Latest Updates
-
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.?
Shani Bakri: 30 ఏళ్ల తర్వాత శని బక్రి ప్రభావం..3 రాశులకు ఊహించని ధనలాభాలు!
జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల సంచారానికి ముఖ్యంగా శని గోచారానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. నవగ్రహాలన్నింటిలో శనికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అంగారక గ్రహం తర్వాత ఒక వ్యక్తి జీవితంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహంగా శనిని పరిగణిస్తారు. శని ఒక రాశి నుండి మరో రాశిలోకి మారడానికి సుమారు రెండున్నర సంవత్సరాల సమయం పడుతుంది. ఈ కాలంలో శని ఆయా రాశులపై తనదైన ముద్ర వేస్తాడు. ఈ సంచారం వల్ల కొందరికి శుభ ఫలితాలు, మరికొందరికి అశుభ ఫలితాలు కలుగుతాయి. అయితే ఇది వ్యక్తిగత జాతకంలోని గ్రహ స్థితులు, దశాంతర్దశలపై కూడా ఆధారపడి ఉంటుంది.
శని సంచారం జరిగేటప్పుడు అది కేవలం ఆ ఒక్క రాశినే కాకుండా, దానికి ముందు, వెనుక ఉన్న రాశులను, అలాగే కొన్ని ప్రత్యేక దృష్టిలతో ఇతర రాశులను కూడా ప్రభావితం చేస్తుంది. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని వంటివి శని సంచారంలోని కీలకమైన దశలు. దాదాపు 30 ఏళ్ల తర్వాత ప్రస్తుతం శని బక్రి వచ్చింది. శని తన కక్ష్యలో వెనుకకు కదులుతున్నట్లు కనిపించడాన్ని శని బక్రి అంటారు. జ్యోతిష్య శాస్త్రంలో,శని బక్రి ఒక ముఖ్యమైన కాలంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో శని శక్తి అంతర్ముఖంగా మారుతుందని నమ్ముతారు. ప్రస్తుత శని సంచారము వల్ల 3 రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి.

వృషభ రాశి
వృషభ రాశి వారికి శని ప్రస్తుతం వారి రాశికి ఐదవ స్థానమైన పూర్వ పుణ్య స్థానంలో సంచరిస్తున్నాడు. పంచమ స్థానం విద్య, బుద్ధి, సంతానం, సృజనాత్మకత, ప్రేమ వ్యవహారాలు, ఊహాగానాలకు సంబంధించినది. ఇక్కడ శని సంచారం వల్ల వృషభ రాశి వారికి అంతా శుభప్రదంగా ఉంటుంది. చాలాకాలంగా అనుకుంటున్న పనులు, ఆగిపోయిన ప్రణాళికలు ఇప్పుడు కార్యరూపం దాల్చుతాయి. ముఖ్యంగా విద్యార్థులకు ఇది అనుకూల సమయం. ఉన్నత విద్య, విదేశీ విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సృజనాత్మక రంగాలలో ఉన్నవారికి విశేషమైన పేరుప్రఖ్యాతులు లభిస్తాయి. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగం పొందే బలమైన అవకాశాలున్నాయి. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. పెట్టుబడుల నుండి మంచి లాభాలు అందుతాయి. అయితే శనివారం నాడు శనికి తైలాభిషేకం చేయడం, నల్ల నువ్వులు దానం చేయడం, పేదలకు సహాయం చేయడం వంటి నియమాలను పాటించడం వల్ల శని అనుగ్రహం రెట్టింపు అవుతుంది. ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ అవసరం.
మిథున రాశి
మిథున రాశి వారికి శని సంచార ప్రభావాలు అత్యంత అనుకూలంగా ఉండనున్నాయి. ఈ కాలంలో మీరు పెట్టే ప్రతీ పెట్టుబడి రెట్టింపు వృద్ధిని సాధిస్తుంది. షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ వంటి రంగాలలో లాభాలు గడిస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇది సరైన సమయం. వృత్తి, వ్యాపారాలలో శత్రువులపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తారు. కోర్టు కేసులు, వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి.
ఆర్థిక పరిస్థితి మరింత స్థిరంగా మారుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు, ప్రభుత్వ కార్యాలయాలలో పెండింగ్‌లో ఉన్న వ్యవహారాలు ఆశ్చర్యకరంగా, సులభంగా పూర్తవుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం కూడా సహకరిస్తుంది.
కన్య రాశి
కన్య రాశి వారికి శని ప్రస్తుతం వారి రాశికి ఎనిమిదవ స్థానమైన అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. సాధారణంగా అష్టమ శని కొంత కష్టనష్టాలను సూచిస్తాడు. కానీ కొన్ని ప్రత్యేక జాతకాలకు,ముఖ్యంగా కన్య రాశి వారికి ఈ సంచారం కొన్ని అనూహ్యమైన, సానుకూల ఫలితాలను ఇవ్వనుంది. ఎనిమిదవ ఇల్లు వారసత్వం, ఆకస్మిక ధనలాభం, పరిశోధన, జీవిత భాగస్వామి ఆర్థిక వనరులకు సంబంధించినది. దీని ప్రభావం వల్ల చాలా కాలంగా నలుగుతున్న కోర్టు కేసులలో అద్భుతమైన విజయం సాధిస్తారు. పూర్వీకుల ఆస్తి, వారసత్వపు హక్కులు చేతికి అందుతాయి. కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. కుటుంబంలో చాలాకాలంగా కొనసాగుతున్న వివాదాలు, మనస్పర్థలు పరిష్కారమవుతాయి. మీ జీవిత భాగస్వామి నుండి సంపూర్ణ సహకారం, మద్దతు లభిస్తాయి. వారి ద్వారా కూడా ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. వైవాహిక జీవితం సంతోషంగా, అన్యోన్యంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అవసరం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications