Latest Updates
-
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
ఈ రాశల వారిని డీల్ చేయడం కష్టం..! ఇందులో మీ రాశి వుందా..?
జ్యోతిష్యంలో మొత్తం 12 రాశులుటాయ్. ఒక్కో రాశిదీ ఒక్కో వ్యక్తిత్వం. అన్ని రాశుల వ్యక్తిత్వం ఒకేలా వుండదు. రాశులపై గ్రహాల ప్రభావం వుంటుంది. ఆ ప్రభావాన్ని బట్టి వ్యక్తిత్వం మారుతూ వుంటుంది. ఏ రాశివారికి ఎలాంటి వ్యక్తిత్వం వుంటుందో జ్యోతిష్య పండితులు ముందుగానే చెప్పివున్నారు. మొత్తం 12 రాశుల్లో ఐదు రాశులకు చెందిన వారు అత్యంత శక్తివంతులుగా జ్యోతిష్యం పేర్కొంది. వీరిని డీల్ చేయడం, ఎదుర్కోవడం చాలా కష్టం. వీరు ఏది అనుకుంటే అది జరగాల్సిందే. ఎన్ని అడ్డంకులను దాటైనా సరే వీరు అనుకున్నది సాధిస్తారు. ఆ ఐదు రాశులేంటో తెలుసుకుందాం.

మేషరాశి
మేషరాశికి కుజుడు అధిపతి, వీరి ఆలోచనలు గజిబిగా వుంటాయ్. ఈ విధంగా వుండడం వీరికి అదృష్టాన్ని కలిగిస్తుంది. బయటకు సున్నితంగానే కనిపిస్తారు గానీ లోపల అంతే కఠినంగా వుంటారు. ఏదైనా పనిని ప్రారంభిస్తే కచ్ఛితంగా పూర్తిచేస్తారు. గజిబిజిగా కాకుండా మానసిక స్థిరత్వాన్ని సాధిస్తే ఇంకా బాగా రాణిస్తారు. వీరికి కుజుడు అధిపతి కాబట్టి ఆవేశం కూడా ఎక్కువగానే వుంటుంది.
వృషభరాశి
వీరి ఆలోచన విధానం ఎప్పుడూ ఒకే విధంగా వుంటుంది. చంచలమైన మనస్తత్వం వుండదు. ఏది అనుకుంటే అది చేయడానికి సిద్ధపడతారు. ఇతరుల కోసం వీరు ఎట్టిపరిస్తితుల్లో మారరు. సమయానికి పోటీపడి పనిచేస్తే వీరికి మించిన వారు వుండరని చెప్పుకోవచ్చు. వృషభం చాలా శక్తివంతమైనప్పటికీ చాలా సార్లు మోసపోవడం జరుగుతుంది. వీరి ఎవరినైనా ఒకసారి నమ్మకుండా వుంటే ఇక జీవితాంతం వారిని నమ్మరు. ఇలా వుండడం వల్లే వారు జీవితంలో మోసపోకుండా అనుకున్నది సాధిస్తారు.

సింహరాశి
సింహమంటే మృగరాజు, వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా వుంటాయ్. వీరు చెప్పిన విధంగానే ఇతరులు వినాలనే తత్వాన్ని కలిగి వుంటారు. దూసుకెళ్లే లక్షణం, ఎవ్వరినీ లెక్కచేయకపోవడం, ఈ లక్షణాలే వీరిని విజేతలుగా నిలబెడతాయ్. మంచి పనులవైపు వీరు దృష్టి పెడితే వీరిని మించిన మంచి నాయకులు వుండరు. సింహం వేటకు ముందు ఎంత నిశ్శబ్దంగా వుంటుందో వీరు కూడా ఏదైనా పనిని ప్రారంభించే ముందు చాలా నిశ్శబ్దంగా వుంటారు. వీరిలో గెలవాలనే తపన చాలా ఎక్కువగా వుంటుంది. వీరు అనుకున్నది సాధించి చూపిస్తారు.
వృశ్చిక రాశి
ఈ రాశికి చెందిన వారు చాలా ప్రమాదకరంగా వుంటారు. తేలు ఎంత ప్రమాదకరంగా వుంటుందో వృశ్చిక రాశి వారు కూడా అంతే ప్రమాదకరంగా వుంటారు. తెలీకుండా పనులన్నీ చేసి ఏమీ తెలియనట్టుగా వుంటారు. అసలు విషయాలను దాచిపెట్టి బయట మాత్రం అనవసర విషయాలను దాచిపెడతారు. వీరిని సాధారణంగా అందరూ అమాయకులుగా అనుకుంటూ వుంటారు. వీరు నిజాయితీగా వుంటారు కానీ తేడా వస్తే వీరంత కుటిలత్వం ఎవ్వరికీ వుండదు. ఎదుటివారిని మాటలతో పడేస్తారు. అరచేతిలో స్వర్గాన్ని చూపుతారు. వీరి తెలివిని అనవసర పనులకు కాకుండా అవసరమైన పనులకు ఉపయోగిస్తే వీరు జీవితంలో చాలా అభివృద్ధిని సాధిస్తారు.
కుంభ రాశి
కుంభ రాశి వారు చూడటానికి చాలా అమయకంగా కనిపిస్తారు. ఎలా బ్రతుకుతారోనని అనిపిస్తుంది. వీరికి రాహువు అధిపతి వుండడం వల్ల కుండలో పాములాంటి వ్యక్తిత్వాన్ని కలిగి వుంటారు. వీరితో డీల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వుండాలి. వీరిని స్నేహమంటే, బంధాలు, బంధుత్వాలంటే చాలా ఇష్టం. వీరికి ఏ చిన్న సహాయం చేసినా జీవితాంతం గుర్తుపెట్టుకుంటూ వుంటారు. ఫ్రెండ్‌షిప్‌ను ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడరు. వీరికి స్నేహితులు గనుక వుంటే వారిని చాలా అభినందిస్తారు.
పైరాశుల్లో కొన్ని ప్రతికూల లక్షణాలు వున్నాయ్. వాటిని సరిచేసుకుంటే వారు అనుకున్నది జీవితంలో సాధించుకోవచ్చు.
గమనిక : పైన ఇచ్చిన వివరాలన్నీ ప్రముఖ జ్యోతిష్యులు, పండితుల నుంచి సేకరించింది. వీటిని మేము ఎట్టి పరిస్థితుల్లో దృవీకరించము.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
