Latest Updates
-
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి!
వక్ర త్యాగం చేసిన శని.. ఈ రాశుల వారికి శనిదోషం తొలిగిపోతుంది.. ఆ రాశులు ఏంటంటే?
నవగ్రహాల్లో అత్యంత శక్తివంతమైన శనీశ్వరుడు వక్రించి ఉండడం వల్ల శని ప్రభావం అనేది చాలా అధికంగా ఉంటుంది. దీని కారణంగా ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని వంటి ప్రభావాలు చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈనెల 15వ తేదీన శని వక్ర త్యాగం చేయనున్నాడు. దీని కారణంగా పలు రాశుల వారిపై ఉన్న శని ప్రభావం చాలా వరకు తగ్గనుంది. ఈ శని వక్ర త్యాగం ఉన్నన్నీ రోజులు ఆయా రాశుల వారికి అన్ని విధాలుగా కలిసి రానుంది.
తిరిగి వక్ర త్యాగం రోజులు ముగిసిన తరువాత తిరిగి ఆ రాశుల వారికి శని దోషాలు మొదలవనున్నాయి. అయితే శనీశ్వరుడి వక్ర త్యాగం వల్ల ఏ రాశుల వారికి మంచి జరగనుంది. ఏ రాశుల వారికి దోషాలు తొలగనున్నాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి ప్రస్తుతం అష్టమ శని దోషం నడుస్తోంది. దీని కారణంగా కర్కాటక రాశికి చెందిన జాతకులు ఉద్యోగంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. పనిభారం బాగా పెరుగుతుంది. రావాల్సిన సొమ్ము కూడా రాకుండా పోతుంది. చేపట్టిన పనులేవీ విజయవంతమవవు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలను ఆటంకాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలను కూడా పొందలేకపోవచ్చు. అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బందిపెడతాయి.
అయితే శని వక్ర త్యాగం చేయడం, అలాగే శనీశ్వరుడు స్వక్షేత్రంలో ఉండడం వల్ల ఈ సమస్యలు ఏవీ ఉండకపోవచ్చు. లేదా కొంతమేర ఈ దోషానికి సంబంధించిన ప్రభావం తక్కువగా ఉండవచ్చు. అందుకే ఈ వక్ర త్యాగం వల్ల ఈ రాశి వారికి చాలా మేలు జరగనుంది.
సింహ: ఈ రాశి వారికి సప్తమ స్థానంలో శని సంచరిస్తున్నాడు. అలాగే శని దోషానికి సంబంధించిన ప్రభావం కూడా ఈ రాశి వారిపై అధికంగా ఉంటుంది. చేపట్టే ప్రతిపనిలోనూ శ్రమ, ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. రావాల్సిన సొమ్ము రాదు. అప్పులు చెల్లించే వ్యక్తులు ముప్పు తిప్పలు పెట్టె అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు, శ్రమ ఎక్కువగా ఉంటుంది. లాభం చాలా తక్కువగా ఉండడంతో పాటు తీవ్రమైన ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది.

అయితే శని వక్ర త్యాగం చేయడం, అలాగే స్వక్షేత్రంలో ఉండడం వల్ల సింహ రాశి వారికి శశ మహా పురుష యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా ఈ రాశివారికి ఈ త్యాగం ఉన్నన్ని రోజులు ధన, అధికార యోగం పట్టుకోనుంది. ఆదాయ మార్గాలు పెరగడంతో పాటు, సమాజంలో గుర్తింపు లభిస్తుంది. రాజకీయ వ్యక్తులు భారీగా తమ ప్రభావాన్ని చూపించగలుగుతారు.
వృశ్చిక: ఈ రాశి వారికి చతుర స్థానంలో శని సంచరిస్తున్నాడు. దీని కారణంగా వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం అర్ధాష్టమ శని దోషం కొనసాగుతుంది. ఈ అర్ధాష్టమ శని దోషం కారణంగా ఈ రాశికి చెందిన జాతకులకు ఒత్తిడి పెరుగుతుంది. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. ఇంట్లో జరగాల్సిన శుభకార్యాలన్నీ నిలిచిపోతాయి. రావాల్సిన డబ్బులు చేతికి అందదు. ఆరోగ్య సమస్యలు మొదలవడంతో పాటు స్వగృహ కల నెరవేరకుండా ఆటంకాలు ఏర్పడతాయి.
అయితే ఈ రాశి వారికి వక్ర త్యాగం, స్వక్షేత్రంలోనే శనీశ్వరుడు ఉండడం వల్ల ఈ రాశివారికి కూడా ఈ శశ మహా పురుష యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా పైన పేర్కొనబడిన సమస్యలన్నీ కూడా ఈ రాశి వారికి తాత్కాలికమే అవుతాయి. శనిదోష ప్రభావం కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది.
మకరం: ఈ రాశి వారికి శనీశ్వరుడు ద్వితీయ స్థానంలో సంచరిస్తుండడం వల్ల ఏలినాటి శని దోషం ఏర్పడింది. ఈ దోషం కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. జీవితంలో అధఃపాతాళంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. ఏ కార్యక్రమం విజయవంతమవదు. పనులన్నీ బెడిసికొడతాయి. ఆదాయమార్గాలన్నీ మూసుకుపోయి ఆర్ధిక అనిశ్చితిలో ఉండిపోతారు. ఆరోగ్య సమస్యలు కూడా చాలా ఇబ్బందులను కలిగిస్తాయి. ఇంట్లో చిక్కులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి.
అయితే శనీశ్వరుడు ఈ రాశికి అధిపతి అవడం, వక్ర త్యాగం చేయడం అలాగే స్వక్షేత్రంలో ఉండడం వల్ల మకర రాశికి చెందిన జాతకులకు కూడా ఈ దోష ప్రభావం తగ్గిపోనుంది. ఏలినాటి శని దోషానికి సంబంధించిన సమస్యలు కూడా తొలిగిపోయి అవకాశం ఉంటుంది.
కుంభ: ఈ రాశికి శనీశ్వరుడు అధిపతి. అలాగే ఇదే రాశిలో శని సంచరిస్తుండడం వల్ల ఈ రాశి వారికి కూడా ఏలినాటి శని దోషం ఏర్పడుతుంది. అయితే ఈ రాశికి అధిపతిగా శని ఉండడం వల్ల ఆ దోషానికి సంబంధించిన ప్రభావం ఎక్కువగా ఉండకపోవచ్చు. కానీ చేపట్టే పనులన్నీ ఆగిపోయే ప్రమాదం ఉంది. పనుల్లో శ్రమ, ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాలను ఆచితూచి తీసుకోవాలి.
అయితే శని వక్ర త్యాగం, శని ఈ రాశికి అధిపతి అయినందుకు ఈ సమస్యల ప్రభావం కొంత తగ్గనుంది. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడినప్పటికీ.. పని భారం, శారీరక శ్రమ పెరిగే అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యలు తొలిగిపోయినప్పటికీ.. దీర్ఘకాలంలో అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు.
మీన: ఈ రాశి వారికి శనీశ్వరుడు 12వ స్థానంలో శని సంచరిస్తున్నాడు. దీని వల్ల మీన రాశి వారికి కూడా ఏలినాటి శని దోషం పట్టుకుంది. దీని కారణంగా జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్ధిక భారం జీవితంలో పెను సవాలుగా మారుతుంది. ఉద్యోగ జీవితంలో కూడా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే శనీశ్వరుడి వక్ర త్యాగం, స్వక్షేత్రంలోనే శని ఉండడం వల్ల ఈ సమస్యల ప్రభావం కొంత వరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ సమస్యలు తీవ్రతరం కాకుండా కొంతమేర ఊరట లభించే ఛాన్సుంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications











