Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
అమావాస్య లోపు కన్యా రాశి వారి జీవితంలో కనకవర్షం.. కానీ ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి..!!
కన్య రాశి వారు దయాగుణం దానగుణము క్షమాగుణం కలిగి ఉంటారు. తెలివి తేటలు అధికంగా ఉంటాయి. కార్యదీక్ష కార్యదక్షతను కలిగి ఉంటారు. మంచి, చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన చేస్తారు. అపజయాలను చూసి కుంగిపోయే మనస్తత్వం కూడా వీరికి అస్సలు ఉండదు. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి విజయాన్ని సొంతం చేసుకుంటారు. అయితే కన్యరాశి వారికి ఈ సమయంలో ఫలితాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరికొన్ని ఆదాయ మార్గాలను పాటిస్తారు. దీని వల్ల మీకు ఆదాయం మరింత పెరుగుతుంది.

మీరు గతంలో డబ్బులు లేక చేయలేక ఆగిపోయిన పనులను కూడా పూర్తిచేస్తారు. తన సంపాదన పెరిగినప్పటికీ కూడా వృథాగా డబ్బు ఖర్చుచేయకుండా ఆర్థిక క్రమశిక్షణ పాటించడం అనేది చాలా అవసరం. ఈ సమయంలో మీకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇలా ఉన్నప్పటికీ కూడా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు వేధించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులకు ఈ సమయంలో పని ఒత్తిడి ఎక్కువవుతుంది. పై అధికారుల నుంచి ఒత్తిడి పెరగడం వల్ల మానసిక ఆందోళనకు గురవుతారు. మీ సహ ఉద్యోగుల సహకారంతో అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సమయానికి ఆహారం తీసుకోవడం యోగా వ్యాయామం, ధ్యానం చేయడం వల్ల మీరు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి మెడిటేషన్ చేయాలి. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. నూతనంగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారికి అనుభవజ్ఞుల సలహాలు తీసుకుని వాటిని పాటించడం వల్ల ఆర్థిక లాభాలు చేకూరుతాయి. ఈ సమయంలో వ్యాపారంలో పోటీని తట్టుకొని నిలబడితే మీ వ్యాపారాన్ని విస్తరించే అవకాశం కనిపిస్తోంది.
కళాకారులకు సినిమా మీడియా.లో పనిచేసే వారికి ఈ సమయంలో పని ఒత్తిడి అధికమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. కుటుంబ సౌఖ్యం కూడా కనిపిస్తోంది. అయితే కన్య రాశి వారి జీవితంలో ఈ సమయంలో జరగబోయే తొమ్మిది సంఘటనల గురించి తెలుసుకుందాం. మీరు ఎన్నో సంవత్సరాలుగా ఏ విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారో ఆ విషయంలో మీకు మంచి అవకాశాలు రాబోతున్నాయ్.ఆర్థిక పెరుగుదల కావచ్చు. లేదంటే వ్యాపారంలో కావచ్చు. అంటే కొత్త వ్యాపారం ప్రారంభించాలనే కోరిక కావచ్చు. విదేశీ ప్రయాణం కావచ్చు. దానికి సంబంధించి మీరు శుభవార్త వినబోతున్నారు. ఈ రాశి వారికి ఈ సమయంలో కొన్ని అంశాలలో మరికొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా స్త్రీలకు, పురుషులతో, పురుషులకు స్త్రీలతో కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు నలుగురిలో అవమానపడే పరిస్థితి కనిపిస్తుంది, కాబట్టి ఈ రాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ సమయంలో ఇటువంటి పరిస్థితులు అనేవి కనిపిస్తున్నాయి.
ఈ రాశి వారు మాట్లాడే ప్రతిమాట కూడా ఆచితూచి మాట్లాడటం మంచిది. మీ దగ్గర లేని వ్యక్తుల గురించి వేరే వారికి కూడా చెడుగా చెప్పడం వల్ల మీరు కష్టాలు కొనితెచ్చుకున్నవారవుతారు. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అలాగే మరొక సంఘటన ఏంటి అంటే ఈ రాశి వారు ఎన్నో రోజులుగా తమ పాత మిత్రులను కలవాలని ఎదురుచూస్తున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించక కలవలేకపోయారు. కానీ ఈ సమయంలో మీకు, పాత మిత్రులు కలిసే అవకాశం ఏర్పడుతుంది. వారితో ఎంతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. దీని వల్ల మీరు మానసిక ఆనందాన్ని పొందుతారు. ఈ రాశి వారు ఎంతో కాలంగా వివాహ సంబంధం కుదరక ఎదురుచూస్తున్న వారికి, ఎన్నో సంవత్సరాలుగా మంచి వివాహ సంబంధం కోసం ప్రయత్నాలు చేసే వారికి ఈ సమయంలో అనుకూలమైన సంబంధం కుదురుతుంది. మీరు ఎలాంటి వారైతే కావాలి అనుకుంటున్నారో.. అటువంటి సంబంధం కుదురుతుంది. వివాహానికి మరి కాస్త సమయం పట్టినప్పటికీ కూడా వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది. అంటే మీరు కోరుకునే లక్షణాలు ఉన్నటువంటి జీవిత భాగస్వామి మీ జీవితంలోకి రాబోతున్నారు.
ఈ రాశి వారి జీవితంలో జరగబోయే మరొక సంఘటన ఏంటంటే ఎవరైతే భార్యభర్తలు విడిపోదాం అనుకుంటున్నారో. వారు తిరిగి కలిసి తమ జీవితాన్ని కొనసాగించేందుకు ప్రయత్నాలు సాగిస్తారు. అంతేకాదు.. ఈ విషయంలో వివాహ బంధం మరింత బలపడుతుంది. ఎంతోకాలంగా విభేదాలతో విడిపోయిన భార్యభర్తలు బంధాన్ని కొనసాగిస్తారు. మీ మధ్య మళ్లీ ప్రేమ చిగురించే అవకాశం కనిపిస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వివాహ బంధం మళ్లీ తిరిగి ప్రారంభమవుతుంది. కానీ ఈ సమయంలో మీరిద్దరూ కూడా మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల మీ మధ్య ఉన్నటువంటి విభేదాలు అన్నీ తొలగిపోయి మీ బంధాన్ని కొనసాగిస్తారు. ఒకరి అభిప్రాయాన్ని ఒకరు గౌరవిస్తారు. దీని వల్ల మీ కుటుంబ సంబంధాలు బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ జీవితంలో ఊహించని సంఘటన జరగబోతోంది. అలాగే ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన, పాటించాల్సిన పరిహారాలు గురించి చూసుకున్నట్లయితే. ప్రతి సోమవారం శివుడికి అభిషేకం చేయించుకోండి. ఇలా చేయడానికి వీలుకాని వారు మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు ఓం నమశివాయ అని చదువుకోండి. ప్రతి శుక్రవారం కనకధారా స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల ఆర్థికంగా మరింత బలపడతారు. ప్రతి రోజు నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications