Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
2025లో మొట్టమొదటి రాజయోగం.. జనవరి 9 నుంచి ఈ రాశుల వారి జీవితం మారిపోతుంది! ధనవంతులు అయిపోతారు!
వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, నవగ్రహాలు తమ తమ రాశులను మార్చుకుంటూ ఉంటాయి. దీని కారణంగా పలు యోగాలు ఏర్పడడంతో పాటు పలు రాశుల వారికి మంచి శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. నవ గ్రహాలలో చంద్రుడు అత్యంత వేగంగా కదిలే గ్రహంగా చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి చంద్రుడు వేరే గ్రహాలతో కలిసినప్పుడు కొన్ని యోగాలను ఏర్పరుస్తాడు. అందులో భాగంగానే చంద్రుడు గురువుతో కలిసినపుడు ఏర్పడే యోగం గజగేసరి రాజయోగం. ఈ రాజయోగం చాలా శక్తివంతమైనది. ఈ రాజయోగం జనవరి 09, 2025న ఏర్పడుతుంది.
2025లో మొట్టమొదటిసారిగా ఏర్పడనున్న శక్తివంతమైన యోగంతో పాటు అత్యంత శుభప్రదమైన యోగం కావడంతో పలు రాశుల వారికి మంచి రోజులు రాబోతున్నాయి. వారి జీవితం మారిపోబోతుంది. ఆర్ధిక కస్టాలు తొలిగిపోతాయి. ఆ రాశులు ఏంటి? వారికి ఏ విధమైన ఫలితాలు వస్తాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వృషభం
వృషభ రాశి వారికి ఆ రాశి మొదటి స్థానంలో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా ఈ రాశుల వారు అన్ని రంగాలలో మంచి విజయాన్ని పొందుతారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు. లక్ష్మీ దేవి ఆశీస్సులతో అదృష్టానికి దగ్గరి బంధువు అవుతారు. అలాగే తమ జీవితంలోని అన్ని సమస్యలకు ముగింపు పలుకుతుంది. ఉద్యోగస్తులకు కూడా మంచి రోజులు రాబోతున్నాయి. వారికి వారి కార్యాలయంలోని ఉన్నతాధికారుల నుంచి పూర్తి స్థాయి మద్దతు లభ్సితుంది. వ్యాపారంలో మంచి పురోగతి కనిపిస్తుంది. ఊహించని విధంగా ఆర్ధిక లాభాలు వస్తాయి. డబ్బును ఆదా చేసేందుకు ప్రయత్నిస్తారు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఆరవ స్థానంలో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. అందువలన ఈ రాశికి చెందిన వారు వారసత్వంగా వచ్చిన ఆస్తుల నుండి మంచి లాభాలను పొందుతారు. పని మీద పూర్తి శ్రద్ధ పెట్టగలుగుతారు. అలాగే తమ తమ పనిలో మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు ఈ గజకేసరి రాజయోగం సహాయపడుతుంది. వ్యాపారులు తమ ప్రాజెక్టుల నుండి మంచి ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.
కుంభ రాశి
కుంభ రాశి వారికి నాలుగో స్థానంలో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. అందువలన ఈ రాశుల వారికి భారీగా అదృష్టం పట్టుకోనుంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రతి పనిని ఈ రాశికి చెందిన వారు విజయవంతంగా పూర్తి చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనం పెరుగుతుంది. ఆరోగ్యం కూడా బాగుటుంది. అలాగే కుటుంబంలో సంతోషాలు నెలకొంటాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications