Latest Updates
-
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.!
ఈ రాశుల వారు డిటెక్టివ్ ల కంటే డేంజర్!..భాగస్వామిని అనుమానిస్తూనే ఉంటారు!
ఏ బంధం అయినా సరే చివరిదాకా కొనసాగాలంటే నమ్మకం చాలా ముఖ్యమైన అంశం. ముఖ్యంగా నమ్మకం లేకుంటే ప్రేమ అనే కట్టడం పేకమేడల్లా కూలిపోతుంది. ప్రేమకు నమ్మకమే పునాది. అయితే కొందరి ప్రేమగా ఉన్నట్లు నటిస్తూనే అనుమానపు చూపుతోనే చూస్తుంటారు. తన భాగస్వామి తన దగ్గరే ఉండాలి, తన కళ్ల ముందే తిరగాలి, మరో వ్యక్తితో ప్రేమగా లేదా సరదాగా మాట్లాడకూడదు అని కోరుకుంటారు. ఇక ఇందులో ఏ చిన్న తేడా వచ్చినా లేదా ఫోన్ బిజీ వచ్చినా సరే మనుసులోకి వెంటనే అనుమానపు అలలు పరుగెత్తుకొస్తాయి.
వాస్తవానికి ఇది వారి వ్యక్తిత్వంలోని భాగమే అయినప్పటికీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశుల ప్రభావం కూడా దీనికి ఒక ముఖ్య కారణం. గ్రహాల స్థితిగతులు మన వ్యక్తిత్వాలను ఎంతగా ప్రభావితం చేస్తాయో, మన ప్రేమ సంబంధాలపై కూడా అంతే ప్రభావం చూపుతాయని జ్యోతిష్యశాస్త్రం తెలియజేస్తుంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఈ అనుమానం అనే గుణం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మరి ఆ రాశులు ఏవో, భాగస్వామి పట్ల వారి ప్రవర్తన ఎలా ఉంటుందో,జ్యోతిష్యశాస్త్రం ఏం చెబుతుందో ఇక్కడ చూడండి.

మేష రాశి
అగ్నితత్వానికి ప్రతీక అయిన మేష రాశి వారు ప్రేమలో చాలా తీవ్రంగా, ఆవేశంగా ఉంటారు. భాగస్వామిపై ఆధిపత్యం చలాయించాలనే తపన వీరిలో ఎక్కువగా కనబడుతుంది. ఈ స్వభావం కారణంగానే, వీరు తమ భాగస్వామి ప్రతి కదలికను ఒక డిటెక్టివ్ మాదిరి నిశితంగా గమనిస్తూ ఉంటారు. భాగస్వామి ఎవరెవరితో ఫోన్ లో మాట్లాడుతుంది..ఎవరితో ఫ్రెండ్ షిప్ చేస్తున్నారు వంటిప్రతి చిన్న విషయాన్ని శోధిస్తారు. వారి దృష్టి నుంచి ఏదీ తప్పించుకోలేదు. ఈ అతి అనుమానం వల్ల తరచుగా వీరి సంబంధాలలో కలహాలు, అశాంతి చోటుచేసుకుంటాయి.
వృషభ రాశి
భూతత్వానికి చెందిన వృషభ రాశి వ్యక్తులు స్థిరత్వాన్ని, సెక్యూరిటీని ఎక్కువగా కోరుకుంటారు. ఈ భద్రతా భావమే వారిలో అనుమానానికి బీజం వేస్తుంది. వీరు ఏ విషయాన్నైనా లోతుగా, కూలంకషంగా ఆలోచిస్తారు. తమ భాగస్వామి కొద్దిసేపు కనిపించకపోయినా లేదా వారి ప్రవర్తనలో చిన్న మార్పు వచ్చినా సరే ఇక వీరి మనస్సులో కల్పిత కథనాలు అల్లుకోవడం స్టార్ట్ అవుతుంది. ఆ ఆలోచనల సుడిగుండంలో చిక్కుకుని అనవసరంగా మానసికంగా కుమిలిపోతారు. ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడటం వీరి బలహీనత అని జ్యోతిష్యశాస్త్రం తెలియజేస్తుంది.
ధనుస్సు రాశి
సాహసానికి, స్వేచ్ఛకు మారుపేరైన ధనుస్సు రాశి వ్యక్తులు కూడా అనుమాన గుణం ఉండేటోళ్లే. అయితే వీరి అనుమానం మిగతావాళ్లలా కాకుండా కొంచెం భిన్నంగా ఉంటుంది. వీరు తమ భాగస్వామిపై ప్రత్యేకమైన దృష్టి పెడతారు. తమ భాగస్వామి జీవితంలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలనే బలమైన కోరిక వీరికి ఉంటుంది. తమ నుంచి ఏదో పెద్ద రహస్యాన్ని దాస్తున్నారేమోనన్న భావన వారిని నిరంతరం వేధిస్తుంది. ఈ పరిశీలన, పరిశోధన వల్ల భాగస్వామితో దూరం పెరిగే అవకాశం ఉంటుంది. స్వేచ్ఛను కోరుకునే ధనస్సు రాశి వాళ్లు తమ భాగస్వామికి కూడా అదే స్వేచ్ఛను ఇవ్వాలని గుర్తుంచుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications