Latest Updates
-
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
ఈ రెండు గ్రహాల మధ్య అరుదైన దశాంక యోగం.. ఈ రాశుల వారికి ఎన్నడూ దక్కని అదృష్టం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం 12.37 గం.కి బుధ, కుజ గ్రహాల మధ్య అరుదైన దశాంక యోగం ఏర్పడబోతుంది. ఈ రెండు గ్రహాలు సుమారు 36 డిగ్రీల కోణంలోకి రానుండటం, కర్కాటక రాశిలో బుధుడు, గురుడు ఉచ్ఛ స్థితిలో ఉండటం ద్వారా ఈ గ్రహ సంయోగం విశేషమైనదిగా పండితులు చెబుతున్నారు. అయితే ఈ దశాంక యోగం ప్రభావం అన్ని రాశుల వారికి ఒకే విధంగా ఉండదు. ముఖ్యంగా ఐదు రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది. ఆ రాశులేంటి.. ఏయే రాశుల వారు ప్రయోజనాలు పొందుతారో చూద్దాం..

వృషభ రాశి
వృషభ రాశి వారికి దశాంక యోగం కృషి, సంభాషణ, మార్కెటింగ్, నెట్‌వర్కింగ్ అనుభవాలతో వారు సంపాదన అవకాశాలను మరింతగా మెరుగుపరుచుకుంటారు. మీడియా, సేల్స్, కంటెంట్, డిజిటల్ మార్కెటింగ్, కన్సల్టింగ్ రంగాల్లో ఉన్న వారు కొత్త ప్రాజెక్టులు పొందుతారు. అయితే మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం చాలా అవసరమని గుర్తించాలి.
కన్యారాశి
కన్యా రాశి వారికి ఈ దశాంక యోగం కారణఁగా వృత్తిపరంగా కొత్త బాధ్యతలు లేదా ముఖ్యమైన ప్రాజెక్టును పొందే అవకాశం ఉంది. మీ కష్టానికి తగినట్లుగా సానుకూల ఫలితాలు పొందుతారు. మీ పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి పాత పరిచయాలు, కొత్త క్లైంట్‌ల నుంచి లాభం పొందుతారు. మీ ప్రయత్నాలు చాలా చురుగ్గా ఉండటం అవసరం.
సింహ రాశి
దశాంక యోగంతో సింహ రాశి వారికి ఆదాయం విషయంలో ప్రయోజనాలు కనిపిస్తాయి. కొత్త పరిచయాలతో మీరు కోరుకున్నవి నెరవేరుతాయి. విదేశీ కంపెనీలు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు, ఐటీ, మీడియా, అంతర్జాతీయ క్లైంట్‌లతో సంబంధం ఉన్నవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

తులారాశి
తులారాశి వారికి ఈ యోగంతో అదృష్టం, కర్మ ఫలితాలు బలంగా ఉంటాయి. ఉద్యోగాలు మారాలనుకునేవారికి ఇది మంచి సమయం. పదోన్నతులు, కొత్త బాధ్యతలు పొందే అవకాశం ఉంది. విదేశీ కంపెనీలు, పెద్ద సంస్థలకు సంబంధించిన వ్యాపార అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. చేసే ప్రతి పనిలో శుభ సూచకాలు అందుకుంటారు.
మీన రాశి
దశాంక యోగంతో మీన రాశి వారు ధన, విద్య, ఆస్తి, వ్యాపార భాగస్వామ్య విషయాల్లో పురోగతి పొందుతారు. ఆస్తి, వాహన కొనుగోళ్లు ప్రణాళికలు ముందుకు సాగుతాయి. విద్యార్థులకి కెరీర్ పరంగా ఇది మంచి సమయం. వ్యాపారం రంగంలో భాగస్వామ్యం ప్రయోజనకరంగా ఉంటుంది. విద్య, క్రియేటివిటీల్లో మంచి ఫలితాలు అందుకుంటారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
