Latest Updates
-
జంక్ ఫుడ్ వద్దు.. సాయంత్రం వేళ పిల్లల ఆరోగ్యానికి మేలు చేసే వేడివేడి సూప్ ఇదే! -
గ్రైండర్ అక్కర్లేదు..మిక్సీలో రుబ్బిన పిండితోనే పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ మినప వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు వెనక నుంచి పిలిస్తే అపశకునమా? -
నీరసాన్ని తరిమికొట్టే పవర్ స్నాక్..పిల్లల జ్ఞాపకశక్తిని పెంచే డ్రై ఫ్రూట్ చిక్కీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
మేక పాలలోని ఈ రహస్యం మీకు తెలుసా? ఆ సమస్యకు ఇదే బెస్ట్! -
బరువు తగ్గాలా? షుగర్ కంట్రోల్ అవ్వాలా? ప్రోటీన్,ఐరన్ పుష్కలంగా ఉండే ఈ దోసె బ్రేక్ ఫాస్ట్ కి బెస్ట్! -
కర్కాటకంలో గురు సంచారం.. అక్టోబర్ వరకు స్టడీస్, కెరీర్లో ఈ రాశుల వారికి ఎనలేని భాగ్యం.! -
లంచ్ బాక్స్‌లోకి క్విక్‌గా చేసుకునేలా ‘గీ రైస్’.. ముస్లిం వెడ్డింగ్ స్టైల్లో ఇలా చేసేయండి.! -
నలుగురితో నవ్వుతూ కలిసిపోవాలంటే ఈ 6 ప్రశ్నలు అస్సలు అడగకండి.! -
శ్రావణ మాసం స్పెషల్.. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాయసం.. పాలు లేకుండానే ఎంతో టేస్టీగా.!
మీ ఇంట్లో బొద్దింకలు పదే పదే కనిపిస్తున్నాయా? అయితే ఈ దోషం ఉన్నట్లే!
చాలామంది బొద్దింకను చూడగానే అసహ్యించుకుంటరు.ఇక ఇంట్లో బొద్దింక కనబడితే దాన్ని తరిమికొట్టేదాకా ఆగరు. అయితే పరిశుభ్రంగా లేని కిచెన్ లేదా ఇతర రూముల్లో బొద్దింకు ఉండటాన్ని మనం సాధారణంగా గమనిస్తుంటాం. అయితే ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకున్నప్పటికీ వీటి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉంటే మాత్రం కచ్చితంగా ఆలోచించాల్సిందే.
వాస్తు శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం.. ఇంట్లో బొద్దింకలు పదే పదే కనిపించడం అనేక పరిణామాలకు దారితీస్తుందని, ఇది ఇంట్లో నెలకొన్న ప్రతికూల శక్తులకు లేదా కొన్ని వాస్తు దోషాలకు సంకేతమని నిపుణులు చెబుతున్నారు.

ప్రతికూల శక్తులకు సంకేతం
వాస్తు శాస్త్రంలో మన చుట్టూ జరిగే అనేక విషయాలను శకునాలుగా పరిగణిస్తారు. అలా ఇంట్లో అకస్మాత్తుగా బొద్దింకల బెడద విపరీతంగా పెరిగితే, దానిని ఇంటి వాతావరణంలో నెగిటివ్ ఎనర్జీ లేదా అస్తవ్యస్తత ఆవరించడానికి సంకేతంగా భావిస్తారు. ఇంటి చుట్టుపక్కల ఉండే వాతావరణం, అపరిశుభ్రత వల్ల ఈ ప్రతికూల శక్తులు చురుకుగా మారి ఇంట్లో ప్రశాంతతను దూరం చేస్తాయని నమ్ముతారు.
ఆర్థిక నష్టాలకు సూచన
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో బొద్దింకల సంఖ్య అనూహ్యంగా పెరగడం అనేది ఆర్థిక అసమతుల్యతకు ప్రతీక. బొద్దింకలు ఎక్కువగా ఉన్న ఇంట్లో వృధా ఖర్చులు పెరుగుతాయని, ప్రణాళిక లేని వ్యయాలు చేయాల్సి వస్తుందని చెబుతారు. బొద్దింకల బెడద పెరిగినప్పటి నుంచి తరచుగా ధన నష్టం కలగడం, పొదుపు చేసిన డబ్బు కరిగిపోవడం లేదా అకస్మాత్తుగా ఖర్చులు రావడం జరిగితే.. అది కచ్చితంగా రాబోయే ఆర్థిక సమస్యలకు ముందస్తు సూచిక అని జ్యోతిష్యులు హెచ్చరిస్తున్నారు.
కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు
సాధారణంగా మురికిగా, తేమగా ఉండే ప్రదేశాలు ప్రతికూల శక్తిని వేగంగా ఆకర్షిస్తాయని వాస్తు శాస్త్రం వివరిస్తోంది. ఇంట్లో బొద్దింకలు పెరుగుతున్నాయి అంటే ఆ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ కూడా అదే స్థాయిలో పెరుగుతోందని అర్థం చేసుకోవాలి. దీనివల్ల ఇంట్లోని వారి మానసిక స్థితిపై ప్రభావం పడి, కుటుంబ సభ్యుల మధ్య తరచుగా చిన్న చిన్న విషయాలకే కోపతాపాలు రావడం, ఉద్రిక్తతలు పెరగడం, వాదనలు చోటుచేసుకోవడం లాంటివి జరుగుతాయి.
రాహు-కేతువుల దుష్ప్రభావం
జ్యోతిషశాస్త్రం ప్రకారం రాహువును గందరగోళానికి, అస్తవ్యస్తతకు, రహస్య సమస్యలకు కారకుడిగా భావిస్తారు. బొద్దింకలు ఎప్పుడూ చీకటిగా, తేమగా ఉండే ప్రదేశాల్లోనే ఎక్కువగా దాక్కుంటాయి. అందుకే కొందరు జ్యోతిష్య నిపుణులు బొద్దింకలను రాహువు ప్రతికూల ప్రభావంతో ముడిపెడతారు. ఇల్లు శుభ్రం చేసిన తర్వాత కూడా అవి పదేపదే మళ్లీ పుట్టుకొస్తుంటే, అది కచ్చితంగా ఇంట్లో శక్తి అసమతుల్యతకు, రాహువు అశుభ ప్రభావానికి నిదర్శనమని నమ్ముతారు.
ఈ ప్రదేశాల్లో బొద్దింకలు కనిపిస్తే అత్యంత అశుభం
ఇంట్లో అన్ని ప్రదేశాల కంటే ముఖ్యంగా వంటగది, పూజ గది, ధాన్యం లేదా ఆహార పదార్థాలు నిల్వ చేసే గదిలో బొద్దింకలు ఎక్కువగా కనిపిస్తే వాస్తు ప్రకారం అది అత్యంత అశుభకరం. ఎందుకంటే ఈ మూడు ప్రదేశాలు ఇంట్లో సుఖసంతోషాలకు, శ్రేయస్సుకు, సానుకూల శక్తికి మూలాధారాలు. కాబట్టి ఈ ప్రాంతాల్లో బొద్దింకలు చేరకుండా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications