Latest Updates
-
ఐరన్, విటమిన్స్ నిండిన మునగాకు గోధుమ దోసె..బరువు తగ్గాలనుకునేటోళ్లకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ -
ఫోన్ పగలగొట్టాడని తండ్రిని దారుణంగా చంపిన కూతురు! -
కాలిఫ్లవర్ తో ఇలా చేస్తే పకోడీ కూడా పనికిరాదు.. టేస్ట్ అదుర్స్! -
నడుము నొప్పితో విసిగిపోయారా? మీ వెన్నెముకను ఉక్కులా మార్చేసే చిట్కా ఇదే! -
కార్తీక మాసం స్పెషల్ ఉసిరికాయ పులిహోర..చాలా కమ్మని రుచిగా చేసుకోండిలా.. -
ఎముకలు బలంగా అవ్వడానికి,బాడీలో రక్తం పట్టాలంటే ఈ స్వీట్ తినండి..చేయడం చాలా సింపుల్.. -
నెయ్యి గురించి చాలామందికి తెలియని నిజం ఇదే.. -
బీహార్ స్పెషల్ దాల్ పూరీ.. శనగపప్పు స్టఫింగ్ తో పర్ఫెక్ట్ రెసిపీ -
జస్ట్ 20 నిమిషాల్లో ది బెస్ట్ సాంబార్ రైస్.. రెస్టారెంట్ ని మించిన రుచితో ఎలా చేసుకోవాలంటే.. -
మలబద్దకంతో బాధపడుతున్నారా? మోషన్ ఫ్రీగా అవ్వాలంటే ఈ ఫుడ్స్ తినండి
హెల్తీగా ఉంటాం, బరువు తగ్గొచ్చని ఓట్స్ తింటున్నారా? ఈ విషయం తెలియకుంటే డేంజర్ లో పడతారు!
చాలామంది ఇప్పుడు ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఇడ్లీ.దోశ, పూరీ వంటి టిఫిన్స్ తినడం మానేసి ఓట్స్ తింటున్నారు. హెల్తీగా, ఫిట్ గా ఉండేదుకు ఓట్స్ బెస్ట్ అని వాటిని తింటున్నారు. బరువు తగ్గడం దగ్గర నుండి జీర్ణవ్యవస్థను మెరుగుపరచడం వరకు ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఓట్స్ సొంతం.
అయితే ఇంతటి సూపర్ ఫుడ్ ను తప్పుగా తింటే ప్రయోజనాలకు బదులు అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్లేనని ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ సలీమ్ జైదీ హెచ్చరిస్తున్నారు. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఓట్స్ తినేటప్పుడు మనం చేసే కొన్ని పొరపాట్లను ఆయన వివరించారు. ఆ తప్పులేంటో, వాటిని ఎలా సరిదిద్దుకోవాలో ఇక్కడ చూడండి.

ఇన్ స్టంట్ ఓట్స్ తో ముప్పు
ఉరుకుల పరుగుల జీవితంలో సమయాన్ని ఆదా చేసుకోవడానికి చాలామంది ఇన్ స్టంట్ ఓట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ వీటిలో తరచుగా కృత్రిమ ఫ్లేవర్లు, ఉప్పు, చక్కెర శాతం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండటం మంచిది. వాటికి బదులుగా ఎలాంటి ఫ్లేవర్లు లేని సాదా ఓట్స్, రోల్డ్ ఓట్స్ లేదా స్టీల్ కట్ ఓట్స్ ఎంచుకోవడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
ప్యాక్ చేసిన మసాలా ఓట్స్ వద్దు
మార్కెట్లో దొరికే రెడీమేడ్ మసాలా ఓట్స్ రుచిగా ఉండటమే కాకుండా ఇట్టే వండేయొచ్చు. కానీ ఈ ప్యాకెట్లలో సోడియం (ఉప్పు) మోతాదు చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా రోజూ తినడం వల్ల శరీరంలో సోడియం పెరిగి బీపీ లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఇంట్లోనే సాదా ఓట్స్ తీసుకుని, తాజా కూరగాయలు, సహజమైన సుగంధ ద్రవ్యాలు వేసుకుని వండుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.

సరైన మోతాదులో తీసుకోకపోవడం
ఓట్స్ తినగానే బరువు తగ్గిపోతామని, కొద్దిగా మాత్రమే తినేస్తుంటారు కొందరు. కానీ అతి తక్కువగా తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు సరిగ్గా అందవు. దీనివల్ల బరువు తగ్గరు సరి కదా ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. మీ శరీరానికి రోజూవారీ అవసరమయ్యే క్యాలరీలు, చేసే శారీరక శ్రమ, మీ ఆకలిని బట్టి సరైన మోతాదులో ఓట్స్ తీసుకోవాలి.
తీపి కోసం చక్కెర కలపడం
ఓట్స్ కాస్త చప్పగా ఉంటాయన్న ఉద్దేశంతో చాలామంది అందులో చక్కెర, చాక్లెట్ సిరప్ లేదా కృత్రిమ స్వీటనర్లు కలుపుతుంటారు. ఇలా చేయడం వల్ల ఓట్స్ లో చక్కెర శాతం అమాంతం పెరుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారు, రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవాలనుకునే వారు ఓట్స్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ చక్కెర కలపకూడదు. తీపి కావాలనుకుంటే తాజా పండ్లు కలుపుకోవడం బెటర్.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
