Latest Updates
-
అన్నం, చపాతీల్లోకి పర్ఫెక్ట్.. సొరకాయ కోఫ్తా కర్రీ ఇలా చేశారంటే కేక టేస్ట్! -
చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఉసిరి జామ్..మీ ఇంట్లోనే సింపుల్ గా చేసుకోండిలా.. -
హెల్తీగా ఉంటాం, బరువు తగ్గొచ్చని ఓట్స్ తింటున్నారా? ఈ విషయం తెలియకుంటే డేంజర్ లో పడతారు! -
ఐరన్, విటమిన్స్ నిండిన మునగాకు గోధుమ దోసె..బరువు తగ్గాలనుకునేటోళ్లకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ -
ఫోన్ పగలగొట్టాడని తండ్రిని దారుణంగా చంపిన కూతురు! -
కాలిఫ్లవర్ తో ఇలా చేస్తే పకోడీ కూడా పనికిరాదు.. టేస్ట్ అదుర్స్! -
నడుము నొప్పితో విసిగిపోయారా? మీ వెన్నెముకను ఉక్కులా మార్చేసే చిట్కా ఇదే! -
కార్తీక మాసం స్పెషల్ ఉసిరికాయ పులిహోర..చాలా కమ్మని రుచిగా చేసుకోండిలా.. -
ఎముకలు బలంగా అవ్వడానికి,బాడీలో రక్తం పట్టాలంటే ఈ స్వీట్ తినండి..చేయడం చాలా సింపుల్.. -
నెయ్యి గురించి చాలామందికి తెలియని నిజం ఇదే..
జామ ఆకుల టీని రోజుకు ఒక్క కప్పు తాగితే చాలు.. ఈ 4 భయంకరమైన ఆరోగ్య సమస్యలు మాయం!
మారిపోతున్న జీవనశైలి, ఆహార అలవాట్ల కారణగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా షుగర్, బీపీ, అధిక బరువు, జీర్ణ సంబంధిత సమస్యలు ప్రతీ ఇంట్లో కామన్ అయిపోయాయి. అయితే వీటన్నింటికి జామ ఆకులు బెస్ట్ మెడిసిన్ అని ఆయుర్వేదం చెబుతోంది.
కొన్నేళ్ల క్రితం జామ కాయలతో పాటు వాటి ఆకులను కూడా అందరూ ఇష్టంగా తినేవాళ్లు..కొందరు అయితే జామ ఆకుల్లో చింతపండు పెట్టుకుని మరీ తినేవాళ్లు. ఇదిలాఉంటే, జామ ఆకులతో అద్భుతమైన టీ తయారుచేసుకోవచ్చని మీకు తెలుసా? ఇది ఆరోగ్యానికి అందించే ప్రయోజనాలు అంతా ఇంతా కాదండోయ్..ఇదొక మ్యాజిక్ డ్రింక్ అని చెప్పొచ్చు.

జామ ఆకుల టీతో కలిగే ప్రయోజనాలివే
బ్లడ్ షుగర్ కంట్రోల్
జామ ఆకుల టీ తాగడం వల్ల భోజనం చేసిన తర్వాత రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ ఆకస్మికంగా పెరగవు. ఇన్సులిన్ ఉత్పత్తిని, కార్బోహైడ్రేట్ల శోషణనూ క్రమబద్ధీకరించి, టైప్-2 డయాబెటిస్ బాధితులకు మంచి ఉపశమనం ఇస్తుంది.
సులభంగా బరువు తగ్గేందుకు
శరీరం సంక్లిష్ట పిండిపదార్థాలను(complex carbohydrates) చక్కెరలుగా మార్చకుండా ఈ టీ నిరోధిస్తుంది. ఇది మెటబాలిజాన్ని వేగవంతం చేసి, పొట్ట చుట్టూ పేరుకుపోయే మొండి కొవ్వును కరిగిస్తుంది.
మెరుగైన జీర్ణవ్యవస్థ
జామ ఆకుల్లోని యాంటీ బాక్టీరియల్ గుణాలు కడుపులోని హానికర బ్యాక్టీరియాను అంతం చేస్తాయి. గ్యాస్, అజీర్తి, మలబద్ధకం, విరేచనాలు వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.

గుండె ఆరోగ్యం
ఇది చెడు కొలెస్ట్రాల్ (LDL), ట్రైగ్లిజరైడ్లను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. రక్తప్రసరణను మెరుగుపరిచి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
జామ ఆకుల టీ తయారీ విధానం
-ముందుగా జామ ఆకులను నీటితో శుభ్రంగా కడగాలి. తర్వాత ఒక పాత్రలో గ్లాసు నీటిని మరిగించి, అందులో ఈ ఆకులను వేయాలి.
-నీరు లేత ఆకుపచ్చ లేదా పసుపు రంగులోకి మారే వరకు 8-10 నిమిషాలు చిన్న మంటపై మరిగించాలి. తర్వాత టీని వడకట్టి, గోరువెచ్చగా ఉన్నప్పుడు రుచి కోసం నిమ్మరసం లేదా తేనె కలుపుకుని తాగవచ్చు.
ఎప్పుడు, ఎలా తీసుకోవాలి?
గరిష్ట ప్రయోజనాల కోసం ఈ టీని రోజుకు 1-2 కప్పులు మాత్రమే తీసుకోవాలి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం బెస్ట్. రక్తంలో చక్కెర స్థాయిలు, బరువును వేగంగా అదుపులోకి తెచ్చుకోవాలనుకునే వారు మధ్యాహ్నం లేదా రాత్రి భోజనం చేసిన 30 నిమిషాల తర్వాత కూడా జామ ఆకు టీ తాగొచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
