Latest Updates
-
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.!
సాయంత్రం కాగానే నోటికి కారంగా, కమ్మగా, క్రిస్పీగా ఏదో ఒకటి తినాలని అనిపిస్తుంటుంది ఎవరికైనా. ఇక వర్షాకాలంలో ఈ క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి. బజ్జీలు, పునుగులు, పకోడీలు ఇలా స్సైసీగా తినాలని ఆరాటపడుతుంటారు. అయితే వీటికి కొంచెం సమయం ఎక్కువగానే పడుతుంది. అందుకే ఈ సారి చాలా సింపుల్‌గా, త్వరగా అయిపోయేలా ఇలా పల్లీ పకోడీ ట్రై చేయండి. కరకరలాడుతూ నాలుకకి భలే రుచిని ఇస్తాయి.

స్వీట్ షాప్ స్టైల్ పల్లీ పకోడీకి కావాల్సిన పదార్థాలు
వేరుశనగ (పల్లీలు)- అరకేజీ
శనగపిండి- 125 గ్రాములు
బియ్యంపిండి- 3 టేబుల్ స్పూన్లు
కార్న్‌ఫ్లోర్- 3 టేబుల్ స్పూన్లు
పసుపు- పావు టీస్పూన్
ఉప్పు- టీస్పూన్
మసాలా కారం- టీస్పూన్
కారం- టీస్పూన్
ధనియాల పొడి- టీస్పూన్
జీలకర్ర పొడి- అర టీస్పూన్
గరం మసాలా- అర టీస్పూన్
నూనె- డీప్ ఫ్రైకి సరిపడా
కరివేపాకు- ఐదు రెబ్బలు
పచ్చిమిర్చి- ఐదు
చాట్ మసాలా- అర టీస్పూన్
స్వీట్ షాప్ పల్లీ పకోడీ తయారీ విధానం
స్వీట్ షాప్ స్టైల్ పల్లీ పకోడీ కోసం ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో పల్లీలను వేసుకోవాలి. ఇందులో శనగపిండి, బియ్యం పిండి, కార్న్‌ఫ్లోర్ వేసి కలపాలి.
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే!
అంతాకలగలిసిన తర్వాత పసుపు, రుచికి సరిపడా ఉప్పు, మసాలా కారం, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి మరోసారి కలుపుకోవాలి.
ఇప్పుడు ఇందులో కాసిన్ని నీళ్లు చిలకరించినట్లుగా చేసి మరీ లూజ్‌గా కాకుండా మరీ పొడిగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఈ స్టఫ్‌ను కాసేపు నాననివ్వాలి.

స్టవ్‌పైన బాణలి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకుని బాగా కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత కలిపి పెట్టుకున్న పల్లీ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా నూనెలో వేసి వేయించాలి.
ఇలా అన్నిటినీ నూనెలో వేయించి ఒక గిన్నెలో వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి. వీటిని పకోడీలో కలుపుకోవాలి. చివరిగా చాట్ మసాలా వేసి కలుపుకుని సర్వ్ చేసుకోవడమే.
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.!
సాయంత్రం సమయంలో టీ, కాఫీలోకి ఈ పల్లీ పకోడీ స్నాక్స్ క్రంచీగా, కారంగా ఉంటూ తినేకొద్దీ తినాలనిపించేలా ఉంటాయి. ఈ హెల్తీ స్నాక్స్‌ను ఈ కూల్ ఈవెనింగ్ తప్పనిసరిగా ట్రై చేయండి.
పల్లీలలో ప్రోటీన్లు, హెల్తీ ఫ్యాట్, ఫైబర్, విటమిన్ ఇ, మెగ్నీషియం పుష్కలంగా ఉండటం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచి బరువును నియంత్రిస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications