Latest Updates
-
బంగాళదుంపతో ఇలా దోశ వేస్తే రుచికి ఫిదా అవ్వాల్సిందే.. తయారీ విధానం ఇదే.. -
మీ జీర్ణవ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందనడానికి 10 సంకేతాలివే -
అతిథులను ఆశ్చర్యపరిచే అద్భుతమైన దీపావళి స్వీట్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా? మందులు లేకుండా ఈ 3 సింపుల్ టిప్స్ తో చెక్ పెట్టండి! -
బ్రెడ్ లేకుండా బ్రెడ్ పకోడీ చేయడం ఎలా? టేస్ట్ చూస్తే వావ్ అనాల్సిందే.. -
బంగారు నగరమైన శ్రీలంకకు రావణాసురుడు రాజు ఎలా అయ్యాడో తెలుసా? -
మగాళ్లలో వంధ్యత్వానికి కారణం అండర్ వేర్ ఏనా? డాక్టర్ చెప్పిన షాకింగ్ నిజం! -
దీపావళికి స్పెషల్ స్వీట్.. కేవలం వేరుశెనగలతో నోట్లో వెన్నలా కరిగిపోయే పీనట్ హల్వా చేసుకోండిలా.. -
జీర్ణక్రియను మెరుగుపరిచే.. ఇడ్లీ, దోశలోకి అదిరిపోయే కొబ్బరి అల్లం చట్నీ చేసుకోండిలా.. -
Dhanteras 2026: ధనత్రయోదశి రోజు ఏ ముహూర్తంలో బంగారం కొనాలి? పూజా విధానం పూర్తి వివరాలు
Dhanurmasam: 4 రాశులపై ధనుర్మాసం ఎఫెక్ట్..పని ప్రదేశంలో సహాయ నిరాకరణ,అడ్డంకులు
తెలుగు క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ 16 నుంచి అంటే ఈ రోజు నుంచి ధనుర్మాసం(dhanurmasam) స్టార్ట్ అయింది. జనవరి 14,2025న ధనుర్మాసం ముగుస్తుంది. ధనుర్మాసంని శూన్య మాసం అని కూడా పిలుస్తారు. ధనుర్మాసం జ్ఞానం, ఆధ్యాత్మిక పురోగతికి ఒక ప్రత్యేక మాసంగా పరిగణించబడుతుంది. ఈ మాసంలో స్వచ్ఛత, ధ్యానానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. మానసిక, ఆధ్యాత్మిక పురోగతి కోసం ఈ మాసంలో పండుగలు, వైదిక కార్యక్రమాలకు దూరంగా ఉండటం సముచితంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో వివాహం, ఇంటి నిర్మాణం, వ్యాపారం ప్రారంభించడం వంటి శుభకార్యాలకు దూరంగా ఉండటం మంచిదని పండితులు సూచిస్తున్నారు.
ధనుస్సు రాశిలోని వివిధ గ్రహాలు, రాశుల కలయిక కొన్ని రాశులపై విభిన్న ప్రభావాలను చూపుతుందని పండితులు తెలిపారు. అయితే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం రాశులపై ధనుర్మాసం ప్రభావం ఎలా ఉంటదో ఇప్పుడు చూద్దాం.

మేషం
ఈ రాశి వాళ్లు ధనుర్మాస కాలంలో పని ప్రదేశంలో సహాయనిరాకరణ,అడ్డంకులను ఎదుర్కోవలసి రావచ్చు. ఏకాగ్రతతో ఉండటం చాలా ముఖ్యం. మీ తండ్రికి సేవ చేయండి. కృషి, అంకితభావం ఆధారంగా మీరు ఇల్లు, ఉద్యోగానికి సంబంధించిన విషయాలలో ప్రయోజనాలను పొందుతారు.
వృషభం
ఈ సమయం వృషభ రాశి వారికి ఆకస్మిక సమస్యలు తలెత్తవచ్చు. కుటుంబ సభ్యుల ఆరోగ్యంలో ఒడిదుడుకులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడవచ్చు కానీ ఖర్చులు, ఆర్థిక నిర్వహణపై శ్రద్ధ వహించడం ముఖ్యం. ఈ మాసంలో ప్రత్యేకంగా హనుమంతుడిని పూజించండి. వస్తుపరమైన లాభాలు ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడవచ్చు, అయితే ఖర్చులు మరియు ఆర్థిక నిర్వహణపై శ్రద్ధ వహించడం ముఖ్యం.
మిథునం
ధనుర్మాసంలో మిథునరాశి వారికి వివాదాలు,టెన్షన్లు పెరగవచ్చు. కానీ ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి జీవిత భాగస్వామి నుండి సపోర్ట్ లభిస్తుంది. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడే ముందు వందసార్లు ఆలోచించండి. గణేశుడిని పూజించండి.
కర్కాటకం
కర్కాటక రాశి వాళ్లు ధనుర్మాసంలో ప్రేమ, కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ వహించాలి. ఈ సమయం మానసిక సంతృప్తికి అద్భుతమైనది. ఉద్యోగం,ఆరోగ్య సమస్యలపై దృష్టి పెట్టండి. కుటుంబంలో శాంతి, సామరస్యాన్ని తీసుకురావడానికి ఇది మంచి ఛాన్స్.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
