Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
Mavalya rajyog: కొత్త ఏడాదిలో రాజ్యయోగం.. ఈ రాశుల వారు నేరుగా దేవతల వరం పొందుతారు!
జోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, రాశి మార్పులు సర్వ సాధారణంగా జరుగుతుంటాయి. ఏ గ్రహమైనా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారినప్పుడు దాని కారణంగా ఇతర రాశులు కూడా ప్రభావితం అవుతాయి. కొన్ని రాశుల వారికి అత్యంత శుభపరిణామాలు చోటు చేసుకుంటే మరికొన్ని రాశుల వారికి అత్యంత చెడు ఫలితాలు వస్తాయి. అయితే 2025లో శుక్రుడు తన రాశి నుంచి మరొక రాశిలోకి మారనున్నాడు. దీని కారణంగా మావల్య రాజ్యయోగం ఏర్పడుతుంది.
ఈ యోగం అత్యంత శుభమైనది. పైగా శుక్రుడు కారణంగా 2025లో ఏర్పడుతున్న మొట్టమొదటి యోగం అని చెప్పుకోవచ్చు. దీంతో మూడు రాశులకు చెందిన వ్యక్తులు అత్యంత లాభపడనున్నారు. వీరు చేపట్టబోయే పనులన్నీ విజయవంతం అవుతాయి. హైవేపై కార్ దూసుకెళ్లినట్లు వీరి జీవితం దూసుకెళ్లిపోతుంది. ఇంతకీ ఆ రాశులేంటో ఈ స్టోరీలో చర్చించుకుందాం.

మావల్య రాజ్యయోగం ఎప్పుడంటే?
జోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు ప్రస్తుతం మకర రాశిలో సంచరిస్తున్నాడు. అయితే 2025లో జనవరి 28వ తేదీన తనకు ఇష్టమైన రాశి, తనకు ఉన్నతమైన రాశి అయిన మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని కారణంగా మావల్య రాజ్య యోగం ఏర్పడుతుంది. జోతిష్యశాస్త్రం ప్రకారం మావల్య రాజ్య యోగం అనేది అత్యంత పవిత్రమైనది. దీనివల్ల కొన్ని రాశుల వారికి అత్యంత శుభ ఫలితాలు వస్తాయి. ఆ రాశులు ఏవేవంటే?
వృషభ రాశి:
ఈ రాశి వారికి అధిపతిగా గురువు ఉన్నారు. అలాగే ఈ రాశి వారిపై శుక్రుడు వల్ల ఏర్పడుతున్న మావల్య రాజ్య యోగ ఫలితాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి. దీని కారణంగా ఈ రాశికి చెందిన వ్యక్తులకు కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. భారీగా డబ్బును సంపాదిస్తారు. ఆస్తి, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. పాత పెట్టుబడులు కొత్తగా భారీగా లాభాలను తీసుకొస్తాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అత్యంత శుభప్రదంగా ఉండబోతుంది.
కర్కాటక రాశి
రాబోయే సంవత్సరం కర్కాటక రాశికి చెందిన జాతకులకు అత్యంత శుభప్రదమైనదిగా చెప్పుకోవచ్చు. పైగా ఈ రాశి వారికి మావల్య రాజ్య యోగం ఫలితాలు కలగనున్నాయి. దీని కారణంగా ఈ రాశికి చెందిన జాతకులు వచ్చే సంవత్సరం కొన్ని శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ భారీగా డబ్బులను సంపాదిస్తారు. దీని కారణంగా సమాజంలో గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకుల పరపతి పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టతలు నెలకొంటాయి.
ధనుస్సు రాశి
మీనరాశిలో శుక్రుడు సంచారం, అలాగే మావల్య రాజ్య యోగం కారణంగా ఈ రాశి వారికి వచ్చే సంవత్సరం అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారి జీవితంలో సంపదతో పాటు సుఖ సంతోషాలు, కీర్తి ప్రతిష్టతలన్నీ పెరిగిపోతాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. పూర్వీకుల ఆస్తి కూడా వీరికి ప్రాప్తి చెందుతుంది. ఉద్యోగుల జీత భత్యాలు పెరుగుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
