Latest Updates
-
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే.. -
ఫోన్ పక్కనపెట్టి ఇది ట్రై చేయండి.. హృతిక్ చెబుతున్న హెల్త్ టిప్స్! -
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.!
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.?
స్నానం చేయడానికి సరైన పద్ధతి ఉందంటే నమ్ముతారా.? ఇది వినడానికి వింతగా అనిపించవచ్చు. కానీ తప్పుగా స్నానం చేసే పద్ధతుల ద్వారా ఆరోగ్యానికి హాని కలుగజేస్తుందని మీకు తెలుసా.? ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతిలో స్నానం చేయడం ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. మరి సరైన విధానం ఏంటి.? ఇక్కడ తెలుసుకుందాం.

ఉదయం నిద్ర లేవగానే మన దైనందిన జీవితం కాలకృత్యాలు అనంతరం స్నానం చేసిన తర్వాత మొదలవుతుంది. అయితే తలస్నానం చేసేటప్పుడు చాలా మంది నేరుగా తలపై నీళ్లు పోసుకుంటారు. కానీ ఇది సరైంది కాదు. ఆయుర్వేదం ప్రకారం మీ శరీర ఉష్ణోగ్రత, రక్త ప్రసరణను పరిగణనలోకి తీసుకుని స్నానం చేయాలి. ముఖ్యంగా జలుబు, తల నొప్పి, రక్తపోటు సమస్యలు ఉన్నవారు.. తలపై అకస్మాత్తుగా చల్లటి నీరు పోసుకుంటే అది నేరుగా శరీరంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. అయితే ప్రతి వ్యక్తి శరీరం భిన్నంగా ఉన్న వారి కారణంగా ఆరోగ్య స్థితిని బట్టి అలవాట్లలో మార్పులు ఉంటాయి. ఈ క్రమంలో ఆయుర్వేద శాస్త్రం మేరకు స్నానం చేసేటప్పుడు సరైన పద్ధతి ఏంటి.. శరీరంలో మొదటగా ఏ భాగంపై నీళ్లు పోసుకోవాలో చూద్దాం..
ముందుగా పాదాలపై నీళ్లు..
ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ముందుగా స్నానం చేసేటప్పుడు పాదాలతో ప్రారంభించాలి. మొదటగా పాదాలపై నీళ్లు పోయడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇలా చేయడం ద్వారా శరీరం క్రమంగా నీటి ఉష్ణోగ్రతకు అలవాటు పడుతుంది. ఆ తర్వాత చేతులు, శరీరం చివరిగా తలపై నీళ్లు పోసుకుని స్నానం ప్రారంభించాలి. తద్వారా మీ బాడీ సౌకర్యవంతంగా ఫీలవుతుంది.
తలపై నీళ్లు పోయడం శ్రేయస్కరమేనా
తలస్నానం చేసేటప్పుడు చాలా మంది నేరుగా తలపై నీళ్లు పోసుకుంటారు. ఆయుర్వేదం ప్రకారం ఇది సరైన పద్ధతి కాదు. తల భాగంలో హఠాత్తుగా నీళ్లు పోయడం ద్వారా కొందరిలో తల నొప్పి, కళ్లు తిరగడం, అసౌకర్యంగా ఫీలవడం వంటివి తలెత్తవచ్చు. మైగ్రేన్, సైనస్ సమస్యలు ఉన్నవారు, రక్తపోటు ఉన్నవారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

శరీర ఉష్ణోగ్రత
స్నానాన్ని మొదటగా పాదాలపై నీళ్లు పోయడంతో ప్రారంభించిన తర్వాత నీటి ఉష్ణోగ్రతకు శరీరం అలవాటు పడి ఆకస్మిత ఉష్ణోగ్రత మార్పుల వల్ల కలిగే అసౌకర్యం నుంచి బయటపడుతుంది. రోజులో ఉదయం సమయంలో స్నానం చేయడం ద్వారా శరీరం, మనసు ఉత్తేజకరంగా ఉంటుంది.
ఆయుర్వేద టిప్స్
స్నానం చేసేటప్పడు మరీ చల్లటి నీరు, మరీ వేడి నీరు ఉపయోగించకూడదని ఆయుర్వేదం చెబుతుంది. అధిక వేడి నీటి ద్వారా చర్మంపై సహజ తేమ తొలగిపోతుంది. మీ శరీర అవసరాలను బట్టి నీటి ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి. స్నానానికి ముందు నూనెతో శరీరానికి తేలికపాటి మర్దన చేయండి. ఇలా చేయడం ద్వారా మీ బాడీకి తేమ అంది తగిన విశ్రాంతి లభిస్తుంది. ఎక్కువ సేపు నీటిలో ఉండకండి. లేదంటే చర్మం పొడిబారుతుంది. స్నానం తర్వాత శరీరాన్ని పూర్తిగా ఆరబెట్టుకోండి. తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోండి. శుభ్రమైన, పొడి టవల్ వాడటం ద్వారా చర్మ సమస్యలు రాకుండా నివారించవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications