Latest Updates
-
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.!
ఇక పెళ్లిల్లు శుభకార్యలకు 3 నెలల వరకు బ్రేక్.. ఏప్రిల్ 28 నుంచి ఆగస్టు 7 వరకు మౌఢ్యమి, ఆషాడమాసం
నేటి నుంచి మూడు నెలలపాటు ఎలాంటి శుభకార్యాలూ లేవని, వాటికి ముహూర్తాలు కుదరకపోవడమే కారణమని వేదపండితులు చెబుతన్నారు. తెలుగు క్యాలెండర్ ప్రకారం వైశాఖ, జ్యేష్ట, ఆషాడ మాసాల్లో ఎలాంటి శుభకార్యాలు లేవని పండితులు వెళ్లడించారు. దీంతో పెళ్లిళ్లతో పాటు గృహప్రవేశాలు, విగ్రహ ప్రతిష్టనలు, శంకుస్థాపనలకు బ్రేక్ పడనుంది. ప్రతీ సంవత్సరం ఈ సమాయాలనికి ఎక్కడా చూసినా పెళ్లి హడావిడే కనబడేది కానీ ఈ సంవత్సరం మాత్రం భిన్నంగా ఉంది.
ఏప్రిల్ 29 నుంచి యూడు నెలల వరకు వైశాఖ, జ్యేష్ట, ఆషాడ మాసాల్లో గురు శుక్ర మౌఢ్యమి కారణంగా సుమూహూర్తాలు లేవని పండితులు చెబుతున్నారు. ఈ కాలంలో సూర్యుడు గురు గ్రహంపై శుక్ర గ్రహంపై పడ్డంతో గురు శుక్రమౌఢ్యమి సంక్రమిస్తుందని వేద పండితులు చెబుతున్నారు.
మూఢమి అని దేనిని అంటారంటే..?
నవగ్రహాలన్నీ కలిసి సూర్యుడి చుట్టూ తిరుగుతాయ్. అలా భూమి కూడా తిరుగుతుంది. భూమి, సూర్యుడు ఒకే వరసలో వచ్చినప్పుడు భూమిపై ఉన్న వారికి సూర్యుడు కనపడడు, అది అశుభం కావడం వల్ల దానిని మూఢమి అంటారు. ఈ మూఢమిలో మళ్లీ రెండు రకాల మూఢములుంటాయ్ అవే గురు మూఢమి, శుక్ర మూఢమి.

సూర్య గ్రహానికి గురు గ్రహం సమీపానికి వచ్చినప్పుడు గురుగ్రహం తన బలహీనతను కోల్పోతుంది. ఇదే వరసలో శుక్ర గ్రహం కూడా సూర్య గ్రహానికి సమీపాన వచ్చి తన బలాన్ని కోల్పోతుంది. ఈ రెండు గ్రహాలు తమ బలాన్ని కోల్పోతాయ్. కానీ శుభకార్యాలను గురు, శుక్ర గ్రహాల బలాలు చాలా అవసరం అందువల్లే వీటికి బలం లేకపోవడం వల్ల శుభకార్యాలకు బ్రేక్ పడుతోంది.
మూఢమి ఎప్పుడు ఉంది ?
ఏప్రిల్ 28 చైత్ర బహుళ చవితి ఆదివారం నుంచి జులై 8 ఆషాడ శుధ్ద తదియ సోమవారం వరకు శుక్ర పౌఢ్యమి ఉంది, ఇక మే 7 చైత్ర బహుళ చతుర్ధశి మంగళవారం నుంచి జూన్ 7 జ్యేష్ఠ శుక్ల పాడ్యమి గురువారం వరకు శుక్ర పౌఢ్యమి ఉంది. ఆషాడ మాసంలో కూడా శుభకార్యాలను నిర్వహించరు కాబట్టి జులై 6 నుంచి ఆగస్టు 4 వరకు ఉండే ఆషాడమాసంలో కూడా శుభకార్యాలకు బ్రేక్ వేయక తప్పదని పండితులు చెబుతున్నారు.
మూఢమి ఉన్నప్పుడు ఏమి చేయవద్దు :
వివాహానికి సంబంధించిన ఏ పనులు చేయవద్దు. పుట్టు వెంట్రికలు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు ఇలా ఎలాంటి శుభకార్యాలు కూడా చేయడానికి వీలు లేదని పండితులు చెబుతున్నారు.
మూఢమి రోజు ఏమి చేయవచ్చు ?
పెళ్లిల్లు, శుభాకార్యాలు చేయవద్దు కానీ ఇంటి రిపోర్లు, ప్రయాణాలు, కొత్త బట్టలు కొనుక్కోవడం, భూములు కొనడం లాంటివి చేయవచ్చని అంటున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications