Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
ఆ రాశుల వారిపై సత్తా చాటనున్న బుధుడు.. జనవరి 4వ తేదీ వరకు వారికి తిరుగు ఉండదు! ఆ రాశులు ఏవంటే?
నవ గ్రహాల్లో బుధ గ్రహం అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. అలాంటి గ్రహం ఈ ఏడాది ఆక్టోబర్ 31న అంటే దీపావళి రోజున వృశ్చిక రాశిలోకి ప్రవేశించాడు. అదే రాశిలో బుధుడు జనవరి 4వ తేదీ వరకు కొనసాగనున్నాడు. ఇదే ఒక విశేషమంటే.. శనీశ్వరుడు, గురువు గ్రహాలు బుదుడుని సంపూర్ణమైన పూర్ణ దృష్టితో చూస్తున్నారు. ఇది మరొక విశేషం. ఇంకో యాదృశ్చిక విషయం కూడా ఉంది. అదేంటంటే?..
సాధారణంగా బుధుడు ఏ రాశిలోనైనా మూడు వారాలకు మించి ఎక్కువగా రోజులు సంచరించడు. అయితే ఈసారి మాత్రం వృశ్చిక రాశిలో ఏకంగా 64 రోజులు సంచరిస్తున్నాడు. దీని కారణంగా పలు రాశుల వారికి దీర్ఘకాలిక ప్రయోజనాలు కలగనున్నాయి. జీవితం కొత్త పుంతలు తొక్కనున్నాయి. అలాగే ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ వ్యవహారాల్లో శుభపరిణామాలు జరగనున్నాయి. అయితే ఆ రాశులు ఏంటి? ఏ రాశుల వారికి శుభపరిణామాలు జరగనున్నాయనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వృషభం: ఈ రాశి వారికి బుధుడు సప్తమ స్థానంలో బుధుడు సంచరిస్తున్నాడు. అలాగే బుధుడిని గురు, శని గ్రహాలు పూర్ణ దృష్టితో వీక్షిస్తున్నారు. దీని కారణంగా జనవరి 4వ తేదీలోపు ఈ రాశి వారికి పెళ్లి సంబంధం ఖరారయ్యే అవకాశం ఉంది. పెళ్లితో వీరి జీవిత లక్ష్యం, జీవిత గమ్యం మారిపోనుంది. ఆర్ధిక సమస్యల నుంచి దాదాపు బయటపడతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త ప్రదేశంలో జీవితం ప్రారంభమవుతాయి.
కర్కాటకం: ఈ రాశి వారికి పంచమ స్థానంలో బుధుడు సంచరించడం.. బుధుడిపై గురు, శని గ్రహాల ద్రుష్టి పడడం వల్ల.. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి, గృహ సంబంధిత విషయాల్లో సమస్యలు తొలగిపోయి, వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. సంతానయోగం కలిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగ జీవితంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొత్త వారితో పరిచయం ఏర్పడి.. సమాజంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది.
సింహ: ఈ రాశి వారికి నాలుగో స్థానంలో బుధుడు సంచరిస్తున్నాడు. అలాగే బుధుడిపై గురు, శని గ్రహాల ద్రుష్టి ఉండడంతో సింహ రాశి జాతకులకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో హోదాలు పెరుగుతాయి. కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేసే అవకాశం ఉంటుంది. కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఆస్తి సమస్యలు తొలిగిపోతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.
వృశ్చిక రాశి: బుధుడు ఈ రాశిలోనే సంచరిస్తున్నాడు. అలాంటి బుధుడిని శని, గురు గ్రహాలు వీక్షిస్తున్నాయి. దీని కారణంగా ఉద్యోగులు మరింత మంచి ఉద్యోగంలో మారే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఉద్యోగంలో మరింత కొత్త బాధ్యతలు రానున్నాయి. అలాగే ఉద్యోగ జీవితంలో గౌరవం కూడా పెరగనుంది. పదోన్నతి కూడా లభించనుంది. నూతన ఇంట్లోకి గృహ ప్రవేశం చేసే అవకాశం ఉంది.
మకరం: ఈ రాశి వారికి బుధుడు లాభ స్థానంలో సంచరిస్తున్నాడు. లాభ స్థానంలో ఉన్న బుధుడిని గురు, శని గ్రహాలు చూడడం వల్ల.. సరికొత్త ఆదాయవకాశాలు కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో కీలకమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ జీవితంలో హోదా పెరుగుతుంది. ఆశించిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది. సామాజికంగా గుర్తింపు లభిస్తుంది. ఊహించని పరిచయాలు జీవితాన్ని మలుపు తిప్పుతాయి.
కుంభం: ఈ రాశి వారికి బుధుడు ఉద్యోగ స్థానంలో సంచరిస్తున్నాడు. అలాంటి బుధుడిపై గురు, శని గ్రహాల చూపు పాడడం వల్ల.. ఉద్యోగంలో సానుకూలమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతితో పాటు స్థాన చలనం కూడా జరగనుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల రీత్యా విదేశాలకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రముఖులతో ఏర్పడిన పరిచయాల కారణంగా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
