Latest Updates
-
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే..
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.!
ఒక సంస్థలో పనిచేసే ఏ ఉద్యోగికి అయినా పనివేళలు తప్పనిసరి. ఇది కార్మిక హక్కుల్లో ప్రధానమైనది. పనివేళలకి మించి పనిచేయడం ద్వారా వారి ఆరోగ్యంపైనా, వ్యక్తిగత, కుటుంబ జీవితంపైనా ప్రభావం చూపిస్తుంది. అందుకే ప్రభుత్వ, ప్రైవేట్.. రంగం ఏదైనా పనివేళలకు మించి చేయకూడదనే నిబంధనలు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఓ బ్యాంకు బ్రాంచ్‌లో పనివేళలు ముగిసినా ఉద్యోగులు పని పూర్తయ్యే వరకు బయటరకు వెళ్లకుండా ప్రధాన గేటుకు తాళం వేసిన ఘటన సోషల్ మీడియా వైరల్ అవుతోంది.

మన దేశంలో వర్క్ కల్చర్‌పై చర్చలు జరగడం కొత్తేమీ కాదు. కార్యాలయ వాతారణం, ఉద్యోగులతో పై స్థాయి అధికారులు వ్యవహరించే తీరుపై సోషల్ మీడియాలో చర్చలు, ప్రశ్నలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. పని తీరుపై బహిరంగంగా తోటి ఉద్యోగుల ముందు అవమానించడం, మందలించడం వంటివి చోటుచేసుకుంటూనే ఉన్నాయి. దీని వల్ల ఉద్యోగులు లక్ష్యాన్ని సాధించేందుకు శారీరక ఒత్తిడితో పాటు మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇది పలు అనారోగ్య సమస్యలకు దారితీస్తుందనే చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతూ పని సంస్కృతిపై మళ్లీ చర్చకు దారితీసింది.
సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియో నెటిజన్లను దిగ్భ్రాంతికి గురిచేసింది. సమాచారం ప్రకారం.. బ్యాంకు సిబ్బంది పని వేళలు పూర్తయిన అనంతరం తమ విధులు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే వారు బయటకు వెళ్లకుండా బ్యాంకు మేనేజర్ మెయిన్ గేటుకు తాళం వేశారు. పని పూర్తయిన తర్వాతే ఇంటికి వెళ్లాలంటూ మేనేజర్ గట్టిగా చెప్పడం వీడియోలో కనిపిస్తోంది.
వీడియోలో ఉద్యోగులు ఆఫీసు టైం ముగిసిందని.. తాము ఇంటికి వెళ్లాలని చెబుతున్నప్పటికీ వారి అభ్యర్థనను వినిపించుకోలేదు. పని పూర్తయ్యేవరకు ఉద్యోగులు బయటకు వెళ్లకూడదని మేనేజర్ స్పష్టం చేశారు. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగిందనే దానిపై ధ్రువీకరణ సమాచారం లేదు. కానీ ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు పని సంస్కృతి, ఒత్తిడిపై చర్చకి దారితీసింది. తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
సిబ్బంది బాధ
మేనేజర్ గేటుకి తాళం వేస్తున్న క్రమంలో తమ విధులు పూర్తయ్యాయని.. తమను బయటకు వెళ్లడానికి అనుమతించాలని ఉద్యోగులు వివరించారు. ఓవర్‌టైమ్ తప్పనిసరి కాదని చెప్పినా కూడా మేనేజర్ వినిపించుకోకుండా గేటుకి తాళం వేసి వెళ్లిపోతారు.
నెటిజన్ల అభిప్రాయం
దీంతో ఈ వీడియోలో మేనేజర్ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇది ఉద్యోగి హక్కుల ఉల్లంఘనగా పరిగణిస్తున్నారు. ఉద్యోగులను వారి ఇష్టానికి వ్యతిరేకంగా కార్యాలయంలో ఉంచడం సరికాదన్నారు. బలవంతంగా ఓవర్‌టైమ్ పనిచేయడం ఆమోదయోగ్యం కాదని వాదిస్తున్నారు. దీనిని విషపూరితమైన సంస్కృతికి ఉదాహరణగా పేర్కొంటున్నారు. దీంతో ఈ వీడియో నిజమో కాదో అధికారికంగా ధ్రువీకరణ లేనప్పటికీ.. మేనేజర్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవడం దేశంలో వర్క్ కల్చర్‌పై మరోసారి చర్చనీయాంశమైంది.



Click it and Unblock the Notifications