Latest Updates
-
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి!
అరుదైన రాశి పరివర్తన యోగం.. ఆ రాశుల వారికి పెరగనున్న ఆదాయం! ఆ రాశులు ఏవంటే?
గ్రహాల సంచారం, వాటి గమనంలో మార్పు కారణంగా పలు రాశుల వ్యక్తుల జీవితాలు మారుతాయని మన పెద్దలతో పాటు, జోతిష్య నిపుణులు కూడా విశ్వసిస్తూ ఉంటారు. అయితే రాశుల పరివర్తనం వల్ల కూడా ఈ జాతకాలు మారుతాయని పేర్కొంటున్నారు. అయితే నవంబర్ 3, 4, 5వ తేదీల్లో కుజుడు, చంద్రుడు మధ్య రాశి పరివర్తనం చోటు చేసుకోనుందట. దీని కారణంగా చంద్ర మంగళ యోగం అనే భాగ్య యోగం ఏర్పడనుంది.
ఈ భాగ్య యోగం కారణంగా పలు రాశుల జీవితాలు మారనున్నాయి. ఆకస్మిక ధనలాభం, వస్తులాభం జరగనుంది. జీవితం ఒక్కసారిగా టర్న్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఎలాంటి రాశుల వారిపై ఈ చంద్ర మంగళ యోగం ఉండనుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఏ ఏ రాశుల వారికి ఈ యోగం పట్టనుందంటే..

వృషభం: ఈ రాశి వారికి కుజుడు, చంద్రుడు తృతీయ, సప్తమా స్థానంలో సంచరితున్నారు. వీరిద్దరి పరివర్తన కారణంగా ఈ రాశి వారు ఏ కార్యం తలపెట్టినా అది విజయవంతమై తీరుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమై, ఆస్తి లబ్ది జరగనుంది. మంచి కుటుంబంతో పెళ్లి సంబంధం ఖరారయ్యే అవకాశం కనిపిస్తుంది.
కర్కాటక రాశి: ఈ రాశి వారికి అధిపతి చంద్రుడు. అలాంటి రాశ్యధిపతి చంద్రుడు కుజుడిని కలవడం వల్ల కర్కాటక రాశి వారికి అనూహ్యంగా ధనలాభం చేకూరనుంది. అనుకోకుండా కొన్ని భూములు కలిసివస్తాయి. భూముల క్రయ విక్రయాల్లో లాభాలు గడిస్తారు. తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తి కూడా పొందుతారు. ఉద్యోగంలో జీత భత్యాలు పెరగనున్నాయి. వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడానికి ఇది అనువైన సమయంగా చెప్పుకోవచ్చు.
తుల రాశి: చంద్ర మంగళ యోగం అనే ఈ ధన యోగం.. తులా రాశి వారికి దశమ స్థానంలో పట్టనుంది. దీని కారణంగా ఈ రాశి వారికి తండ్రి వైపు నుంచి ఆస్తి లాభం జరగనుంది. అలాగే ఉద్యోగాల్లో ప్రొమోషన్స్, జీతాలు పెరగడం వంటి మంచి పనులు చోటు చేసుకోనున్నాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల్లో దూసుకెళ్లనున్నాయి. సంపద లాభాల్లో దూసుకెళ్లనుంది.

వృచ్చిక రాశి: ఈ రాశి వారికి అత్యంత అరుదైన ఈ చంద్ర మాంగళ్య యోగం రెండుసార్లు పట్టనుంది. ఈ రాశికి అధిపతి అయిన కుజుడుతో చంద్రుడు కలవడం వల్ల.. ఆకస్మికంగా ధనలాభం పొందే అవకాశముంది. అలాగే విదేశీ డబ్బు కూడా ప్రాప్తి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ జీవితం మూడు పూలు ఆరు కాయలుగా సాగనుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు పొందుతారు.
మకరం: ఈ రాశి వారికి కుజ, చంద్రులు సప్తమ, లాభ స్థానంలో సంచరిస్తున్నారు. అయితే వీరిద్దరూ పరివర్తన చెందడం వల్ల.. ఈ రాశి వారు చెప్పటి నుంచో అనుకుంటున్న ఒక కార్యక్రమం పూర్తవుతుంది. ఒక సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమ పెళ్లి జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల దృష్ట్యా విదేశాలకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. లాభదాయకమైన పరిచయాలు ఏర్పడి, ఆదాయ మార్గాలు పెరగనున్నాయి. తద్వారా ఆదాయం కూడా పెరగనుంది.
మీన రాశి: ఈ రాశి వారికి ఈ ధనయోగం పంచమ స్థానంలో పట్టనుంది. దీనికారణంగా ఈ రాశి వారికి ఈనెల 27వ తేదీ వరకు లాభ కాలం కొనసాగనుంది. రావాల్సిన సొమ్ము చేతికి వస్తుంది. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అన్ని రకాలుగా ఈ రాశివారికి కాలం అనుకూలంగా ఉండనుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
