చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఉసిరి జామ్..మీ ఇంట్లోనే సింపుల్ గా చేసుకోండిలా..

Posted By:

చలికాలంలో చల్లటి గాలులే కాదు దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్ల ప్రాబ్లమ్స్ కూడా కామన్ గా వస్తుంటాయి. ఈ టైంలో మన రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుకోవాలి. దీనికోసం మనం తినే ఫుడ్ పైన శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా చలికాలంలో లభించే ఉసిరికాయ ఆరోగ్యానికి ఒక అద్భుతమైన సూపర్ ఫుడ్. విటమిన్ C పుష్కలంగా ఉండే ఉసిరితో మన దేశంలో పచ్చళ్లు, మురబ్బాలు, జ్యూస్‌ లు వంటి రకరకాల వంటకాలు తయారు చేసుకుని తింటూ ఉంటారు.

చాలామంది ఉసిరికాయ చట్నీలను ఇష్టపడతారు, కానీ మీరు ఎప్పుడైనా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే ఉసిరికాయ జామ్ రుచి చూశారా? ఇది రుచిలో అద్భుతంగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఉసిరికాయ జామ్‌ ను సులభంగా ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

Healhy delicious usirikaya jam recipe in telugu Boost Your Immunity This Winter with amla jam

కావాల్సిన పదార్థాలు

ఉసిరికాయలు: 500 గ్రాములు
చక్కెర లేదా బెల్లం: 400 నుండి 450 గ్రాములు
యాలకుల పొడి: 1 టీస్పూన్
దాల్చినచెక్క పొడి లేదా చిన్న ముక్క: అర టీస్పూన్
నిమ్మరసం: 1 టీస్పూన్
నల్ల ఉప్పు: అర టీస్పూన్

ఐరన్, విటమిన్స్ నిండిన మునగాకు గోధుమ దోసె..బరువు తగ్గాలనుకునేటోళ్లకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్

ఉసిరికాయ జామ్ తయారీ విధానం

-ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులో తగినన్ని నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో కడిగిన ఉసిరికాయలను వేయాలి. ఉసిరికాయలు మెత్తబడే దాకా, వాటి రేకులు వాటంతట అవే వేరుపడటం మొదలయ్యేదాకా మీడియం మంట మీద ఉడికించాలి. బాగా ఉడికిన తర్వాత మంట ఆపేసి వాటిని చల్లారనివ్వాలి.

-ఉసిరికాయలు పూర్తిగా చల్లారిన తర్వాత, వాటిలోని గింజలను తీసేసి.. ఉసిరికాయ గుజ్జును ఒక మిక్సీ జార్‌ లో వేయాలి. ఇది మెత్తటి పేస్ట్ లాగా మారే వరకు బ్లెండ్ చేయాలి. మీరు చేతితో కూడా దీన్ని మెత్తగా మెదుపుకోవచ్చు, అయితే మిక్సీలో రుబ్బడం వల్ల జామ్‌ కు మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ లాంటి నునుపైన, చక్కటి ఆకృతి వస్తుంది

-ఇప్పుడు స్టవ్ వెలిగించి, ఒక మందపాటి అడుగున్న కడాయిని పెట్టాలి. అందులో సిద్ధం చేసుకున్న ఉసిరి గుజ్జు, చక్కెర లేదా బెల్లం వేయాలి. మంటను మీడియంలో ఉంచి, అడుగు అంటకుండా గరిటెతో నిరంతరం కలుపుతూ ఉడికించాలి. చక్కెర కరిగే కొద్దీ మిశ్రమం కొద్దిగా పల్చబడటం మొదలవుతుంది. ఆ తర్వాత అది నెమ్మదిగా ఉడికి చిక్కబడుతుంది.

-ఉసిరి మిశ్రమం బాగా చిక్కబడటం ప్రారంభమైనప్పుడు, అందులో నల్ల ఉప్పు, యాలకుల పొడి, దాల్చినచెక్క పొడిని కలపాలి. ఈ దశలోనే నిమ్మరసం కలపాలి. ఇవన్నీ వేశాక మరో రెండు నిమిషాలు బాగా కలపాలి.

-మిశ్రమం గిన్నెకు అంటుకోకుండా చిక్కటి జామ్ రూపంలోకి వచ్చేంత వరకు ఉడికించాలి. జామ్ పర్ఫెక్ట్ స్టేజ్‌ కి వచ్చిందో లేదో చెక్ చేయడానికి, కొద్దిగా మిశ్రమాన్ని ఒక క్లీన్ ప్లేట్‌ లో వేసి చూడండి. అది పక్కలకు పారకుండా అలాగే ఉంటే, మీ ఉసిరికాయ జామ్ రెడీ.

-ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, జామ్‌ను పూర్తిగా చల్లారకండా గాజు సీసాలో భద్రపరుచుకోవచ్చు. దీనిని ఉదయాన్నే బ్రెడ్, రోటీ లేదా చపాతీపై పూసి పిల్లలకు పెడితే ఎంతో ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ అవుతుంది.

[ of 5 - Users]
Story first published: Thursday, November 5, 2026, 6:07 [IST]
Desktop Bottom Promotion