Latest Updates
-
మీ పిల్లలు ఎక్కువగా ఎప్పుడు బాధపడతారో తెలుసా.. వారిలో ఈ మార్పులు చాలా ప్రమాదకరం.! -
జస్ట్ 10 నిమిషాల్లో ఝుమ్ అనిపించే జీడిపప్పు వెల్లుల్లి కారం..ఎలా చేసుకోవాలంటే.. -
ఖరీదైన షాంపూలు వద్దు.. కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి రాస్తే ఎంతటి చుండ్రయినా మాయం.! -
డబ్బు రెట్టింపు చేయడంలో వీరికి సాటి లేరు.. కుబేరుల జాబితాలే ఈ రాశుల వారే టాప్.! -
బ్లాక్ కాఫీ vs గ్రీన్ టీ.. బరువు తగ్గడానికి, షుగర్ కంట్రోల్ కి ఈ రెండింటిలో ఏది బెస్ట్? -
బ్రేకప్ తర్వాత కూడా..మాజీ లవర్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఎందుకు చూస్తారు? -
Chicken Kofta Recipe: రోటీ, బగారా రైస్‌లోకి అదిరిపోయే చికెన్ కోఫ్తా కర్రీ..ఈజీగా, టేస్టీగా ఇలా చేసుకోండి -
వేగంగా బరువు తగ్గించే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.. డయాబెటిస్‌ని ఈజీగా కంట్రోల్ చేసే కీర సలాడ్.! -
కరకరలాడే బెండకాయ భుజియా.. జిగురు లేకుండా ఈ స్నాక్ చేస్తే పిల్లలు కూడా వదిలిపెట్టరు! -
షుగర్ కంట్రోల్ కావాలంటే డైలీ ఎంత సేపు నడవాలి.. భోజనం తర్వాత ఇలా చేయాల్సిందే.!
Kuja Sancharam 2026: కర్కాటక రాశిలో కుజుడు.. నవంబర్ 12 వరకు ఈ 3 రాశులకు కష్టకాలం!
నవగ్రహాలలో సేనాధిపతిగా, ధైర్యసాహసాలకు, శౌర్య ప్రతాపాలకు ప్రతీకగా కుజుడిని(అంగారకుడు) పరిగణిస్తారు. మేష, వృశ్చిక రాశులకు అధిపతి అయిన కుజుడు సాధారణంగా ఒక రాశిలో 45 రోజుల పాటు కొలువై ఉంటాడు. అయితే ప్రస్తుతం కుజుడు చంద్రుడికి చెందిన కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. నవంబర్ 12 వరకు కుజుడు ఇదే రాశిలో ఉంటాడు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. అగ్ని తత్వమున్న కుజుడు, జల తత్వమున్న చంద్రుడి రాశిలో సంచరించడం వల్ల రెండు విభిన్న శక్తుల కలయిక ఏర్పడుతుంది. దీనివల్ల వాతావరణం కాస్త వేడెక్కుతుంది. ఈ గ్రహాల అసమతుల్యత వల్ల వ్యక్తుల ఆలోచనా విధానంలో మార్పులు వస్తాయి. సరైన నిర్ణయాలు తీసుకోవడం కష్టంగా మారుతుంది. ముఖ్యంగా కోపం, ఆవేశం, తొందరపాటుతనం వల్ల సమస్యలు కొనితెచ్చుకునే ప్రమాదం ఉంది. ఈ కుజ సంచారం వల్ల ఏయే రాశుల వారు అత్యంత అప్రమత్తంగా ఉండాలో ఇక్కడ చూడండి.

మేష రాశి
మేష రాశి వారికి కుజుడు నాలుగో ఇంట్లో సంచరిస్తున్నాడు. ఈ కాలంలో మీకు కష్టాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మకండి. వృత్తి, వ్యాపారాల్లో ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి, లేకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. పనులు త్వరగా అవ్వాలని షార్ట్ కట్స్ వెతకడం, నియమాలను ఉల్లంఘించడం చేస్తే పెద్ద చిక్కుల్లో పడతారు. వివాహ ప్రయత్నాల్లో కొన్ని అడ్డంకులు ఎదురుకావచ్చు. ఆఫీసులో ఒత్తిడి పెరిగి, ఉద్యోగం మారాలనే ఆలోచన రావచ్చు. ఏ పనైనా లాభనష్టాలు బేరీజు వేసుకున్నాకే ముందడుగు వేయండి.

కర్కాటక రాశి
కుజుడు మీ సొంత రాశిలో, అంటే మొదటి ఇంట్లో సంచరిస్తున్నాడు. కాబట్టి ముందుగా మీ ఆరోగ్యం పట్ల అస్సలు అశ్రద్ధ వద్దు. పని ఒత్తిడి వల్ల కుటుంబ సభ్యులతో సమయం గడపలేరు, ఇది ఇంట్లో అశాంతికి దారితీస్తుంది. ఆఫీసులో సహోద్యోగులతో గట్టి పోటీ ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఆవేశం పనికిరాదు. అనవసరపు ఖర్చులకు కళ్లెం వేయకపోతే ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ప్రేమ వ్యవహారాల్లో చిన్న చిన్న మాటలే పెద్ద మనస్పర్థలకు దారితీసే అవకాశం ఉంది, కాబట్టి నోరు జారకండి.
కన్యా రాశి
కన్యా రాశి వారికి కుజుడు 11వ ఇంట్లో (లాభ స్థానంలో) ఉన్నాడు. ఈ కాలంలో మీకు ఆర్థిక లాభాలు బాగానే ఉన్నప్పటికీ, దానికి తగ్గట్టుగానే ఊహించని ఖర్చులు వచ్చి పడతాయి. ఆదాయ వ్యయాల మధ్య బ్యాలెన్స్ పాటించడం చాలా ముఖ్యం. కోర్టు కేసులు లేదా ఆస్తుల వివాదాల వల్ల మీరు చుట్టూ తిరగాల్సి వస్తుంది. అదృష్టం కొద్దీ అంతా జరిగిపోతుందని ఏ పనీ గాలికి వదిలేయకండి. ప్రతి పనినీ ఒక పక్కా ప్రణాళికతో, ఓపికతో చేస్తేనే నష్టాల నుంచి బయటపడగలరు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
