Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
మహాకుంభమేళా వేళ ఆకాశంలో మహాద్భుతం..దీన్ని చూడటం అస్సలు మిస్ అవొద్దు
ఈ ఏడాది ఫిబ్రవరి 26న మహాశివరాత్రి జరుపుకుంటారు. అదే రోజున ప్రయాగరాజ్ లో జరిగే మహాకుంభమేళా ముగుస్తుంది. అయితే మహాకుంభమేళా ముగిసిన కొన్ని గంటల తర్వాత ఆకాశంలో అద్భుతం జరగనుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఫిబ్రవరి 28 చాలా ప్రత్యేకమైన రోజు. ఆ రోజు రాత్రి సమయంలో సౌర కుటుంబంలోని ఏడు గ్రహాలు బృహస్పతి, శుక్రుడు, బుధుడు, వరుణుడు, కుజుడు, శని, యురేనస్ ఒకే లైన్ లోకి రానున్నాయి. ఈ అద్భుత విన్యాసాన్ని భూమి నుంచి నేరుగా చూడవచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు.
యురేనస్ , నెప్ట్యూన్ గ్రహాలు చాలా మసకగా ఉండటం వలన బైనాక్యులర్స్ లేదా టెలిస్కోప్ ఉపయోగించి చూడాలని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గత నెలలో కూడా యురేనస్ , నెప్ట్యూన్, శుక్రుడు, కుజుడు, బృహస్పతి, శని గ్రహాలు ఒకే లైన్ లో కనిపించాయి..అయితే ఫిబ్రవరి 28న ఈ లైన్ లోకి బుధుడు కూడా చేరనున్నాడు. ఈ గ్రహాలన్నీ సూర్య గ్రహానికి ఒక వైపున చేరి కవాతును సృష్టిస్తాయని, సూర్యుని కక్ష్య ఒకే తలంలో ఉండటం వలన ఆకాశంలో సూర్యుని స్పష్టమైన మార్గంలో ఈ ఏడు గ్రహాలు ఉంటాయని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

ఈ గ్రహాల విన్యాసం స్పష్టంగా చూడాలంటే తక్కువ కాలుష్యం ఉన్న ప్రదేశంలో చూడొచ్చు. ఆకాశం స్పష్టంగా కనిపించాలి. సూర్యాస్తమయం తర్వాత లేదా తెల్లవారుజామున గ్రహాల విన్యాసం స్పష్టంగా కనపడుతుంది . టెలిస్కోప్ తో చూస్తే మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఏడూ గ్రహాలు ఒకే వరుసలో అమరిపోవడం చాలా అరుదుగా జరిగే సంఘటన. హిందూ ఆచార సంప్రదాయాల్లో గ్రహ కూటమిని విశేషమైనదిగా చెప్పబడుతుంది.ఇలాంటి అరుదైన ఘట్టం పరేడ్ ఆఫ్ ప్లానెట్స్ చూసే అవకాశాన్ని వదులుకోకండి. ఎందుకంటే ఒకేసారి ఏడు గ్రహాల కవాతు ఇప్పట్లో ఉండదని,ఎందుకంటే ఈ అరుదైన సంఘటన చాలా అరుదుగా జరుగుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
మళ్ళీ జరుగుతుందా?
2025 ఆగస్టు మధ్యలో మరో గ్రహాల కవాతు జరుగుతుందని, అప్పుడు ఉదయం ఆకాశంలో ఆరు గ్రహాలు కనిపిస్తాయి అని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications