Latest Updates
-
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్‌ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.!
టీ లేదా కాఫీ లేనిదే ఎవరికైనా రోజు స్టార్ట్ కాదు. ఇక కొద్దిపాటి తలనొప్పి అనిపించినా ఆ రోజు ఎక్స్‌ట్రా డోస్ పడాల్సిందే. అంతలా మనం వీటికి అడిక్ట్ అయ్యాం. కొందరు టీ ఎక్కువగా తాగితే.. మరికొందరు కాఫీ ఎక్కువగా తాగుతుంటారు. అయితే తలనొప్పిగా ఉన్నప్పుడు ఈ రెండింటిలో ఏది బెస్ట్.. నిపుణుల సలహాలు చూద్దాం..

చాలా మంది రోజులో ఏదో ఒక సమయంలో తలనొప్పిగా ఫీలవడం జరుగుతూనే ఉంటుంది. దీనికి రిలీఫ్‌గా వెంటనే టీ లేదా కాఫీ సిప్ చేయాల్సిందే. ఒత్తిడి, నిద్రలేమి, డీహైడ్రేషన్, ఎక్కువసేపు స్క్రీన్ చూడటం ఇలా వివిధ కారణాల తలనొప్పితో బాధపడుతుంటారు. ఈ క్రమంలో వెంటనే టీ లేదా కాఫీని వేడివేడిగా ఇంత కడుపులో పోసేస్తారు. అయితే మరికొందరు వీటిని తాగడం వల్ల తలనొప్పి మరింత తీవ్రమవుతుందని కొందరు భావిస్తుంటారు. తలనొప్పి సమయంలో ఈ రెండింటిలో ఏం తాగాలి.. దీని వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకుందాం.

కెఫీన్ ప్రభావం
టీ లేదా కాఫీలో కెఫీన్ అనే పదార్థం వల్ల కొంతమందిలో తలనొప్పి, మైగ్రేన్ నుంచి ఉపశమనం కలిగించేందుకు దోహదపడుతుంది. ఈ క్రమంలో తలనొప్పికి వాడే మందుల్లో కెఫీన్‌ను కూడా కలుపుతారు. అయితే అధిక మొత్తంలో కెఫీన్ తీసుకోవడం వల్ల తలనొప్పి పెరిగే అవకాశం మరింత ఉంది. ఇది రోజూ రిపీట్ అయితే పరిస్థితి తీవ్రం కావచ్చు.
ఒక్కసారిగా ఆపేస్తున్నారా..
కాగా, కొంతమంది ఆరోగ్యం, డైట్ దృష్ట్యా టీ, కాఫీకి దూరంగా ఉంటారు. ఈ క్రమంలో ఒక్కసారిగా వాటిని మానేస్తారు. దీంతో ఒకేసారి కెఫీన్ తగ్గిపోవడం వల్ల ఒక్కసారిగా తలనొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో కెఫీన్ మోతాదును తగ్గించడం లేదా సేఫ్టీ కోసం డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం. ఈ మేరకు తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ తాగాలా వద్దా అని మీ అలవాట్లు, మీ బాడీ రియాక్షన్ బట్టి నిర్ణయించుకోవడం మేలు చేస్తుంది.

తలనొప్పి సమయంలో ఏం చేయాలి
తలనొప్పిగా ఉన్నప్పుడు పుష్కలంగా సరైన మోతాదులో నీళ్లు తాగాలి. ప్రశాంతంగా ఉండే గదిలో విశ్రాంతి తీసుకోవడం ద్వారా తలనొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మొబైల్ ఫోన్ చూడటం, ల్యాప్‌టాప్, టీవీ చూడటం కాసేపు తగ్గించుకోవాలి. ఎక్కువగా బ్రైట్‌నెస్, సౌండ్ ద్వారా తలనొప్పి మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఎక్కువ సేపు ఆకలితో ఉండకుండా సరైన సమయానికి భోజనం చేయాలి.

అయితే తలనొప్పి తీవ్రమైనప్పుడు మాత్రం వైద్యుడి సలహా లేకుండా పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. సరైన కారణాన్ని తెలుసుకునేందుకు డాక్టర్‌ను సంప్రదించాలి. అవసరమైతే వైద్య పరీక్షలు చేయించుకుని తలనొప్పి సమస్యను పరిష్కరించుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications