Latest Updates
-
పాస్ వర్డ్ లో కామా పెడితే ఎవ్వరూ హ్యాక్ చేయలేరా? వైరల్ టెక్ ట్రిక్ వెనుక వాస్తవం ఇదే! -
కారంగా, కమ్మగా ఉండే కరివేపాకు చికెన్ రోస్ట్.. ఈ సీక్రెట్ మసాలాతో రుచి డబుల్! -
మన దేశం మధ్యలో ఉండి భారతీయులే వెళ్లలేని వింత గ్రామం..ఎక్కడుంది? ఆ కథేంటి? -
చలికాలంలో పచ్చి బఠానీ ఎందుకు తినాలో తెలుసా? -
చేపల వేపుడును మించిపోయే రుచితో కందగడ్డ ఫ్రై.. సింపుల్ గా ఇంట్లోనే చేసుకోండి ఇలా! -
ఒకే రకమైన ఎగ్ కర్రీ తిని విసిగిపోయారా? ఒక్కసారి ఈ నేపాల్ స్టైల్ ఎగ్ రెసిపి తింటే జన్మలో మర్చిపోరు! -
షుగర్ వ్యాధి వచ్చే ముందు కనబడే సంకేతాలు ఇవే! -
బిర్యానీకి మించిన రుచి..తక్కువ మసాలాలతో పిల్లలు,పెద్దలు మెచ్చే మొరాదాబాదీ చికెన్ పులావ్ ఇలా వండండి! -
India’s One Day Capital: ఒక్క రోజు మాత్రమే భారతదేశ రాజధానిగా ఉన్న నగరం ఏదో మీకు తెలుసా? -
ఇడ్లీ, దోశెలను వదలనివ్వని అద్భుతమైన మదురై స్పెషల్ చట్నీ..ఎలా చేసుకోవాలంటే..
బాలల దినోత్సవం స్పెషల్: ఓవెన్ లేకపోయినా పర్లేదు.. స్టవ్ మీదనే క్రిస్పీగా వేరుశెనగ బిస్కెట్లు చేసుకోండిలా!
ప్రతి ఏటా నవంబర్ 14న భారతదేశపు తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని బాలల దినోత్సవం(Children's day)ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటాము. ఈ ప్రత్యేక రోజున పిల్లలకు రుచికరమైన, ఆరోగ్యకరమైన స్నాక్ చేసి పెడితే ఆ సంతోషమే వేరుగా ఉంటుంది. బయట బేకరీలలో లేదా ప్యాకెట్లలో దొరికే బిస్కెట్లకి బదులుగా ఇంట్లోనే, కల్తీ లేని స్వచ్ఛమైన పదార్థాలతో కరకరలాడే వేరుశెనగ బిస్కెట్లు తయారు చేస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. టేస్ట్ నెక్ట్స్ లెవల్ ఉంటుంది. క్రిస్పీగా, క్రంచీగా నోట్లో వేసుకుంటేనే వెన్నలా కరిగిపోయేంత సాఫ్ట్ గా ఉంటాయి.
వేరుశెనగలలో ఎదిగే పిల్లలకు ఎంతో అవసరమైన ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్ E మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లల శారీరక ఎదుగుదలకు, మెదడు చురుకుదనానికి,రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతగానో తోడ్పడతాయి. పిల్లలకు స్కూల్ స్నాక్స్ బాక్స్‌లో లేదా సాయంత్రం వేళ పాలతో పాటు వేరుశెనగ బిస్కెట్లని ఇవ్వవచ్చు. పిల్లలే కాదు పెద్దలు అయినా కూడా వీటిని బాగా ఇష్టపడతారు. వేరుశెనగ బిస్కెట్లు తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-నెయ్యి లేదా బటర్
-షుగర్ పౌడర్ లేదా బెల్లం పొడి
-మైదా పిండి
-వెనీలా ఎసెన్స్
-బేకింగ్ సోడా
-పాలు
-వేరుశెగనపప్పు
చేపల వేపుడును మించిపోయే రుచితో కందగడ్డ ఫ్రై.. సింపుల్ గా ఇంట్లోనే చేసుకోండి ఇలా!
తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నె తీసుకోండి. అందులో అర కప్పు నెయ్యి లేదా బటర్, 1 కప్పు షుగర్ పౌడర్ లేదా బెల్లం పొడి వేసి విస్కర్ తో బాగా ఉండలు లేకుండా 2 నిమిషాలు క్రీమీగా అయ్యేవరకు కలుపుకోండి.
-2 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత అందులో 1 కప్పు మైదా పిండి వేయండి. ఇందులోనే ఫ్లేవర్ కోసం వెనీలా ఎెపెన్స్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ పాలు కూడా వేసి మొత్తం బాగా కలిసేలా చపాతీ పిండి కలుపుకున్నట్లుగా కలుపుకోవాలి.
-తర్వాత మిక్సీ జార్ లో వేరుశెనగపప్పులను బరకగా గ్రైండ్ చేసి వాటిలో సగం కలుపుకున్న పిండి మిశ్రమంలో వేసి కలిసేలా చేత్తో బాగా కలుపుకోవాలి.
-కలుపుకున్న పిండి మిశ్రమాన్ని గుంట గరిటలోకి కొంచెం కొంచెంగా తీసుకుని బిస్కెట్ల మందంలో వత్తుకోండి. దీనిని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న మిగతా సగంలో ఈ బిస్కెట్ ఒకవైపు అద్దుకోండి. తర్వాత బేకింగ్ ట్రేకి నెయ్యి అప్లయ్ చేసుకోండి.స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసి దాని మీద ఈ బేకింగ్ ట్రే పెట్టి దీనిమీద రెడీ చేసిన బిస్కెట్లను పెట్టి పైన మూతపెట్టి 25 నిమిషాలు బేక్ చేసుకుండి.
-తర్వాత మూత తీస్తే వేరుశెనగ బిస్కెట్లు రెడీ. స్టవ్ ఆపేసి మూత తీయగానే అవి కొంచెం మెత్తగా ఉంటాయి, పూర్తిగా చల్లారనివ్వండి అప్పుడు అవి క్రిస్పీగా వస్తాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
