Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
దసరా నాటి రాశి ఫలాలు.. విజయదశమి నుంచి ఆ రాశి వారికి అన్నీ విజయాలే!
దసరా పండగ వచ్చేసింది. బోల్డ్ స్కై పాఠకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ విజయదశమి నాడు ఎవరి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ రాశి వారికి ఈ విజయదశమి కలిసి వస్తుంది చూద్దాం. రాశి ఫలాలు తెలుసుకునే ముందు.. ఈ రోజు శుభ ముహూర్తాల గురించి తెలుసుకుందాం.
విజయదశమి నాటి శుభఘడియలు
వర్జ్యం: ఉ. 6-51 వరకు తిరిగి తె. 4-35 నుంచి
అమృత ఘడియలు: మ. 2-38 నుంచి 4-11 వరకు
దుర్ముహూర్తం: ఉ. 5-55 నుంచి 7-28 వరకు
రాహుకాలం: ఉ. 9-00 నుంచి 10-30 వరకు
రాశి ఫలాలు

మేషరాశి: ఈ విజయదశమి నాడు మేష రాశి వారు మంచి ఆలోచన విధానంతో మెలుగుతారు. తద్వారా వారు అనుకున్నది సాధిస్తారు. సరికొత్త నూతన కార్యక్రమాలు చేపడతారు. మేషరాశి వారు చేపట్టే కార్యక్రమాలతో వారి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అనూహ్యంగా ధనలాభం పొందుతారు. లక్ష్మీదేవిని ఆరాధిస్తే అంతా శుభమే జరుగుతుంది.
వృషభరాశి: సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధు మిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు, భవిష్యత్తుపై ప్రణాళిక వేసుకుంటారు. కొన్ని కొన్ని వ్యవహారాల్లో ఆచూతూచి వ్యవహరించాలి. వృషభరాశి వారు హనుమాన్ చాలీసా పఠిస్తే శుభం కలుగుతుంది
మిథున రాశి: విజయదశమి నాడు మిథున రాశివారు ప్రారంభించిన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కొన్ని అనారోగ్య సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తాయి. దగ్గరగా ఉండే కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. ఇలాంటి సమయాల్లో కోపాన్ని తగ్గించుకుంటే ఉత్తమంగా ఉంటుంది. గోసేవ చేస్తే ప్రయోజనం లభిస్తుంది.
కర్కాటక రాశి: ఈ రాశి వారిని, వారి ఆత్మవిశ్వాసమే ముందుకు నడిపిస్తుంది. పండగ పూట తలపెట్టే నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఒక మంచి శుభవార్త, మీ మనోబలాన్ని పెంచుతుంది. మీరు నడిచే స్వధర్మమే మీకు రక్షణగా నిలుస్తుంది. శ్రీలక్ష్మీ దేవి సందర్శనం మీకు రక్ష.
సింహా రాశి: మీ పనితీరుతో సమాజంలోని వ్యక్తులను ఆకట్టుకుంటారు. మీకు తలపెట్టిన కొన్ని కీలక అంశాల్లో, మీరు అనుకున్న విధంగానే ఫలితాలను పొందుతారు. అభివృద్ధికి సంబంధించిన ఒక కీలకమైన శుభవార్త మీరు వింటారు. శ్రీసుబ్రహ్మణ్య భుజంగ స్తవం పఠిస్తే మంచిది.
కన్యారాశి: ఈ రాశి వారు తాము అనుకున్న పైనిపై పట్టు విడవకుండా, ఆ పనిని పూర్తి చేస్తారు. అనవసరంగా కష్టాలు కొని తెచ్చుకుంటారు. కొన్ని కొన్ని పరిస్థితులు మనోవిచారాన్ని కలిగిస్తాయి. హనుమాన్ చాలీసా చదివితే మంచి ఫలితాలు కలుగుతాయి.
తులారాశి: ఈ రాశి వారికి మిశ్రమ కాలం నడుస్తోంది. తాము అనుకున్న పని పూర్తి అవ్వాలంటే, ఉత్సాహంగా పని చేయాలి. ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశముంది. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అనుకూల ఫలితాలనిస్తుంది.
వృచ్చిక రాశి: మీరు అనుకున్న పనిలో సంతృప్తికర ఫలితాలు రాబట్టేందుకు ఇది సరైన సమయం. మీరు మానసికంగా ధృడంగా ఉండడంతో.. మీరు ప్రారంభించిన పనిలో అభివృద్ధి కనిపిస్తుంది. సౌభాగ్యసిద్ధి కలుగుతుంది. ఇష్ట దేవతారాధన చేయండి
ధనస్సు రాశి: ఈ రాశివారికి నేడు శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవసరానికి సహాయం చేసే వారు ఉంటారు. శ్రీఆంజనేయ స్తోత్రం పారాయణ శుభప్రదం
మకర రాశి: ఈ విజయదశమి నాడు మకర రాశివారు శత్రువులపై నైతికంగా విజయం సాధిస్తారు. ప్రారంభించిన కార్యక్రమాలన్నిటినీ పూర్తి చేస్తారు. ఒక శుభవార్త ఇంటిల్లిపాది ఆనందాన్ని నింపుతుంది. శనిధ్యానం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు.
కుంభరాశి: శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. మరీ ముఖ్యానంగా మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరిగా చేయాలి. ద్వాదశ చంద్ర సంచారం అనుకూలంగా లేకపోవడంతో.. ఆరోగ్యం సరిగ్గా ఉండే అవకాశం లేదు. శ్రీవిష్ణును ఆరాధించడం ఉత్తమం.
మీనం: ఈ రాశివారికి ఈ విజయదశమి నాడు ధన, ధాన్య లాభాలు ఉన్నాయి. పెద్దలు సూచించిన మార్గాల్లో ముందుకు సాగి మంచి ఫలితాలను సాధిస్తారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. సమయానుకూలంగా ముందుకు సాగితే మంచిది. పండగ నాడు నూతన వస్తువులను సేకరిస్తారు. హనుమత్ ఆరాధనా శుభప్రదం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications











