Latest Updates
-
వెల్లుల్లి ఘాటు,టమాటా పులుపు,గుడ్డు కమ్మదనం.. నోరూరించే టమాటా గార్లిక్ ఎగ్ రైస్! -
రోజువారీ ఆహారంలో వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారా.?.. మీ కిడ్నీలు రిస్క్‌లో పడినట్లే.! -
ప్రేమకు, పెళ్లికి జెన్ జీ యువత ఎందుకు దూరమవుతోంది? -
భాగస్వామి ఎంపిక విషయంలో పదే పదే తప్పు చేస్తున్నారా.. మిమ్మల్ని ఇరకాటంలో పెట్టే విషయాలివే.! -
మధ్యాహ్నం 12 లేదా 2 గంటలకే చెక్ ఇన్..హోటల్స్ ఫాలో అయ్యే రూల్ వెనుక అసలు కథ! -
బఠానీ, పెసరపప్పు కాంబినేషన్... ఈ సమోసా రుచి చూస్తే మళ్లీ మళ్లీ తింటారు! -
వ్యాయామం చేసటప్పుడు విపరీతంగా చెమట.. కొవ్వు కరిగిపోతుందని అస్సలు సంబరపడొద్దు.! -
ఉదయం లేవగానే ఒళ్లు నొప్పులు, జాయింట్స్ పట్టేస్తున్నాయా? -
పప్పులు నానబెట్టే పనిలేదు,రుబ్బే శ్రమలేదు..అటుకులు,బంగాళదుంపలతో క్షణాల్లో కరకరలాడే అప్పడాలు.. -
ప్రెగ్నెన్సీలో చర్మం ఎందుకు నల్లబడుతుందో తెలుసా.. పిగ్మెంటేషన్‌ను ఇలా పోగొట్టుకోండి.!
2025లో దరిద్రాన్ని ఎడమ కాలుతో తన్నే రాశులు ఇవే.. డబ్బుల మేడలు కడతారు!
జోతిష్య శాస్త్రంలో శుక్రుడు, రాహు గ్రహాలు చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. ఎవరి జాతకంలో అయితే రాహువు, శుక్ర గ్రహాలు సంచరిస్తాయో వారికి అద్భుతమైన ప్రయోజనాలు దొరుకుతాయని పండిత నిపుణులు చెబుతుంటారు. అయితే 2025లో ఈ రెండు గ్రహాలూ ఒకే రాశిలో ప్రవేశించి సంచారం చేయబోతున్నారు. దీని కారణంగా నాలుగు రాశులకు చెందిన వారికి అద్భుతమైన ఫలితాలు దక్కనున్నాయి. డబ్బు, ఉద్యోగం, పెళ్లి, కుటుంబ జీవితం పరంగా మంచి రోజులను చవిచూస్తారు. ఆ రాశులు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కర్కాటక
రాహువు, శుక్ర గ్రహాల సంచారం కారణంగా కర్కాటక రాశికి చెందిన వారు తమ జీవితంలో దరిద్రానికి ముగింపు పలకనున్నారు. అద్భుతమైన శ్రేయస్సును ఫలితాలను పొందుతారు. అలాగే తమ జీవితంలో గొప్ప పురోగతిని సాధిస్తారు. వీరికి ప్రభుత్వ రంగంలోని ఉద్యోగార్ధులకు అనేక ముఖ్యమైన ప్రాజెక్టులలో పని చేసే అవకాశం లభిస్తుంది. ఆ అవకాశం లభిస్తుంది.

అప్పుల బారి నుంచి బయటపడతారు. వ్యాపారస్తులు భారీగా లాభాలను పొందుతారు. పెట్టుబడులు కూడా లాభదాయకంగా మారతాయి. పనికి తగిన ప్రసంశలు దొరుకుతాయి. విలాసవంతమైన ఇల్లు, ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది.
తులా రాశి
ఈ రెండు గ్రహాల కలయిక, సంచారం వలన ఈ రాశికి చెందిన ఉద్యోగులకు మంచి ఫలితాలు దొరుకుతాయి. కార్యాలయంలో మంచి వాతావరణం నెలకొంటుంది. అప్పుల బాధలు తీరిపోతాయి. వీరి ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. అలాగే మంచి ప్రశంసలను అందుకుంటారు. ఉద్యోగం కోసం చూస్తున్న వ్యక్తులు మంచి జీతంతో భారీ ఉద్యోగాన్ని సొంతం చేసుకుంటారు. వ్యాపారస్తులకు ఉండే ఆటంకాలు తొలిగిపోతాయి. కళారంగంలో పని చేస్తున్న వ్యక్తులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం కూడా అద్భుతంగా ఉంటుంది.
మీన రాశి
ఈ రెండు గ్రహాల కలయిక, సంచారం ఈ రాశి వారికి ఊహించని ఫలితాలను అందించనుంది. వీరికి అనేక విధాలుగా డబ్బులు సంపాదించే మార్గాలను ఇస్తుంది. ఆర్ధిక సమస్యలు కూడా తీరిపోతాయి. ఈ కాలంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు పెట్టుబడి విలువ కూడా భారీగా పెరుగుతుంది. వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. అలాగే శాంతి వాతావరణం నెలకొంటుంది. ఈ రెండు గ్రహాల కారణంగా ఈ రాశులకు చెందిన వ్యక్తుల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. చిరకాల కోరిక నెరవేరుతుంది.
ధనుస్సు రాశి
ఈ రెండు గ్రహాల కారణంగా ఈ రాశికి చెందిన వ్యక్తులు కూడా మంచి ఫలితాలను పొందుతారు. వృత్తి, వ్యాపార జీవితంలో అనేక విజయాలను సాధిస్తారు. ఈ రాశి వారు తమ పొదుపును పెంచుకుంటారు. పనిలో అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగంలో కొత్త కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది వారి గౌరవాన్ని, ఆర్ధిక పరిస్థితిని పెంచుతుంది. విదేశాలకు వెళ్లే అభ్యర్థులకు మంచి అదృష్టం కలుగుతుంది. అలాగే విదేశాలకు వెళ్లాలనుకునే వ్యక్తులకు మంచి అవకాశాలు లభిస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications