక గది, వంట గది విషయంలో వాస్తుకి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. డ్రెస్సింగ్ టేబుల్, బీరువా, మంచాలు ఇలా ప్రతి ఒక్కదానిని వాస్తుకి అనుగుణంగా సర్దుకుంటాం. పూజ గదిని సరైన స్థానంలో ఉంచుతాం. వంట గదిలో పొయ్యి. వంట సామగ్రి ఇలా ప్రతి దానికి ఒక పద్ధతి పాటిస్తాం. కానీ బాత్‌రూమ్ విషయానికి వచ్చే సరికి నిర్లక్ష్యం వహిస్తాం. స్నానాల గదిని కూడా ప్రత్యేకంగా భావించాలి. లేదంటే అనేక వాస్తు దోషాలకు దారితీస్తుంది.

బాత్రూంలో ఉప్పు ఉంచండి
ఇందుకు పరిష్కారంగా బాత్‌రూమ్‌లోని ఒక మూలకి గాజు గిన్నెలో కొంచెం ఉప్పు ఉంచడం ద్వారా ప్రతికూల శక్తి, దిష్టిని తొలగిస్తుంది. రాహు కేతువుల నుంచి కలిగే ప్రతికూల ప్రభావాన్ని తగ్గిస్తుంది. గాలిలో, పరిసరాల్లో ప్రతికూల శక్తిని గ్రహించి పాజిటివ్ వైబ్రేషన్స్‌ని కలిగిస్తుంది. ఈశాన్య మూలలో లేదా ప్రధాన ద్వారం ఎదుట ఉప్పును ఉంచడం ద్వారా దోషాన్ని గణనీయంగా తగ్గిస్తుందని పండితులు సూచిస్తున్నారు.
రాతి ఉప్పు లేదా ఇంట్లో వాడే సాధారణ ఉప్పును ఒక గాజు గిన్నెలో వేసి బాత్‌రూమ్‌లోని ఒక మూల ఉంచండి. వారానికి లేదా పదిహేను రోజులకొకసారి పాత ఉప్పును తీసేసి తాజా ఉప్పును ఉంచండి. ఇలా కొంతకాలం పాటూ పాటించడం ద్వారా సానుకూల ఫలితాలు కనిపిస్తాయని వాస్తు పండితులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications