Latest Updates
-
శవాల ముక్కు, చెవుల్లో దూది ఎందుకు పెడతారో తెలుసా? గరుడ పురాణం ఏం చెబుతోంది? -
ఆరోగ్యానికి మేలు చేసే మునగకాయ పచ్చడి ..ఇలా చేస్తే ఏడాది అయినా అస్సలు పాడవదు! -
అక్టోబర్ 11న చిత్త నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశుల వారు జర భద్రం! -
బిర్యానీ కూడా దీని ముందు బలాదూర్.. తెలంగాణ స్టైల్ బగారా రైస్, పనీర్ కర్రీ ఇలా చేసి తింటుంటే స్వర్గమే! -
ఉద్యోగులూ అలర్ట్..మెడ, వెన్ను నొప్పులతో నరకం చూస్తున్నారా? విముక్తి కోసం ఏం చేయాలంటే? -
రైస్, చపాతీలోకి అద్దిరిపోయే బంగాళదుంప ముద్ద కూర.. ఇలా చేస్తే మళ్లీ మళ్లీ అడుగడం గ్యారెంటీ! -
గుడిసెలో ఉండే బిచ్చగాడికి 21 మంది భార్యలు..ఏం బెల్లం పెట్టావ్ రా అయ్యా.. -
ఎలక్ట్రిక్ కెటిల్ ఎలా క్లీన్ చేయాలి? ఈ సింపుల్ ట్రిక్ తో నిమిషాల్లో కొత్తదానిలా మెరుస్తూ.. -
అసలు సిసలైన పల్లీ చట్నీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్లీ మళ్లీ కావాలంటారు! -
అక్టోబర్ 9న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని.. ఏయే రాశుల తలరాత మారనుందంటే?
నవరాత్రి మొదటి రోజే ప్రమాదకర వైధృతి యోగం.. ఈ 3 రాశుల వారికి బ్యాడ్ టైమ్ షురూ!
అత్యంత శక్తివంతమైన, అశుభకరమైన యోగాలలో వైధృతి యోగం(vaidhriti yoga)ఒకటి. ఈ యోగం సమయంలో ఏ పని తలపెట్టినా ఆటంకాలు తప్పవని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరిగ్గా ఈ ఏడాది శరన్నవరాత్రుల(Sharad Navaratri) మొదటి రోజైన 2026 అక్టోబర్ 11న ఈ ప్రమాదకరమైన వైధృతి యోగం ఏర్పడబోతోంది.
వైధృతి యోగం ప్రభావం కారణంగా ప్రధానంగా మూడు రాశుల వారు వృత్తి, వ్యక్తిగత జీవితాల్లో తీవ్ర సవాళ్లను ఎదుర్కోబోతున్నారు. ఆ రాశులేమిటో, వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ చూడండి.

మిథున రాశి
మీరు చేస్తున్న పనుల్లో ఊహించని జాప్యం, ఆటంకాలు ఎదురవుతాయి. ఈ సమయంలో కొత్త పెట్టుబడుల జోలికి వెళ్లకపోవడమే ఉత్తమం. వరుస వైఫల్యాలతో మీలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. కుటుంబ జీవితంలో అల్లకల్లోలం ఏర్పడే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో గొడవలకు దూరంగా ఉండండి. గతంలో మిమ్మల్ని వేధించిన ఆరోగ్య సమస్యలు మళ్లీ తిరగబడవచ్చు. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించండి. స్వదేశీ లేదా విదేశీ ప్రయాణాల్లోనూ ఇబ్బందులు రావచ్చు.

కన్యా రాశి
ఆఫీసులో మీపై పని భారం విపరీతంగా పెరుగుతుంది, కానీ తోటి ఉద్యోగుల నుండి ఎలాంటి మద్దతూ లభించదు. కార్యాలయంలో కావాలనే మిమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారనే భావన మీలో కలుగుతుంది. ఈ ఒత్తిడి తట్టుకోలేక ఉద్యోగం మానేయాలనే ఆలోచన రావచ్చు, కానీ తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు.
ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న నిరుద్యోగులకు కూడా ఈ కాలంలో నిరాశే ఎదురవుతుంది. ఇప్పుడు చేసే పెట్టుబడుల వల్ల తీవ్ర నష్టాలు వస్తాయి. వైవాహిక జీవితంలోనూ మనస్పర్ధలు చోటుచేసుకుంటాయి. ప్రయాణాలలో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తంగా ఉండండి.
మకర రాశి
ఏ పనిలోనూ తొందరపాటు పనికిరాదు, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. మీరు సాధారణంగా మాట్లాడే మాటలను కూడా ఇతరులు అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది, దీనివల్ల కొత్త సమస్యలు కొనితెచ్చుకుంటారు. కాబట్టి మీ వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోకండి. ఆర్థికంగా గడ్డు కాలం నడుస్తుంది.
రాబడి తగ్గడం, వృథా ఖర్చులు పెరగడం వల్ల డబ్బు ఆదా చేయడం కష్టంగా మారుతుంది. ఆఫీసులో తోటి వారి నుండి ప్రతికూల వ్యాఖ్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు కఠినమైన పదాలు వాడకండి. అనవసర ప్రయాణాలు రద్దు చేసుకోవడం బెటర్.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
