Latest Updates
-
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్!
కుజుడి అనుగ్రహంతో జూన్ 1 నుండి ఈ 3 రాశుల వారు వ్యాపారంలో అభివృద్ధి లాభాల బాట పడతారు
Mars Transit In Aries On 01 June 2024: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాధిపతి అయిన అంగారకుడు జూన్ 1న తన రాశిని మార్చుకోబోతున్నాడు. ఎందుకంటే ప్రతి గ్రహం ఒక నిర్థిష్ట సమయం తర్వాత తన రాశిని మార్చుకుంటుంది. ఈ అంగారకుడు ధైర్యం, పరాక్రమం మరియు బలానికి కారకుడు. ఒకరి జాతకంలో కుజుడు మంచి స్థానంలో ఉంటే, ఆ వ్యక్తి ధైర్య సాహసాలు కలిగి ఉంటాడు.
అంగారకుడు మేష, వృశ్చిక రాశికి అధిపతి. ప్రస్తుతం ఈ అంగారకుడు గురు భగవానుడి రాశి అయిన మీనరాశిలో ఉన్నాడు. ఈ సందర్భంలో, అంగారక గ్రహం జూన్ ప్రారంభంలో దాని సొంత రాశి అయిన మేషరాశిలోకి సంచరించబోతున్నాడు.

సుమారు ఒక ఏడాది తర్వాత అంగారకుడు తన సొంత రాశికి మారబోతున్నాడు, దాని ప్రభావం అన్ని రాశులలో కనిపించినప్పటికి, కొన్ని రాశులకు మాత్రం వ్యాపారం మరియు కెరీర్‌లో మంచి పురోగతిని మరియు విజయాన్ని పొందుతారు. దాంతో ఈ మూడు రాశులపై సంపదల వర్షం కురిపిస్తాడు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.
ధనుస్సు రాశి
కుజుడు ధనుస్సు రాశిలోని 5వ ఇంట్లోకి ప్రవేశించబోతున్నాడు. అందువల్ల పిల్లలకు సంబంధించిన కొన్ని శుభవార్తలు వింటారు. ఉద్యోగార్ధులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ప్రేమలో ఉంటే, వివాహం జరగవచ్చు. ఏవైనా ఆటంకాలున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.ఆస్తులు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో ఒకరికొకరు పూర్తిగా అర్థం చేసుకుని పనులను పూర్తి చేస్తారు. విద్యార్థులు ఉన్నత చదవుల కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి
మేషరాశి
కుజుడు మేష రాశి యొక్క మొదటి ఇంట్లోకి ప్రవేశించబోతున్నాడు. దాంతో ఈ రాశుల వారికి ధైర్యసాహసాలు పెరుగుతాయి. వ్యాపారాల్లో కెరీర్‌లో మంచి పురోగతికి అవకాశాలు ఉంటాయి. అలాగే కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు మీ పై అధికారుల నుండి పూర్తి మద్దతు లభించడంతో ప్రమోషన్లు పొందుతారు. అలాగే కొత్త వాహనం, స్థిరాస్తులు కొనడానికి ప్లాన్ చేసుకుంటారురు. అలాగే వివాహితుల చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు.
సింహ రాశి
కుజుడు సింహరాశి యొక్క 9వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఈ కారణంగా, ఈ రాశుల వారికి అదృష్టం వరించే అవకాశాలు వందకు వందశాతం ఉన్నాయి. ఈ రాశి వారికి తెలివితేటలు, ధైర్యం పెరుగుతాయి. కార్యాలయంలో సహోద్యోగులతో సత్ససంబంధాలు మెరుగ్గా ఉంటాయి. విదేశాలకు వెళ్లాలనే మీ చిరకాల కోరిక నెరవేరుతుంది. ఈ రాశుల విద్యార్థులకు మరియు ఉద్యోగులకు విదేశీ ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications