Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.!
భోజనం చేసిన తర్వాత చాలా మంది తరచుగా కడుపు నొప్పి సమస్యతో బాధపడుతుంటారు. అయితే దీనిని చాలా మంది సాధారణంగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ దీనిని లైట్ తీసుకోవద్దని.. ఇది తీవ్రమైన అనారోగ్య సమస్యకు సంకేతం కావచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని సంకేతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

బ్రేక్‌ఫాస్ట్, లంచ్ లేదా డిన్నర్.. తిన్న తర్వాత చాలా మంది కడుపు నొప్పి సమస్యను అనుభవిస్తుంటారు. కొందరిలో ఈ నొప్పి తేలికపాటిగా ఉండి కాసేపటి తర్వాత తగ్గిపోతుంది. అందుకే దీనిని సాధారణ సమస్యగా భావించి వదిలేస్తారు. కానీ ఇదే సమస్యను మళ్లీ మళ్లీ ఎదుర్కొంటున్నట్లయితే దానిని తేలికగా తీసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కడుపు నొప్పికి కారణాలు
భోజనం తర్వాత కడుపు నొప్పి సమస్యకు పలు కారణాలు ఉంటాయని వైద్య నిపుణులు అంటున్నారు. అజీర్తి సమస్య, గ్యాస్, ఒకేసారి ఎక్కువ తినడం, లేదంటే వేగంగా తినడం, మసాలా పదార్థాలు తీసుకోవడం, అలర్జీకి కారణమయ్యే ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా ఈ సమస్య వస్తుంది. ఈ నొప్పి తరచుగా వస్తూ ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్య నిపుణుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు. కడుపు నొప్పి సమస్యను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స తీసుకోవడం ద్వారా ఉపశమనం పొందవచ్చు..

ఏయే వ్యాధులకు సంకేతం
భోజనం తర్వాత వచ్చే కడుపు నొప్పి అనేక అనారోగ్య సమస్యలకు సంకేతంగా నిపుణులు చెబుతున్నారు. పిత్తాశయంలో రాళ్లు ఏర్పడితే కడుపు పైభాగంలో తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. ఆయిల్ ఫుడ్, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, అల్సర్ కారణంగా తిన్న వెంటనే కడుపు నొప్పి ఏర్పడుతుంది. క్లోమ గ్రంథి వాపు ఉన్నా ఇది కడుపు నొప్పికి దారితీస్తుంది. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా వాంతులు, విరేచనాలు, వికారం కలిగినప్పుడు కడుపు నొప్పి ఏర్పడుతుంది. తిన్న ఆహారం సులభంగా జీర్ణం చేసుకోలేకపోయినా కడుపు నొప్పి వస్తుంది. ఈ సమస్య పదే పదే వస్తుంటే నిర్లక్ష్యం చేయకూడదు..
ఈ జాగ్రత్తలు తీసుకోండి..
భోజనం చేసిన వెంటనే మీకు తేలికపాటిగా కడుపు నొప్పి అనిపిస్తే కాసేపు విశ్రాంతి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తర్వాత పుష్కలంగా నీరు తాగాలి. ఈ సమస్య ఉన్నవారు తేలికగా ఉండే సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం శ్రేయస్కరం. వేయించిన, మసాలా ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచింది. మీకు అజీర్తి, గ్యాస్ సమస్యలు ఉన్నట్లయితే తిన్న తర్వాత కాసేపు నడవడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తేలికపాటి నొప్పి అయినా.. పదే పదే నొప్పిని అనుభవిస్తున్నట్లయితే కారణం తెలుసుకునేందుకు వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. డాక్టర్‌ను సంప్రదించకుండా ఎలెాంటి మందులను తీసుకోకూడదు.
నిర్లక్ష్యం వద్దు
కడుపు నొప్పితోపాటు అధిక జ్వరం, నిరంతరం వాంతులు ఉండటం, వాంతుల్లో రక్తం పడటం, మల విసర్జన సమయంలో రక్తం పడటం, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు ఉన్నట్లయితే నిర్లక్ష్యం చేయకూడదు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తినా, తల తిరగడం, స్పృహ కోల్పోయినట్లు అనిపించినా తీవ్రమైన సంకేతాలుగా భావించి వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications