Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ చికెన్ 65 బిర్యానీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
కొరియన్ల లాగా మెరిసే చర్మం మీ సొంతం కావాలా? అయితే ఈ 5 పండ్లు తినాల్సిందే! -
బరువు తగ్గించి, రక్తాన్ని పెంచే పనస గింజల లడ్డూ.. ఈ స్వీట్ తింటే ఎముకలు దృఢంగా, కంటిచూపు మెరుగ్గా! -
వందల రోగాలను నయం చేసే మునగాకుతో టేస్టీ పూరీ..ఎలా చేసుకోవాలంటే.. -
దోశ, రైస్, చపాతీలోకి కిర్రాక్ అనిపించే చికెన్ చాప్స్..ఈ ఆదివారం స్పెషల్ గా మారిపోతుంది -
టిఫిన్స్ లోకి ఈ వెల్లుల్లి చట్నీ చేస్తే..రోజూ తినేదాని కన్నా ఎక్కువ తినేస్తారు! -
ఆదివాసీ ఫిష్ ఫ్రై..గారెల్లా కరకరలాడుతూ భలే రుచిగా -
అయ్యయ్యో పాపం తాత..75 ఏళ్ల వ్యక్తితో 30 ఏళ్ల యువతి పెళ్లి వ్యవహారంలో భారీ ట్విస్ట్..వీడియో చూడండి -
చపాతీ, పూరీల్లోకి అదిరిపోయే శరవణ భవన్ స్టైల్ క్యాలీఫ్లవర్ కుర్మా..ఈజీగా చేసుకోండిలా.. -
అమృతం రుచిని తలపించేలా వంకాయ పచ్చడి..ఇలా చేస్తే 2 నెలలు నిల్వ
రైస్ vs చపాతీ..రాత్రి డిన్నర్ లోకి ఏది తినాలి?..డాక్టర్ దీప్తి చెప్పిన కీలక విషయం..
ప్రస్తుతం మారిన ఆహార అలవాట్లు, జీవనశైలి మార్పుల కారణంగా అనేక రోగాల మనల్ని చుట్టుముడుతున్నాయి. చిన్న వయస్సులోనే షుగర్ వంటి దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ముఖ్యంగా కరోనా తర్వాత నుంచి ఆరోగ్యం పట్ల ఎక్కువగా కేర్ తీసుకుంటూ ఆహార అలవట్లను మార్చుకుంటున్నారు.
అయితే షుగర్ ఉన్నవాళ్ల ఆహార నియమాల విషయంలో ఎప్పుడూ ఒక డౌట్ ఉంటుంది. షుగర్ పేషెంట్లు రాత్రిపూట భోజనంలోకి ఒక కప్పు రైస్ తినాలా లేదా చపాతీ తినాలా? అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. షుగర్ లెవల్స్ పెరగకూడదు అంటే ఏది బెస్ట్ ఆప్షన్ అనే విషయంపై అవగాహన ఉండటం అందరికీ చాలా ముఖ్యం. ప్రముఖ డాక్టర్ దీప్తి కరేటి తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేసిన ఒక వీడియో పోస్ట్ చేశారు. అందులో ఆమె ఏం చెప్పారో ఇక్కడ చూడండి.

ప్రముఖ డాక్టర్ దీప్తి కరేటి తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో తెలిపిన వివరాల ప్రకారం..ఒక కప్పు రైస్ అంటే పిడికెడు అన్నంలో 50 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అదే ఒక చపాతీలో 15 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. చపాతీని గోధుమపిండితో తయారుచేస్తారు కాబట్టి ఇందులో రైస్ తో పోల్చితే ఎక్కువ పోషకాలు లభిస్తాయి. ఒక చిన్న 6 అంగుళాల చపాతీలో దాదాపు 71 కేలరీలు, 3 గ్రాముల ప్రొటీన్, 0. 4 గ్రాముల కొవ్వు, 15 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. గోధుమలతో పోలిస్తే రైస్ లో పాస్పరస్, మెగ్నీషియం తక్కువ పరిమాణంలో ఉంటాయి. మరోవైపు, ఫొలెట్, ఐరన్..అన్నం, చపాతీ రెండిట్లో ఒకే పరిమాణంలో ఉంటాయి.
టైప్ 2 షుగర్ పేషెంట్లు చపాతీ తినొచ్చా?
గోధుమపిండిలో జొన్న, సజ్జలు, రాగి వంటి పిండి రకాల మిశ్రమాన్నికలిపి చేయడం వల్ల చపాతీ పోషక విలువలలో వైవిధ్యం పెరుగుతుంది. ఈ ధాన్యాలకు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇవి ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉంటాయి, అందువల్ల మల్టీగ్రెయిన్ చపాతీ షుగర్ పేషెంట్లకు బెస్ట్ ఆప్షన్.
2 చపాతీలకు ఎంత అన్నం సమానం?
అన్నానికి ఎన్ని చపాతీలు సమానం? కేలరీల పరంగా.. ఒక స్టాండర్డ్ సైజ్ చపాతీ సుమారుగా అర కప్పు వండిన అన్నానికి సమానం.

షుగర్ ఏ గోధుమ పిండి ఉత్తమమైనది?
సంపూర్ణ ధాన్యాలతో చేసిన పిండిని చపాతీ తయారీకి వాడండి. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, రిఫైన్డ్ గోధుమ పిండి కంటే దీని గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. సంపూర్ణ పచ్చి గోధుమ పిండిలో ఊక, ఎండోస్పెర్మ్ తో సహా ధాన్యంలోని అన్ని భాగాలు ఉంటాయి, ఇది షుగర్ ఉన్నవారికి హెల్తీ ఆప్షన్.
అన్నింటికన్నా తెలుసుకోవాల్సిన నిజం
రైస్, చపాతీ రెండూ తిన్నా కూడా క్వాంటిటీ అనేది అత్యంత ముఖ్యం అని డాక్టర్ దీప్తి కరేటి చెబుతున్నారు. అంటే ఒక కప్పు రైస్ అయినా తినొచ్చు లేదా 2 చపాతీలు అయినా తినొచ్చు. చపాతీ అయితే కొలత ప్రకారం ఉంటది కాబట్టి 2 చపాతీలు తిని డిన్నర్ ముగిస్తారు. అదే రైస్ అయితే లిమిట్ ఉండదు కాబట్టి షుగర్ పేషెంట్లు డిన్నర్ లోకి 2 చపాతీలు తింటే సరిపోతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
