Latest Updates
-
స్వీట్, హాట్ తినాలనే కోరికలు విపరీతంగా ఉన్నాయా.. మీ బాడీలో ఈ లోపాలే కారణం.! -
శని దేవుని అభయహస్తం: జూన్ 2027 వరకు ఈ 3 రాశులకు రాజయోగం.. మీరున్నారా ఇందులో? -
కాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలం..రోజకి ఇది 1 తింటే చాలు కొండలను ఢీకొట్టే శక్తి! -
గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే! -
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు! -
మీటింగ్లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.! -
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.! -
భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.. పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.! -
ఈ ప్రత్యేక మసాలాతో దిండిగల్ వెజ్ బిర్యానీ చేశారంటే..ప్రతి మెతుకు అమృతమే..మిగతావన్నీ మర్చిపోతారు! -
కళ్లకి కాటుక ఎలా పెట్టుకుంటున్నారు.?.. ఇలా అప్లై చేశారంటే కంటి కింద కురుపులు తప్పవు.!
మీ రాశి ప్రకారం ఏ రకమైన తిలకం పెట్టుకోవాలి? ఇలా చేస్తే శని, రాహు దోషాల ప్రభావం తగ్గిపోతుంది!
మనదేశంలో చాలామంది హిందువులు రోజూ నుదిటిపై తిలకం పెట్టుకుండటం మనం గమనించవచ్చు. భారతీయ సంస్కృతిలో తిలకానికి విశిష్ఠ స్థానం ఉంది. నుదిటిపై ధరించే ఈ చిన్న గుర్తు కేవలం అలంకరణ మాత్రమే కాదు.. మన సంస్కృతి, సంప్రదాయాలకు, విశ్వాసాలకు ప్రతీక. హిందూమత విశ్వాసాల ప్రకారం ప్రతిరోజూ నుదిటిపై తిలకం పెట్టుకోవడం శుభప్రదంగా భావిస్తారు. నిత్యం సాధ్యం కాకపోయినా పూజ చేసే సమయంలో లేదా ఏదైనా టెంపుల్ కి వెళ్లినప్పుడు తిలకం పెట్టుకోవడం ఆనవాయితీ. ఇలా చేయడం వల్ల జీవితంలో శుభాలు కలుగుతాయని, పాజిటివ్ ఎనర్జీ వస్తుందరి నమ్ముతారు.
తిలకం ప్రాముఖ్యత గురించి జ్యోతిష్యశాస్త్రంలో కూడా చెప్పబడింది. నుదిటిపై తిలకం పెట్టుకోవడం వల్ల మనోశాంతి, విజయం, అభివృద్ధి లభిస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతారు. అయితే రాశి ప్రకారం తిలకం పెట్టుకోవడం వల్ల దాని ప్రయోజనాలు మరింతగా పెరుగుతాయని జ్యోతిష్య నిపుణుల చెబుతున్నారు. ఒక్కో రాశికి ఒక్కో రకమైన తిలకం అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. రాశి ప్రకాకరం తగిన తిలకం పెట్టుకోవడం వల్ల ఆ రాశి రానిని పాలించే గ్రహం బలపడుతుంది. దీని ఫలితంగా వ్యక్తికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. శని, రాహువు వంటి అశుభ గ్రహాల ప్రభావం కూడా తగ్గుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కాబట్టి మీ రాశి ఏ తిలకం పెట్టుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం.

మేషం
ధైర్యం, పోరాట పటిమకు చిహ్నమైన మేష రాశికి అధిపతి కుజుడు. కుజుడికి ఇష్టమైన రంగు ఎరుపు కాబట్టి మేష రాశి వ్యక్తులు ఎర్ర చందనంతో చేసిన తిలకం లేదా కుంకుమ పెట్టుకోవడం అత్యంత శుభప్రదం. ఇలా చేయడం వల్ల చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది. మీలో నూతన శక్తి నిండుతుంది, ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.
వృషభ రాశి
భోగభాగ్యాలకు, సౌందర్యానికి అధిపతి అయిన శుక్రుడు వృషభ రాశిని పాలిస్తాడు. శుక్రుడికి ఇష్టమైన రంగు తెలుపు కాబట్టి వృషభ రాశి వారు తెల్లని గంధంతో చేసిన తిలకం ధరించడం చాలా మంచిది. ఇది మీ జీవితంలో శాంతిని, సౌఖ్యాన్ని కలిగిస్తుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
మిథున రాశి
బుద్ధికి,వివేకానికి కారకుడైన బుధుడు మిథున రాశికి అధిపతి కాబట్టి ఈ రాశి వ్యక్తులు అష్టగంధంతో చేసిన తిలకం ధరించడం శ్రేయస్కరం. అష్టగంధం అనేక రకాల సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో తయారుచేస్తారు. ఇది జ్ఞానాన్ని,తెలివిని పెంపొందిస్తుంది.
