కన్యారాశి వారికి జులై 31 వరకు కనక వర్షం..!!

కన్యారాశి వారి దశ తిరగబోతోంది. జులై 31 లోపు వారి జీవితంలో భారీ మార్పులు జరగనున్నాయ్. వీరి జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉండబోతున్నారు. కానీ రెండు విషయాల్లో వీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. జులై 31లోపు ఈ రాశివారికి జరగబోయేది ఏంటి, ఏ ఫలితాలను వీరు పొందబోతున్నారో తెలుసుకుందాం. ఉన్నత స్థాయికి వెళ్లాలంటే ఏమి చేయాలి, దోశనివారణకు వీరు పాటించాల్సిన పరిహారమేంటో తెలుసుకుందాం.

Virgo zodiac sign people before July 31 2024

ఈ రాశివారు జులై 31లో వ్యాాపారంలో మంచి ఫలితాలను పొందున్నారు. అనుకోని విధంగా వీరికి వీరి వ్యాపారంలో లాభాలు వచ్చి పడతాయ్. కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ఇదే అనువైన సమయంగా అర్థం చేసుకోవచ్చు. పెట్టుబడులు చాలా సులభంగా పెట్టే పరిస్థితి ఉంటుంది. బ్యాంకుల నుంచి రుణాలను కూడా చాలా త్వరగా పొందుతారు. అయితే పెట్టుబడులు, భాగస్వామ్య వాపారం చేసే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలసిన అవసరం ఉంది. వీరి వ్యాపారం విదేశాలకు విస్తరించే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో చేసేవారికి మంచి ఫలితం ఉంటుంది. బంగారం వ్యాపారం చేసే వారికి కూడా మంచి లాభం చేకూరుతుంది.

ఉద్యోగపరంగా ఈ రాశివారికి పనిచేసే సంస్థ నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ సంస్థలో పై అధికారుల నుంచి మంచి మన్ననను పొందుతారు. ప్రభుత్వ రంగంలో పనిచేేసే వారు ఆశించిన రీతిలో ప్రమోషన్లను, బదిలీలను పొందుతారు. ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి ఉద్యోగం లభించనుంది. రాబోయే రోజుల్లో ఉద్యోగపరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా గతంలో ఆగిపోయిన పనులన్నింటినీ వీరు ప్రారంభించనున్నారు.

ఈ రాశివారికి జులై 31 లోపు విద్యాపరంగా కూడ చాలా బాగుంది. విద్యార్ధులు మంచి ఫలితాలను పొందబోతున్నారు. విద్యార్ధులపై ఈ సమయంలో సోషల్ మీడియా ప్రభావం అధికంగా ఉంటుంది. కాబట్టి వీరిని పెద్దలు, తల్లిదండ్రులు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజకీయ నాయకులకు ఈ సమయంలో కలిసివస్తుంది. వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయ్.

ఈ రాశివారు కుటుంబ పరంగా మంచి ఫలితాలను పొందనున్నారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోదాలకు, పుణ్యక్షేత్రాల్లో పాల్గొంటారు. ఈ రాశివారు ప్రేమ వ్యవహారాల వల్ల చిన్న చిన్న ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రేమ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి నుంచి వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా మంచి ఫలితాలను పొందుతారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారికి వివాహాలు జరుగుతాయ్. సంతానాన్ని పొందేవారికి సంతానం విషయంలో కొన్ని ఇభ్బందులను ఎదుర్కోంటారు. గర్భిణులు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఈ రాశివారికి జీవిత భాగస్వామి నుంచి స్థిరాస్థుల విషయంలో మంచి లాభాలను పొందనున్నారు. విదేశాల్లో వ్యాపారం చేస్తున్నవారికి ఊహించని విధంగా లాభం రానుంది. ఆరోగ్యం పరంగా మంచి ఫలితాలే ఉన్నాయ్ కానీ దీర్ఘకాల రోగాలు బీపీ, షుగర్ లాంటివి ఇబ్బంది పెడతాయ్. కాబట్టి ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, యోగా, వ్యాయామం చేయాలి. ప్రతీ శనివారం వెంటకేవ్వరస్వామిని దర్శించుకొని తులసి మాల సమర్పించాలి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Story first published: Tuesday, July 23, 2024, 12:25 [IST]
Desktop Bottom Promotion