Latest Updates
-
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆగష్టు 17 నాగపంచమి సందర్భంగా కొన్ని రాశుల వారికి ప్రత్యేకంగా కలిసి రానుంది. ఆర్థికంగా, వృత్తి, వ్యాపార పరంగా అభివృద్ధి పొందే సూచనలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. నాగపంచమి సోమవారం రావడం ఆ రోజు శివుడికి అంకితం కాగా, సర్ప దేవును ఆశీస్సులు కూడా ఈ రాశులపై ఉండనున్నాయి. నాగపంచమి, సోమవారం ప్రత్యేక కలయిక సందర్భంగా మరి ఏయే రాశుల వారికి కలిసి రానున్నాయి. ఇక్కడ చూద్దాం..

కర్కాటక రాశి..
శ్రావణ సోమవారం, నాగ పంచమి కర్కాటక రాశి వారికి ఎంతో శుభప్రదంగా ఉండనుంది. కుటుంబీకుల నుంచి సంపూర్ణ మద్దతు లభించడంతో పాటు పని చేసే కూడా సపోర్ట్ అందుకుంటారు. ఫలితంగా ఉద్యోగం చేసే చోట మెరుగైన ఫలితాలు అందుకుంటారు. దీంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా సమయం గడిపేందుకు అవకాశాలు దొరుకుతాయి. ఫలితంగా మీ బంధంలో మాధుర్యం పెరుగుతుంది. కొత్త ప్రణాళికలు అమలు చేయవచ్చు. ముఖ్యమైన పనిలో విజయం సాధిస్తారు. దీంతో సంతోషంగా ఉంటారు.
కన్యారాశి
నాగుల పంచమి పవిత్రమైనరోజు సందర్భంగా కన్యారాశి వారికి కలిసి వస్తుంది. చేస్తున్న పనిలో విజయం సాధిస్తారు. ఆర్థికంగా లాభాలు అందుకుంటారు. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పాత పరిచయాల ప్రభావంతో కొన్ని ముఖ్యమైన పనులు నెరవేరుతాయి. కొత్త పనిని ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. సానుకూల ఫలితాలు పొందుతారు.

మకర రాశి
మకర రాశి వారు వృత్తి, వ్యాపార రంగాల్లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగం చేసే ప్రదేశంలో కొత్త బాధ్యతలు అందుకుంటారు. విజయం సాధిస్తారు. వృత్తిపరంగా కీలక నిర్ణయం తీసుకుంటారు. కుటుంబీకులతో సంతోషంగా గడుపుతారు. మీ ప్రియమైన వారితో గడిపేందుకు సమయం దొరుకుతుంది. శుభవార్తలు వినే సూచనలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య మనస్పర్థలు, అపార్థాలు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక యాత్రలు చేసే అవకాశం ఉంది. దీంతో మానసికంగా శాంతి, ప్రశాంతత పొందుతారు. ఒంటరిగా ఉండే వారి జీవితంలో మిమ్మల్ని ప్రభావితం చేసే వ్యక్తుల్ని కలుసుకుంటారు.
నాగుల పంచమి రోజు శివాలయాల్లో అభిషేకం, శివ పూజతో పాటు నాగదేవతకి అభిషేకం చేయడం ద్వారా ఆశీస్సులు పొందవచ్చు. సర్పకాల దోషం ఉన్నవారు వివిధ పరిహారాలు చేయడం, పాటించడం సానుకూల ఫలితాన్ని ఇస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
