Dhanteras 2026: ధనత్రయోదశి రోజు ఏ ముహూర్తంలో బంగారం కొనాలి? పూజా విధానం పూర్తి వివరాలు

హిందూ సంప్రదాయంలో ధనత్రయోదశి లేదా ధంతేరస్ అనేది అత్యంత ముఖ్యమైన పండుగ. ఇది దీపావళి 5 రోజుల వేడుకల్లో మొదటిది. ధన్ అంటే ధనం, తేరస్ అంటే త్రయోదశి అని అర్థం. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కృష్ణ పక్ష త్రయోదశి నాడు ధనత్రయోదశి పండగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈ ఏడాది నవంబర్ 6 అంటే ఇవాళ దనత్రయోదశి జరుపుకుంటారు. ఈ రోజున లక్ష్మీదేవి, కుబేరుడు, గణపతితో పాటు ఆరోగ్య ప్రదాత అయిన ధన్వంతరి స్వామిని ఆరాధిస్తారు.

సాగర మథనం టైంలో అమృత కలశంతో ఆయుర్వేద వైద్యుడు, ఆరోగ్యానికి దైవమైన ధన్వంతరి భగవానుడు ఇవాళే ఉద్భవించాడు. కాబట్టి ఇవాళ ఆయనను పూజిస్తారు. ధంతేరస్ నాడు భక్తిశ్రద్ధలతో పూజలు చేయడం వల్ల ఇంట అష్టఐశ్వర్యాలు, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు. ఇవాళ బంగారం కూడా ఎక్కువమంది కొంటారు.కనీసం చిన్న ముక్కు పుడకంత బంగారం అయినా కొనడాకి ఆశక్తి చూపుతారు. దీనికి కారణం ఇవాళ కొత్తవస్తువులు, బంగారం, వెండి కొనులు చేస్తే ఏడాది మొత్తం ఇంట్లో సుఖసంతోషాలు, అదృష్టం, ఐశ్వర్యం ఉంటాయన్న నమ్మకం.

Dhanteras 2026 Puja Muhurat Gold Shopping Timings and Rituals for Dhanatrayodashi

ధనత్రయోదశి పూజకు అనుకూలమైన శుభ ముహూర్తాలు

త్రయోదశి తిథి ప్రారంభం: నవంబర్ 6, ఉదయం 10:30 గంటలకు

త్రయోదశి తిథి సమాప్తి: నవంబర్ 7, ఉదయం 10:47 గంటలకు

బ్రహ్మ ముహూర్తం: ఉదయం 4:53 నుండి 5:45 వరకు

ధంతేరస్ పూజ సమయం: ఉదయం 6:02 నుండి సాయంత్రం 7:57 వరకు

ప్రదోష కాల పూజ ముహూర్తం: సాయంత్రం 5:33 నుండి రాత్రి 8:09 వరకు

2027లో బంగారం ధర ఎంత ఉంటదో తెలుసా? బాబా వంగా సంచలన జోస్యం!2027లో బంగారం ధర ఎంత ఉంటదో తెలుసా? బాబా వంగా సంచలన జోస్యం!

లక్ష్మీ కటాక్షం కోసం షాపింగ్ ముహూర్తాలు

ధంతేరస్ రోజున బంగారం, వెండి, కొత్త పాత్రలు లేదా లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన వస్తువులు కొనడం ఎంతో శుభప్రదం.

ఉదయం శుభ సమయం: నవంబర్ 6 ఉదయం 10:30 నుండి నవంబర్ 7 ఉదయం 10:43 వరకు

మధ్యాహ్న ముహూర్తం: మధ్యాహ్నం 12:05 నుండి 1:27 వరకు

సాయం ముహూర్తం : సాయంత్రం 4:11 నుండి 5:33 వరకు

రాత్రి ముహూర్తం: రాత్రి 8:49 నుండి 10:27 వరకు

ధంతేరస్ నిష్ఠతో కూడిన పూజా విధానం

శుభ్రత, అలంకరణ: సాయంత్రం ప్రదోష కాలానికి ముందే పూజా మందిరాన్ని లేదా ఈశాన్య మూలను పరిమళ ద్రవ్యాలతో శుభ్రం చేసుకోవాలి.

మండప స్థాపన: స్నానానంతరం పూజ పీఠంపై ఎర్రటి పట్టు వస్త్రాన్ని పరిచి, లక్ష్మీదేవి, గణపతి, కుబేరుడు మరియు ధన్వంతరి స్వామి విగ్రహాలను లేదా చిత్రపటాలను ప్రతిష్టించాలి.

దీపారాధన, యమ దీపం: దీపాలు, ధూపం వెలిగించాలి. కుటుంబంలో అపమృత్యు భయాలు తొలగిపోవడానికి నాలుగు ముఖాల దివ్వెతో యమ దీపం వెలిగించి సింహద్వారం దగ్గర ఉంచాలి.

షోడశోపచార పూజ: దేవుళ్లకు కుంకుమ, అక్షతలు, సువాసనగల పుష్పాలు సమర్పించాలి. పాయసం, మిఠాయిలు లేదా పండ్లను నైవేద్యంగా నివేదించాలి.

మంత్రజపం,హారతి: ధనకర్షణ మంత్రాలు, ధన్వంతరి స్తోత్రాలు పఠించి, వ్రత కథను చెప్పుకోవాలి. చివరగా మంగళహారతి ఇచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించాలి.

Desktop Bottom Promotion