కర్కాటక రాశి
మనసుకు, భావోద్వేగాలకు అధిపతి అయిన చంద్రుడు కర్కాటక రాశిని పాలిస్తాడు. చంద్రుడికి ఇష్టమైన రంగు తెలుపు కాబట్టి ఈ రాశి వ్యక్తులు తెల్లని గంధపు తిలకం ధరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది..మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి.
సింహ రాశి
తేజస్సు, ఆత్మవిశ్వాసానికి ప్రతీక అయిన సూర్యుడు సింహ రాశికి అధిపతి. సూర్యుడికి ఇష్టమైన రంగు ఎరుపు కాబట్టి ఈ రాశి వ్యక్తులు ఎరుపు రంగు తిలకం..ముఖ్యంగా ఎర్ర చందనం లేదా కుంకుమ తిలకం ధరించడం చాలా మంచిది. ఇది మీలో శక్తిని,ఉత్సాహాన్ని నింపుతుంది.
కన్య రాశి
విశ్లేషణ, పరిపూర్ణతకు ప్రాధాన్యతనిచ్చే కన్య రాశికి బుధుడు అధిపతి. ఈ రాశి వ్యక్తులు నుదుటిపై ఎర్ర చందనంతో చేసిన తిలకం ధరించడం ఆర్థికంగా కలిసి వస్తుంది. మీ విశ్లేషణాత్మక సామర్థ్యాలు మెరుగుపడతాయి.
తుల రాశి
సమతుల్యత,న్యాయానికి ప్రాధాన్యతనిచ్చే తులారాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడికి ఇష్టమైన రంగు తెలుపు. ఈ రాశి వ్యక్తులు తెల్లని గంధపు తిలకం ధరించడం వల్ల జీవితంలో సామరస్యం నెలకొంటుంది. సంబంధాలు మెరుగుపడతాయి.
వృశ్చిక రాశి
తీవ్రమైన స్వభావానికి, రహస్యాలను ఛేదించే శక్తికి ప్రతీక అయిన వృశ్చిక రాశికి కుజుడు అధిపతి. ఈ రాశి వ్యక్తులు ఎర్రటి కుంకుమ తిలకం ధరించడం చాలా శక్తివంతమైనది. ఇది మీలో ధైర్యాన్ని, సంకల్ప బలాన్ని పెంచుతుంది.
ధనుస్సు రాశి
జ్ఞానానికి,అదృష్టానికి కారకుడైన బృహస్పతి ధనుస్సు రాశిని పాలిస్తాడు. బృహస్పతికి ఇష్టమైన రంగు పసుపు. ఈ రాశి వ్యక్తులు పసుపు గంధంతో చేసిన తిలకం లేదా పసుపు రంగు తిలకం ధరించడం చాలా శుభప్రదం. ఇది మీ జీవితంలో జ్ఞానాన్ని, అభివృద్ధిని కలిగిస్తుంది.
మకర రాశి
పట్టుదలకు, కష్టపడే తత్వానికి ప్రతీక అయిన మకర రాశికి అధిపతి శని. ఈ రాశి వ్యక్తులు బూడిద రంగు లేదా నలుపు రంగు తిలకం ధరించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మిమ్మల్ని ప్రతికూల శక్తుల నుండి కాపాడుతుంది.
కుంభ రాశి
విప్లవాత్మక ఆలోచనలకు, మానవతావాదానికి ప్రాధాన్యతనిచ్చే కుంభ రాశికి అధిపతి శని. ఈ రాశి వ్యక్తులు హవన భస్మంతో చేసిన తిలకం ధరించడం ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. దీంతో మీ ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
మీన రాశి
దయ,కరుణకు నిలయమైన మీన రాశికి అధిపతి బృహస్పతి. ఈ రాశి వ్యక్తులు పసుపు రంగు తిలకం ధరించడం చాలా మంచిది. ఇది మీ జీవితంలో సానుకూలతను, ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగిస్తుందని జ్యోతిష్య పండితులు తెలిపారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications