Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
అరుదైన యోగం.. ఈనెల 15, 16, 17 తేదీల్లో ఈ రాశుల వారు అనుకున్నవన్నీ జరుగుతాయి!
జోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల కలయిక అనేది తరచూ జరుగుతుంటాయి. ఒక రాశిలో ఉండే గ్రహం తన మార్చుకున్నప్పుడు అదే రాశిలో ఇప్పటికే సంచరిస్తున్న గ్రహంతో కలుస్తుంది. దీని కారణంగా గ్రహాల కలయిక జరిగి పలు యోగాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అయితే ఈనెల 15, 16, 17వ తేదీల్లో వృషభ రాశిలో చంద్రుడు, గురువులు కలుసుకోనున్నారు. దీని కారణంగా పూర్తిస్థాయి గజకేసరి రాజయోగం ఏర్పడనుంది.
ఈ గజకేసరి రాజయోగం కారణంగా పలు రాశుల వారికి అదృష్టం పట్టుకోనుంది. వారు అనుకున్న కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే వ్యాపారంలో లాభాలను ఆర్జించగలుగుతారు. ఇంతకీ ఏ ఏ రాశుల వారికి ఈ గజకేసరి యోగం పట్టుకోనుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం:
ఈ రాశి వారికి ధన స్థానంలో గురు, చదువుల కలయిక జరగనుంది. దీని కారణంగా ఈ రాశివారికి గజకేసరి యోగం భారీగా పట్టుకోనుంది. దీని కారణంగా మేష రాశి జాతకుల ఆస్తి సమస్యలు పరిష్కారమవుతాయి. ఆదాయ ప్రయత్నాలన్నీ సఫలీకృతమవుతాయి. కుటుంబానికి సంబంధించిన ఆస్తిపాస్తులు లబ్ది చెందనున్నాయి. చేపట్టే పనులన్నీ విజయవంతమవుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యం జరగడానికి ఆస్కారం ఉంది.
వృషభ:
ఈ రాశి చంద్రుడికి ఉచ్ఛరాశి. అయితే ఈ రాశిలో గురు, చంద్రులు లాభ స్థానంలో కలయిక చెందడం వల్ల ఈ రాశి వారికి కూడా పూర్తి స్థాయిలో గజకేసరి యోగం పట్టుకోనుంది. ఈ యోగం కారణంగా ఆదాయ ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. ఆదాయ మార్గాలు పెరిగి, ఆర్ధిక అనిశ్చితి నుంచి బయటపడతారు. ఉద్యోగ జీవితంలో ఈ రాశి వారి ప్రభావం పెరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్లి విరుస్తాయి. పిల్లలు తమ తమ రంగాల్లో రాణించడంతో పాటు సంతానయోగ్యం కలగనుంది.
కర్కాటక:
ఈ రాశికి అధిపతి చంద్రుడు. అలాంటి చంద్రుడు ఉచ్ఛపట్టడంతో పాటు గురువుతో కలవడంతో ఈ కర్కాటక రాశి జాతకులకు కూడా యోగ ఫలితాలు దక్కనున్నాయి. దీని కారణంగా కర్కాటక రాశి జాతకుల జీవితంలో శుభపరిణామాలు చోటు చేసుకోనున్నాయి. జీవితంలో ఇప్పటివరకు ఎదుర్కొంటున్న పలు సమస్యలపైన విజయం సాధిస్తారు. ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి. ఆదాయం రెట్టింపు అవుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి అవి లాభదాయకంగా మారనున్నాయి.
కన్య:
ఈ రాశి వారికి భాగ్య స్థానంలో గురు చంద్రులు కలుసుకోనున్నారు. దీని కారణంగా కన్య రాశి వారికి ఆ స్థానంలోనే పూర్తి స్థాయిలో గజకేసరి యోగం ఏర్పడనుంది. దీని కారణంగా ఈ రాశి వారికి ఉద్యోగ జీవితం చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభించడంతో పాటు మరింత మంచి ఉద్యోగంలో మారే అవకాశం ఉంది. అలాగే జీతం కూడా పెరిగే ఛాన్సుంది. ఈ మూడు రోజుల్లో కన్య రాశి వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా అది భవిష్యత్తులో సత్ఫలితాలను ఇవ్వనుంది. ఆస్తిపాస్తులు బాగా కలిసిరావడంతో పాటు ఆస్తుల విలువ పెరగనుంది.
వృశ్చిక:
ఈ రాశి వారికి సప్తమ స్థానంలో ఈ గురు చంద్రుల కలయిక వల్ల ఏర్పడుతున్న గజకేసరి యోగం అద్భుతమైన ఫలితాలను ఇవ్వనుంది. వృశ్చిక రాశి జాతకులకు సమాజంలో గుర్తింపు లభించనుంది. రాజకీయ ప్రముఖుల పరిచయాలు పెరగనున్నాయి. అన్ని వైపుల నుంచి ఆదాయం పెరగడంతో పాటు ఉద్యోగంలో వేతనాలు పెరగడం, జీతం పెరగనున్నాయి. ఉన్నతస్థాయి వ్యక్తులతో ప్రేమలో పడడంతో పాటు, పెళ్లిళ్లు కూడా కుదరనున్నాయి.
మకరం:
ఈ రాశివారు జాతకంలో గురు చంద్రులు పంచమ స్థానంలో కలుసుకోనున్నారు. అదే స్థానంలో వీరికి ఈ గజకేసరి యోగం పట్టనుంది. దీని కారణంగా మకర రాశి జాతకులు వృత్తి, వ్యాపారాల్లో రాణిస్తారు. అనేక సమస్యల నుంచి విముక్తి పొందుతారు. ఈ రాశివారు చేపట్టే పనులన్నీ విజయవంతమవుతాయి. అనేక విధాలుగా ఆదాయం పెరిగి ముఖ్యమైన సమస్యలన్నీ తొలిగిపోతాయి. శుభవార్తలు ఎక్కవగా వింటారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
